ప్రజలు అంటరానితనానికి గురౌతున్నప్పుడు
లైంగిక వేధింపులకు గురౌతున్నప్పుడు
మతం ముసుగులో మునుగుతున్నప్పుడు
మూఢనమ్మకాలకు బలౌతున్నప్పుడు
మేము కలం నుండి జాలువారిన
కన్నీటి చుక్కలమైతాం

ఆదివాసీ హక్కులకై ఉద్యమించినప్పుడు
వారిపై వైమానిక దాడులు జరుగుతున్నప్పుడు
దేశపు సహజ సంపదను దోచుకుపోతున్నప్పుడు
ఈ దేశ ఆదివాసీ ముఖంపై ఉచ్చ పోసినప్పుడు
మేము ప్రశ్నించే మొక్కలమై మొలకెత్తుతాం

కాలేజీలో దేశ చరిత్రను విప్పి చెప్పినప్పుడు
సమాన హక్కు గురించి మేము పోరాడినప్పుడు
ఈ దేశపు అన్యాయాన్ని 
అక్షరమైన మేము ప్రశ్నించినప్పుడు
రాజ్యం మా పైన పీడియఫ్లు 
ఉపా కేసులు పెట్టినప్పుడు
ఈ రాజ్యం దృష్టిలో మేము అర్బన్ నక్సలైట్లమైతాము

Leave a Reply