ప్రజాయుద్ధమై ప్రజ్వరిల్లిన శాంతి స్వప్నం
చీకటి క్షణాలను తాకే సూర్యకిరణం
మేధా జగత్తును అల్లుకున్న ఒక స్పర్శ
ప్రజా ప్రత్యామ్నాయ రూపశిల్పి
విశాఖ ఉక్కుకు మలిబాటైన చుక్కాని
పేగు బంధానికి వర్గయుద్ధ చిత్రాన్ని అద్దిన ఆదర్శం
ప్రజా పంథాకి ప్రాణవాయువు
మహిళా-మానవత్వ విలువలకు ఆచరణరూపం
ఎన్నికల కుల రాజకీయాలను ఎదిరించి
కుల నిర్మూలనా మార్గాన్ని మలచిన సాహసి
‘జంపిస్టుల’ మర్మభేధి
ఒక ఆత్మీయతా అనురాగం
ఒక విప్లవ ప్రజాస్వామిక చైతన్యం
ఒక విప్లవ కార్యదీక్ష!

(కామ్రేడ్‌ సాకేత్‌ అమర్‌ రహే!)

Leave a Reply