నివేదిక

మణిపూర్ హింస మతపరమైనది కాదు, ప్రభుత్వ ప్రాయోజిత కార్పొరేట్ ఎజెండా

( మణిపూర్ లో హింస ను "స్టేట్ -స్పాన్సర్డ్ " అని , నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ నుండి ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందం తన నివేదికలో బహిర్గతం చేసింది. " రాష్ట్రంలో జరుగుతున్నది మతహింస కాదు లేదా రెండు వర్గాల మధ్య పోరు కాదు, ఇది భూమి, వనరులు, మతోన్మాదులు,  మిలిటెంట్ల చుట్టూ తిరుగుతూ ఉంది.  ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన కార్పొరేట్ అనుకూల ఎజెండా అమలు సాకారం చేసేందుకు ఫాసిస్టు ప్రభుత్వం చాకచక్యంగా వ్యూహం పన్నినందువలన  హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. NFIW  ప్రధాన కార్యదర్శి ఆని రాజా , జాతీయ కార్యదర్శి నిషా