కథలు

చరిత్ర మునుముందుకే…

"మావోయిస్టుల దిష్టి బొమ్మలను తగలబెడుతున్న ప్రజలు”. తన టాబ్‌ లో వార్తాపత్రికల హెడ్‌ లైన్స్‌ చదువుతూ ఆ వార్త దగ్గర జూమ్‌ చేసి చూసింది సుధ. ఆ వార్త కింద ఫోటోలో బి‌ఎస్‌ఎఫ్ పోలీసులు తలకు నల్లటి గుడ్డలు చుట్టుకుని ఎక్కువ మందే వున్నారు. కొంత మంది జనాలు కూడా నిలబడి వున్నారు. కొంత మంది చేతుల్లో ... "మావోయిస్టులారా ! మా గ్రామాలకు రాకండి!". అని రాసి వున్న ఫ్లెకార్డులున్నాయి. సాధారణ దుస్తుల్లో వున్న ఇద్దరు మనుషులచేతుల్లో గడ్డితో తయారు చేసిన మానవాకార బొమ్మలకు ఆలివ్‌ గ్రీన్‌ దుస్తులు తొడిగి నిప్పు అంటించిఅవి దహనం అవుతుంటే పైకెత్తి
కథలు

వేగుచుక్క

ఆదివారం సాయంత్రం ఇంటి ముందు అరుగు మీద కుర్చీలో కూర్చున్న గోపాలరావు సిగరెట్‌ కాలుస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతని కళ్లు విషాదంతో నిండి వున్నాయి. అతని హృదయంలో సుళ్లు తిరుగుతున్న దుఃఖం, వేదన ఏమిటో 40 ఏళ్లుగా అతనితో జీవితం పంచుకున్న జానకమ్మకు తెలుసు. జానకమ్మ అతడిని గమనిస్తూనే మౌనంగా అతడికెదురుగా కత్తిపీట ముందేసుక్కూర్చుని ఉల్లిపాయలు కోస్తున్నది. అతడు జానకమ్మను చూసాడు. ఆమె చెంపల మీదుగా కన్నీళ్లు కిందకు జారుతున్నాయి. అవి ఉల్లిపాయల ఘాటు వలన కాదని అతనికి తెలుసు. ఆమె మౌనం, కన్నీళ్ల వెనుక వున్న ఆవేదనను అతను అర్థం చేసుకోగలడు. ఆమెనలా చూస్తుంటే అతనికి గుండె