ప్రజల ప్రయోజనాలే ప్రాణంగా
బతికిన వాళ్లు, వాళ్లిద్దరు
ఒకరు హిమాలయాలంత ఎత్తుకెదిగి
నల్లమల కాఠిన్యాన్ని పుణికి పుచ్చుకొని
శత్రువుకు నిద్ర పట్టనీయని
విప్లవ శ్రేణులకు సేనాని
మరొకరు ప్రేమ మాత్రమే
చైతన్యాన్ని ఉద్దీపింప చేస్తుందని
బలంగా నమ్మి ఆచరించినవాడు
విప్లవ శ్రేణుల గుండెల్లో నెలవై
శత్రు సేనలపైకి ఉరికించినవాడు
ఈ యిద్దరు వ్యూహకర్తలను, ప్రజల ప్రేమికులను
కోల్పోవడం నా, మీ వ్యక్తిగత బాధే కాదు
నూతన సమాజాన్ని ప్రసవించే
పుడమి తల్లి పురిటి నెప్పుల బాధ కూడా
ఇప్పుడు గుండెల నిండా కర్తవ్యం
జయించాలనే తపన, జ్ఞానం కోసం మధనం
చలన నియమాలను ఒడిసి పట్టుకోవాలనే ఆరాటం
అమరుల శక్తిని నిబిడీకృతం చేసుకున్న ప్రతి అడుగూ
మరింత దృఢంగా ప్రజల పక్షం
అందుకే
ఓటమి తాత్కాలికం
గెలుపు ఖాయం!

(కామ్రేడ్స్‌ సూర్యం, రవిల అమరత్వం నేపథ్యంలో దుఃఖమే అనంతమై ఆలోచనలు అభావమైన వేళ పెళ్లగించి తీసిన నాలుగు ముక్కలు ` ప్రియమైన నా యిద్దరు కామ్రేడ్స్‌కు)

Leave a Reply