సాహిత్యం కవిత్వం

వసంతం

చిన్నబోయినా కనుల కన్నీటిని తుడిసిన వేళ నిండు పున్నమి నదిపై పరుసుకున్న వేళ ఎర్రని మేఘంపైఎగిరే పక్షిని నేనై రాగం పాడే వేళ రంగస్థలములో నేను ప్రేమ రంగులద్దిన వేళ రానే వచ్చింది వసంతం ప్రేమను పేర్చింది వసంతం రానే వచ్చింది వసంతం స్వేచ్ఛను తెచ్చింది వసంతం
కాలమ్స్ లోచూపు

మానవత్వం పరిమళించాలంటే పోరాటం అనివార్యం

ఇతరేతర జీవుల వలె కాకుండా, మనిషి ఒక విలక్షణ జీవి. పరిస్థితులకు లోబడి ఉండకుండా పోరాడే నైజం వల్లనే ఆ విలక్షణత మనిషికి అబ్బింది. కనుకనే ప్రకృతిలో భాగమైన మనిషి ఆ ప్రకృతితో పోరాడుతూనే ప్రకృతిపై ఆధిపత్యం సాధించాడు. ఇలా ప్రకృతిపై ఆధిపత్యం సాధించుకుంటున్న క్రమంలోనే మనుషులు తమలో తాము అనేక విభజనలకు గురయ్యారు. మనదేశంలో తొలుత ఆ విభజన ఆర్థికేతరమైన వర్ణవ్యవస్థ రూపంలో. ఆ తర్వాత ఆర్థిక కోణంలోని వర్గ వ్యవస్థ రూపంలోనూ రూపొంది, కులం, మతం, జెండర్ వంటి బహుళ ఆధిపత్య వ్యవస్ధల రూపాల్లోనూ ఆ విభజనలు  కొనసాగుతూ వస్తున్నాయి. మునుపటి కంటే భిన్నంగా నేటి
కాలమ్స్ ఆర్ధికం

కరోనా అయితేనేం..? కుబేరులకు కాసుల పంటే

భారత్‌లో ప్రజావ్యతిరేక కార్పొరేటు అనుకూల‌ మోడీ ప్రభుత్వ విధానాల వ‌ల్ల అత్యధిక ప్రజ‌లు కొనుగోలు, ఆదాయాల‌ను కోల్పోతోంటే అపర కుబేరులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నారు. మార్చి 2న హురున్‌ గ్లోబల్‌ 10వ వార్షిక నివేదిక రిచ్‌ లిస్టు 2021 భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 209కి చేరిందని తెలిపింది. 100 కోట్ల డార్ల సంపద కలిగి ఉన్న వారిని బిలియనీర్‌ అంటారు. ప్రస్తుత డాల‌ర్‌ మారకం రేటు ప్రకారం రూ.7400 కోట్ల పైమాటే. మొత్తం 209 మందిలో 177 మంది బిలియనీర్లు భారత్‌లోనే నివసిస్తుండగా మిగిలిన వారు విదేశాల్లో స్థిరపడ్డట్లు నివేదిక వెల్ల‌డించింది. అత్యధిక మంది బిలియనీర్లున్న దేశాల‌
కాలమ్స్ బహుజనం

జీవితం కథలో ‘అమ్మ’మనస్తత్వం – పరిశీలన

 ‘జీవితం’  కరుణ రాసిన కథల సంపుటి. ఇందులో మొత్తం 30 కథలున్నాయి. వాటిలో జీవితం ఒక కథ. ఆ కథ పేరే పుస్తకం పెరయ్యింది. 30 కథలు విభిన్నమైన సారూప్యమైన ఇతి వృత్తాల కలయికగా, పాఠకులకు పరిచయమై అనేక సన్నీవేశాలతో, సంఘటనలతో, పాఠకులు తమను తాము పాత్రలలో ప్రవేశ పెట్టుకునేంత సహజ సిద్దంగా , మమేకత్వంతో పాత్రలను, కథనాలను, నిర్మించడం రచయిత్రీలోని ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే ఈ పుస్తకంలోని కథలు ఎక్కువ కాలం పాఠకుని మనసులో నిలిచిపోయేందుకు కారణం అవుతోంది. సంపుటిలోని ప్రతి కథ ఒక సందేశాత్మక ఇతివృత్తంతో ఉంటుంది. రచయిత్రి ఆ మూలాగ్రం తన కథలలోని, విభిన్న
సాహిత్యం కవిత్వం

జాగ్రత్త..?

ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త శవాల చేతులతోబంగ్లాలు కటించుకునేకుభేరులున్నారుజాగ్రత్త పచ్చి మాంసాన్నిపగడ్బందీగా పీక్కు తినేగుంట నక్కలున్నాయిజాగ్రత్త కాలి కాలనిబొక్కల్ని మెడలో వేసుకునికరోనాని కాటికి పంపాలనుకునేవైద్యులున్నారుజాగ్రత్త ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త మున్నూట అరవై వేల కోట్లదేవుళ్ళున్నఈ పుణ్య భూమిలోఆర్థా నాధాలకిఆయుశ్శే లేదుజాగ్రత్త భారత్ మాత కి జైఅనే నినాదంలోజై తెలంగాణఅను నినాదంలోఈ దేశ చరిత్ర బందీ అయిబ్రతుకు చాలిస్తున్నది జాగ్రత్త ఊపిరి బిగబట్టుకునిఉద్యమించకుంటేరేపటి భవిష్యత్ బర్తరఫే ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త నిషేధ రేఖలునిన్ను నిలువునా…చీల్చాలనుకుంటాయిజాగ్రత్త
సాహిత్యం కవిత్వం

నేనెప్పుడూ స్వేచ్చా జీవినే

 నీ హిందూత్వ ఫాసిస్టూ భూగర్భం లో  నన్ను బంధించావనుకోకు సామ్యవాద లావానై  చీల్చుకొని నిన్ను ముంచెత్తుతా జనం నిండా విస్తరిస్తా , నూతన మానవునిగా మళ్ళీ జన్మిస్తా. సోషలిస్టు వెల్లువుగా నీ సామ్రాజ్యవాద సామ్రాజ్యాన్ని ముంచెత్తి మండుతున్న ఎండిపోయిన గుండెలపై తొలకరినై సేదా  బిందువుల నెదజల్లుతా . అడివే కదా అనుకొని కార్పొరేట్ల దాహార్తి కై  ఖాండవ దహనానికి  పూనుకోకు,  ఆదివాసీ దండునై , నిన్నూ,నీ గోబెల్స్ ను సజీవంగా దగ్ధం జేస్తా అవును, నేను కలం పట్టిన కవినే మాత్రమే కాదు, నాగలిపట్టే రైతును,రైతు కూలీని, సహస్ర వృత్తుల కార్మికుణ్ణి, నారినే కాదు, నీ దోపిడీ పై
సాహిత్యం కవిత్వం

నా జీవితం

నా జీవితం, వడ్డించిన విస్తరే కాదనను. కానీ, అన్నార్తుల ఆకలి తీర్చడమే నా ఆరాటం,పోరాటం. కన్నీళ్లు,కడగండ్లు పెద్దగా నేనెరుగ , అయితే. కన్నీళ్లు,కడగండ్లు లేని సమాజమే, నా లక్ష్యం,నా ధ్యేయం. అవును, నేనగ్రవర్ణ సంజాతకున్నే,  కానీ, కుల,వర్గ రహిత సమాజంకై, జరిగే పోరులో నేనూ ఒక సాహితీ సైనికుణ్ణి. నేను పురుషున్నే , నాలోని పురుషాధిక్యతను అనుక్షణం ప్రశ్నించుకుంటూ క్షాళన చేసుకుంటున్న మనిషిని నేను. రేపటి ఉషస్సు విరజిమ్మే అరుణారుణ కాంతులకై , ఆవర్భవించే నూతన మానవునికై , అహర్నిసలు జరుగుతున్న యుద్దానికి భావజాల తూటాలందించే సాంస్కృతిక సైనికుణ్ణి నేను నేను కలాన్నే కాదు, కర్షకున్ని,కార్మికున్ని  దోపిడీ వ్యవస్థను
సాహిత్యం కవిత్వం

