సావిత్రీబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రీబాయి ఫూలే 1831, జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా, ఖండాలా తాలూకాలోని నాయగావ్ అనే గ్రామంలో జన్మించారు. ఆమె తల్లి పేరు లక్ష్మీబాయి మరియు తండ్రి వారు ఖండోజీ నెవసే పాటిల్. ఆమె తండ్రి ఆ గ్రామానికి పాటిల్, అంటే గ్రామ పెద్దగా ఉండేవారు.
సావిత్రీబాయి ఫూలే వెనుకబడిన తరగతికి చెందిన ‘మాలి’ పూల తోటల పెంపకం చేసే కుటుంబంలో జన్మించారు. ఆమె తన తల్లిదండ్రులకు నలుగురు పిల్లలలో పెద్ద కుమార్తె. ఆనాటి సామాజిక పరిస్థితుల ప్రకారం సావిత్రీబాయి గారికి, ముఖ్యంగా ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఉండేది కాదు. అందుకే అందువల్ల చిన్నతనంలో ఆమె పాఠశాలకు వెళ్ళలేదు. పూర్తి నిరక్షరాస్యరాలుగా పెరిగారు. ఒకసారి ఆమె మార్కెట్లో ఉన్నప్పుడు ఒక క్రైస్తవ మిషనరీ ఆమెకు ఒక పుస్తకాన్ని ఇచ్చింది. ఆమెకు చదవడం రాకపోయినా, ఆ పుస్తకంలోని చిత్రాలను చూసి ఎంతో మురిసిపోయేవారు. ఎలాగైనా చదువుకోవాలనే బలమైన కోరిక ఆమెలో ఆ రోజే మొదలైంది.
సావిత్రీబాయి ఫూలే గారు చిన్నప్పటి నుండి ఎంతో పద్ధతిగా, ఇంట్లో అమ్మకు సహాయం చేస్తూ, అందరిలోనూ అల్లారుముద్దుగా పెరిగారు. ఆమె బాల్యం అప్పటి కాలపు కట్టుబాట్లు, కష్టాల మధ్య గడిచింది. అప్పటి సమాజంలో ఎక్కువగా ఇల్లాలుగా ఇంటి పనులు చేయడం మాత్రమే ఆడ పిల్లల బాధ్యతగా భావించేవారు. అందుకే సావిత్రీబాయి ఫూలే మిగతా ఏ ఆడపిల్లలు చదువుకునేవారు కాదు. ఆమెకు బాల్యంలోనే అతి చిన్న వయస్సులోనే – కేవలం 9 సంవత్సరాల వయస్సులో (1840) లో జ్యోతిరావు ఫూలే గారితో వివాహం జరగడంతో ఆమె బాల్యం చాలా త్వరగా ముగిసింది. ఆమె పెళ్ళయి అత్తగారింటికి వచ్చినప్పటికీ, ఆమెలోని చదువుకోవాలనే కోరిక అలాగే ఉన్నది.
సావిత్రీబాయి గారికి పెళ్ళయ్యే నాటికి ఆమె భర్త జ్యోతిరావు ఫూలే గారికి కొద్దిగా చదువు వచ్చు. సమాజం మారాలన్నా, ఆడపిల్లల బతుకులు బాగుపడాలన్నా చదువు ఒక్కటే మార్గమని ఆయన నమ్మేవారు. అందుకే ఆయన తన భర్త స్థానంలోనే కాకుండా ఒక గురువుగా మారి సావిత్రీబాయి గారికి ఇంట్లోనే అక్షరాలు, చదవడం, రాయడం నేర్పించారు. సావిత్రీబాయి గారు కూడా ఎంతో ఆసక్తితో, తెలివితో చాలా త్వరగా చదువు నేర్చుకున్నారు. ఆ తరువాత ఆమె టీచర్ కావడానికి అవసరమైన శిక్షణను కూడా తీసుకున్నారు. దేశంలోనే మొదటి బాలికల పాఠశాల స్థాపన 1848 లో జరిగింది. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఫూలే దంపతులు ఒక గొప్ప విప్లవానికి నాంది పలికారు.
