ఇంటర్వ్యూ

రచయిత తన రచన పట్లనిర్మమకారంగా ఉండాలి

మహమూద్‌ నాకెంతో ఇష్టమైన కవుల్లో ఒకడు. ఆ మాటకొస్తే సొంత ఊరు వాడు కాబట్టి ఇంకాస్త ఎక్కువే ఇష్టం. మహమూద్‌ని నేను మొదటి సారి 1999 -2000 ప్రాంతంలో  ప్రొద్దుటూరుకు వెతుక్కుంటూ వెళ్లి కలిశాను. అప్పటి నుంచి నాకు అతనితో సాన్నిహిత్యం ఉంది. నాకు మహమూద్‌ అంటే మిత్రజ్యోతి సంస్థ వ్యవస్థాపక సభ్యుడు.  “సీమ కవిత’’ సంకలనం ఎడిటర్‌. “మిష్కిన్‌’’ కథా రచయిత. ఇప్పుడు “ఆస్మాని’’ కవి.కవిగా, కథకుడిగా, కార్యనిర్వాహకుడిగా సీమ సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేసినవాడు. అక్కడి ఒక తరానికి స్ఫూర్తినిచ్చినవాడు. క్షణం క్షణం పొట్ట తిప్పల కోసం పాకులాడుతూనే మరోవైపు తాను పుట్టిన గడ్డ కోసం, సమాజం కోసం పరితపించినవాడు. కీర్తి కోసం కాకుండా