అమాయకులు వాళ్ళు

అవును, వాళ్ళు  భ్రమల్లోనే వున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్య చంద్రుడు వెన్నలకాంతులు విరాజిమ్ముతుంటే, కానన కారుచీకట్లో వెలుగుకై వెదుకుతున్నఅమాయకులు వాళ్ళు పచ్చని పంట పొలాలపై కార్పొరేట్ గద్దలు వాలుతుంటే, పంటను కాపాడే రైతన్న  వడిసెల విసురు నేరమైన చోట ప్రశ్నించిన ప్రతివాడూ దేశద్రోహయిన  నేతి బీరకాయ ప్రజాస్వామ్యం లో హక్కుల నేతికై దేవులాడక ,  ఫాసిస్ట్ ఎడారిలో సామ్యవాద ఒయాసిస్ కై దేబరించని అజ్ఞానులు వాళ్ళు.   కులం,మతం పేరుతో మానవత్వం మంటగలుస్తున్న మహోన్నత భారతంలో, హక్కులకై గొంతెత్తిన ప్రతివాడు అర్బన్ నక్సల్ దేశద్రోహి,పాకిస్తానీ ఏజెంట్ అయిన నేల ఎన్నికల చదరంగంలో పావులుగా మిగలక, బిర్శాముండా,కొమురం భీమ్ పంథానవసరంగా పట్టిన
సాహిత్యం కవిత్వం

ఆకాంక్ష

శిశిరం లో రాలిన ఆకులుగలగలంటున్నాయ్వాడి గుండెల్లో అలజడిఅడుగులెవరివని కలంలో కాలాన్నిప్రశ్నించే అక్షరాలు తూటాల్లాదూసుకొస్తుంటేబుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటునవాడు కాపురం వసంతంలో చిగురిస్తున్నమొక్కల మాటునదాగే ప్రశ్నవిరుచుకుపడుతుందని వాడి వెన్నులో వణుకు నాటిన ప్రతి మొక్కఓ ఆయుధ భాండాగారమౌతుందేమోననికలవరింతకాకులే కాపలాగాఅరిచే అరుపుఎరుపై మూకుమ్మడి దాడి చేస్తారేమోననేభావి స్వప్నం వాడ్ని నిదుర పోనీయట్లేదేమో శరదృతువు లోకాచే వెన్నెల్లోపల్లె బతుకుల్లో వెలుగులు నింపే దారులు వెతికే పనుల్లో సేద్యగాళ్ళు వాడ్నినిలువెత్తు గొయ్యిలోపాతరేసి హేమంతాన్ని ఆహ్వానిద్దామనేఆకాంక్ష నేడు కాక పోయినా రేపైనానెరవేరుతుంది లే
సాహిత్యం కవిత్వం

అలల హోరుకు సంకెళ్ళేస్తావా..!?

సుఖమయ జీవితాల్లోని సంతోషాల్ని నిషేదించుకున్నోళ్లం గాఢాంధకారంలో చిక్కిన మట్టి బిడ్డలకోసం చిమ్మ చీకట్లను ఆలింగనం చేసుకున్నోళ్లం  నెర్రెలిచ్చి డొక్కలెండిన దుఃఖ్ఖ సాగరాల కనుకొలుకుల్లో కాంతి రేఖలమై పునర్జీవించినోళ్ళం శతాబ్దాల శుష్కవాగ్దానాలనీ పురోభివృద్ధి పాదాలకింద చితికినఆకలి పేగులమన్యానికి సైనిక కవాతునేర్పినోళ్ళం  అడవిని అన్యాక్రాంతం అవనివ్వని శపథాన్ని ఎరుపెక్కిన పతాక రెపరెపల్లో                                                         నిత్యం నిగనిగలాడే                                             నిఘా