1848 జనవరి 1న మహారాష్ట్రలోని పూణేలో అణగారిన వర్గాల ఆడపిల్లల కోసం దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను ఆరంభించారు. ఈ బడికి సావిత్రీబాయి ఫూలే గారే మొదటి టీచర్‌గా, హెడ్ మాస్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ విధంగా ఆమె భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించారు. దీని కారణంగా సమాజం నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలు బడికి వెళ్లి చదువుకోవడం అనాచారం. సమాజంలోని పెద్దలకు అస్సలు నచ్చలేదు. అది వాళ్ళ వ్యతిరేకతగా మారింది. అందుకే సావిత్రీబాయి గారు పాఠశాలకు నడిచి వెళ్తున్నప్పుడు దారిలో కొందరు దుర్మార్గులు ఆమె పై రాళ్లు, బురద, పేడ విసిరేవారు అసభ్యంగా తిట్టేవారు. కానీ ఆమె అస్సలు భయపడలేదు ఆమె ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించారు. తన బ్యాగులో ఎప్పుడూ ఒక చీరను ఉంచుకునేవారు. బురద పడిన చీరతోనే బడికి వెళ్లి, అక్కడికి వెళ్లాక మంచి చీర మార్చుకుని పిల్లలకు పాఠాలు చెప్పేవారు. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ బురద చీరనే కట్టుకుని వచ్చేవారు. “నా పిల్లలకు చదువు చెప్పడం నా విధి, మీరేం చేసినా నేను ఆగను” అని ధైర్యంగా సమాధానమిచ్చేవారు.
సావిత్రీబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే కేవలం చదువు చెప్పడమే కాకుండా, సమాజంలో ఉన్న ఎన్నో తప్పుడు పద్ధతులకు వ్యతిరేకంగా ఈ దంపతులు పోరాడారు. అలాగే వీరు 1852 మహిళల హక్కుల కోసం, వారిని చైతన్యపరచడానికి ఒక సంఘాన్ని స్థాపించారు. అలాగే చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయిన వితంతువులు గుండు గీయించే పద్ధతిని ఆపు చేయడానికి మంగలి వారితో సమ్మె చేయించి విజయం సాధించారు. అలాగే దిక్కులేని గర్భిణులైన వితంతువుల కోసం తమ ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు.
సత్యశోధక్ సమాజ్ (1873): లో మూఢనమ్మకాలు, కుల వివక్షను రూపుమాపడానికి, కట్నాలు లేని పెళ్లిళ్లను ప్రోత్సహించడానికి ఈ సంస్థను ప్రారంభించారు. 1890 లో జ్యోతిరావు ఫూలే గారు మరణించినప్పుడు, సమాజపు పాత పద్ధతులను పక్కన పెట్టి సావిత్రీబాయి గారే స్వయంగా తన భర్త చితికి నిప్పు పెట్టి సరికొత్త ఆదర్శాన్ని చూపారు. భారత చరిత్రలో ఒక భార్య తన భర్తకు అంతిమ సంస్కారాలు చేసిన మొదటి సంఘటన ఇది.
ఆ తర్వాత 1897 లో పూణే నగరంలో ‘ప్లేగు’ అనే భయంకరమైన వ్యాధి ప్రబలి జనం చనిపోతుంటే, ఆమె తన కొడుకు యశ్వంత్‌తో కలిసి రోగులకు దగ్గరుండి సేవలు చేశారు. ఆ క్రమంలోనే ఆ వ్యాధి ఆమెకు కూడా సోకడంతో 1897 మార్చి 10న ఈ చదువుల తల్లి కన్నుమూశారు. సావిత్రీబాయి గారు ఉత్తమ గురువు మాత్రమే కాదు, గొప్ప కవయిత్రి మరియు రచయిత్రి. 1876-1877 ప్రాంతంలో మహారాష్ట్రలో చాలా భయంకరమైన కరువు వచ్చింది. తిండి లేక వేలాది మంది ప్రజలు అల్లాడిపోయారు. ఆ సమయంలో సావిత్రీబాయి, జ్యోతిరావు ఫూలే దంపతులు ప్రభుత్వం సహాయం కోసం ఎదురుచూడకుండా, తమ సొంత డబ్బుతో ఇతర దాతల సహాయంతో సుమారు 52 ఉచిత అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు వేలాది మంది ఆకలితో ఉన్న పేదలకు, పిల్లలకు ఉచితంగా అన్నం పెట్టారు.
