చందమామ ఒక ట్రాన్స్ !
అవును ..ఈ క్షణం నుంచి చంద్రుడొక ట్రాన్స్.
ఎప్పుడైతే నువ్వు చందమామని గౌరవించవో..
ఇక ఆమె గురుంచి రాసే అర్హతని కోల్పోతావు !
ఆమెను తనవైన ..సరైన సర్వనామాలతో పిలవనంతవరకూ... 
నువ్వు చందమామతో  మాట్లాడలేవు !
ఆమె పని పూర్తి అయ్యేదాకా..
మీరు మనుషులను చందమామ పైకి పంపలేరు .
అలా చేయాలంటే..    
ఆమె ముందు సాష్టాంగ పడండి.. 
భూమి చేసిన పాపాలకి మీరు ఆమెని క్షమాపణ అడగండి.
వెళ్ళండి..ఆమె మీ కోసం నిరీక్షిస్తున్నది.
మిమ్మల్ని మెల్లిగా తనవైపుకి ఆకర్షిస్తున్నది.
దయచేసి మీకంటే ముందు చరిత్రలో ఆమె గురుంచి వాగినదంతా మీరూ అనడం ఇక ఆపేయండి !
దయ చేసి ఫక్-ఆఫ్ అవండి !
ఆమె భూమి లోని ఒక భాగమని .... 
ఏదో గ్రహం మీద పడితే విరిగిన సకలం అని ...
ఆడం ఈవ్ పక్కటెముక నుంచి పుట్టిందని..
వగైరా..వగైరా చెత్త మాటలు శాస్త్రజ్ఞులు చెప్పి ఉంటారు.
సరే..ఒకటి చెప్పండి..మీరు ఈ అవాస్తవిక మైన..
అశాస్త్రీయమైన మాటలను వినకపోవడం అనే శక్తిని నమ్ముతారా... మీ మెదడు లోపలి దాకా ?
నాకు మాత్రం మీ వినకుండా ఉండే శక్తి మీద బాగా నమ్మకం ఉంది.
అదీ.. మీ మెదడు లోలోపలి దాకా...సుమా !
అసలు ఇదంతా ఉల్టా పుల్టా వ్యవహారం లా ఉంది !           
వాస్తవానికి మనం మనకోసం రక్తాన్ని త్యాగం చేసిన వారి గురుంచి కాదూ మాట్లాడుకోవసింది ??
వాళ్ళు భూమ్యాకాశాల మధ్య భాగమైన అంతరిక్షంతో సమానం కదా !
అది కొలవకుండా మనం దాని బొమ్మల్ని గీస్తూ కాలం గడిపేస్తాము..ఏం మనుషులం అసలు ?
నిజానికి చందమామ ఎంతో సజీవంగా ఉన్నప్పటికీ
చాలా సార్లు ఆమెని ఒక మృతురాలిగా చూపిస్తూ ఉంటారు..
చందమామకి ..ఒక పరిమిత కాలానికైనా సరే చనిపోవడాన్ని నిరాకరించిన అనుభూతి., పూర్తి అస్థిత్వంలో ఇంకా కలగనే లేదు !
పొడిగించబడిన కాలానికి అయినా సరే..ఆమె అస్థిత్వంలో..ఉనికిలోనూ..
ఆమె ఎన్నటికీ సున్నితమైనది కాదు..బలహీనురాలు అంతకంటే కాదు.
అయితే ..ఆ చందమామ మీరేదో చేస్తారన్న అనుమానం వలన మిమ్మల్ని చూసి మొఖం తిప్పుకొని వెళ్లిపోవటం లేదు..గుర్తు పెట్టుకోండి !  
ఆమెకున్న ఏకైక దారి ..మీ నుంచి దూరంగా ఉండడం!          
ఆమె మీకు తెలిసిన సమాచారం కంటే కూడా ఎక్కువ కాలం జీవిస్తుందని..   
మిమ్మల్ని  దాటి ముందుకు వెళ్లిపోతుందని జ్ఞాపకం పెట్టుకోండి  !
ఎందుకంటే..చందమామ ఒక ట్రాన్స్ కాబట్టి !
ఆమెని గౌరవించేదాకా...మీకామెను నిర్వచించే అర్హత రాదు కాబట్టి !

★చందమామ ఒక ట్రాన్స్ !★
౼జాషువా జెన్నీఫర్ ఎస్పీనోజ
★Moon Is A Trans★ !- Jashua Jennifer Espinoja.
【A Trans poetess-California】అనువాదం-గీతాంజలి.°

Leave a Reply