నీ హిందూత్వ ఫాసిస్టూ భూగర్భం లో

 నన్ను బంధించావనుకోకు

సామ్యవాద లావానై

 చీల్చుకొని నిన్ను ముంచెత్తుతా

జనం నిండా విస్తరిస్తా ,

నూతన మానవునిగా మళ్ళీ జన్మిస్తా.

సోషలిస్టు వెల్లువుగా

నీ సామ్రాజ్యవాద సామ్రాజ్యాన్ని ముంచెత్తి

మండుతున్న ఎండిపోయిన గుండెలపై

తొలకరినై సేదా  బిందువుల నెదజల్లుతా .

అడివే కదా అనుకొని

కార్పొరేట్ల దాహార్తి కై 

ఖాండవ దహనానికి  పూనుకోకు, 

ఆదివాసీ దండునై ,

నిన్నూ,నీ గోబెల్స్ ను సజీవంగా దగ్ధం జేస్తా

అవును,

నేను కలం పట్టిన కవినే మాత్రమే కాదు,

నాగలిపట్టే రైతును,రైతు కూలీని,

సహస్ర వృత్తుల కార్మికుణ్ణి,

నారినే కాదు,

నీ దోపిడీ పై సంధించిన వింటి నారినికూడా ,

నిలువెల్లా ఆశలు,ఆశయాలు

మూర్తీభవించిన విద్యార్థిని,మేధావిని

నేటి భగత్ సింగ్ ను నేనే.

నేనజేయున్నే కాదు,అమరు ణ్ణీ కూడా,

నేనీ ప్రపంచపు ప్రాణవాయువును, నేనెప్పుడూ స్వేచ్చా జీవినే

Leave a Reply