కరువు వల్ల అనాథలుగా మారిన ఎంతో మంది పిల్లలను చేరదీసి వారికి ఆశ్రయం కల్పించారు. బడికి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి మరీ పిల్లలను చదివించేవారు. దేశంలోనే మొదటి ఉచిత హాస్టల్ నిర్మించారు. పేద పిల్లలు ఇందులో ఉండడానికి. వీళ్ళు ఇంత చేసిన మనుషుల, దేవుళ్ళా, దేవతల అంటే కాదు, ఇంకా మన కోసం ఎంత చేస్తారో వాళ్ళే దేవుళ్ళు అని నమ్మేవారు. కానీ, కనిపియని దైవం అని నమ్మేవారు. మన హక్కుల కోసం, మన చదువుల కోసం పోరాడారు. వీళ్ళు కదా దేవుళ్ళు. చివరిని అడిగిన చదువుల తల్లి ఎవరు అంటే సరస్వతి అంటారు. కానీ ఆ దేవి ఎవరికి ఆడపిల్లలకు చదువు చెప్పలేదు. ఎవ్వరికీ అక్షరాలు నేర్పించలేదు కదా. మరి చదువుల తల్లి సరస్వతి దేవి ఎలా చదువుల తల్లి అవుతుంది. ఆడపిల్లల చదువు కోసం పోరాడిన సావిత్రీబాయి ఫూలే చదువుల తల్లి కాదూ! అవును చదువుల తల్లి సావిత్రీబాయి ఫూలే గారు అని ఈ గుడ్డి సమాజానికి ఎప్పుడు అర్థమవుతుందో. ఈ సమాజం ఎప్పుడు మంచి, చెడ్డలను అర్థం చేసుకుంటుంది. మూఢనమ్మకాలను, దైవం, దెయ్యం అంటూ ఈ సమాజం ఒక సముద్రంలా మారకుండా, బురద నీటలో పారుతుంది. దేశం కోసం పోరాడిన వాళ్ళని మర్చిపోయింది. ఏమీ చేయని వాళ్ళని మాత్రం రెండు చేతులూ జోడించి మొక్కుతుంది. ఈ దేశంలో ఎప్పుడు జ్ఞానోదయం ఔతుందో, ఈ సమాజం ఎప్పుడు ఈ చీకటిలో నుండి బయటపడుతుందో!
దేశంలో ఇప్పటికీ చదువు అందరికీ అందడం లేదు, హక్కులు అందరికీ సమానంగా లేవు. ఇలాoటి ఈ పరిస్థితుల మీదనే అప్పుడు సావిత్రి బాయి పోరాటం చేసింది. జ్యోతిరావు ఫూలే ఆమెకు అండగా నిలిచాడు. కానీ మనం వీళ్ళను మర్చిపోయాము. నిజానికి వీళ్ళ వలనే మనం ఇప్పుడు సంతోషంగా, స్వేచ్ఛగా ఉంటున్నాము. అందుకని, ఇప్పుడు వీళ్ళ అవసరాలు మనకు లేదు కదా. ఇది తప్పుడు పద్ధతి.
మనం మన కోసం పోరాడిన వాళ్ళని ఎప్పుడూ మన హృదయపూర్వకంగా గౌరవించి, సమాజానికి మనం మంచి చేసి రుణం తీర్చుకోవాలి..
ఈ సావిత్రీబాయి ఫూలే జీవిత చరిత్ర అందరు తప్పకుండా చదవాలి. అప్పుడే వాళ్ళ త్యాగం తెలుస్తుంది.




