సమాజ చలన విశ్లేషణ
మిత్రుడు ఎన్. వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసాలను గతంలో వేర్వేరుగా వీక్షణం పత్రికలో చదివినప్పటికీ, ఇటీవల వాటిని 'సమాజ చలనపు సవ్వడి' అనే పుస్తకం రూపంలో మళ్లీ ఒక్క చోట చదివితే ఏర్పడే అవగాహన మరింత శాస్త్రీయం,సమగ్రమూ అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, సామాజిక పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేసి,వాటిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి మార్క్సిస్టు రాజకీయార్థిక దృక్పథానికి మించిన ప్రత్యామ్నాయ దృక్పథం ఏదీ లేదని ఈ పుస్తకం రుజువు చేస్తుంది. సమాజ స్వభావం, సామాజిక మార్పు అనే విషయాలకు సంబంధించి పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఈనాటికీ వ్యక్తమవుతున్న కాలంలో 'సమాజ చలనపు సవ్వడి' అనే ఈ పుస్తకం