కవిత్వం

ఈ  పాడు కాలంగడిచిపోతది

ఓ దుఖంపెనుగంగలా ఉప్పొంగిజీవితాన్ని ముంచెత్తిమనశ్శాంతిని భగ్నం చేసినప్పుడుకనుచూపుమేరాప్రియమైనవన్నీ దూరమైనప్పుడునీ హృదయానికి పదేపదే ఇలా చెప్పు"ఈ పాడుకాలం గడిచిపోతది" అంతులేని శ్రమనీ సంతోషగానాల మీదమౌనపు తెరల గమ్మినప్పుడుప్రార్థించడానికి సైతంనీ పెదాలు వొణుకుతున్నప్పుడుఈ సత్యంమబ్బుల తొలగించినిన్ను తేలికపరచనీ"ఈ పాడుకాలం గడిచిపోతది " జీవితంవిలాసవంతమైభౌతిక సుఖాలలోకాలం దొర్లుతున్నప్పుడుఈ మాటలునిన్ను ఎప్పుడూ వెంటాడనీ"ఈ పాడు కలం గడిచిపోతది" నీ శ్రమ జీవజలంలోకీర్తి కాంతులు పుష్పించినప్పుడుప్రపంచంలోనేఉన్నతమైనవి నీకందివొచ్చినప్పుడుఈ జీవితంఒక అంతులేని, అద్భుత కథ అని గుర్తించుకో జీవితం దుర్భరమైన చోటజీవించడం మానకు అవిశ్వాసం లేనేలేదుమనకు తెలియకుండానేపెదాలు తిరస్కరించినచోటమనసు విశ్వాసంతో ఉరకలేస్తుంది** Elizabeth Y.case (1840)," This too shall passaway"కు స్వేచ్చానువాదం : ఉదయమిత్ర