కేసీఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా?
అమరుల త్యాగాలను స్మరించుకోవడం చట్ట వ్యతిరేకమైపోయిందా? అమరుల బంధుమిత్రుల సంఘం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధాన్ని వ్యతిరేకించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరుల బంధు మిత్రుల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించింది. గత నెల 30వ తేదీ తయారు చేసుకున్న జీవో 73ను ఏప్రిల్ 28న విడుదల చేసింది. ఈ ప్రకటన మమ్మల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. పాలకుల దుర్మార్గం మాకు చాలా బాగా తెలుసు. మా కన్న బిడ్డల్ని, సహచరుల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం వెంటాడి హత్య చేస్తే, ఆ దు:ఖాన్ని మోస్తూ జీవిస్తున్నవాళ్లం. మాకు ఈ వ్యవస్థ, రాజ్యం ఎంత అమానుషమైనవో