నిజం చెప్పడం నేరమా?
కేరళ పౌరహక్కుల కార్యకర్త అయినూరు వాసుకు జైలు నిర్బంధం కేరళకు చెందిన అయినూరు వాసు పౌరహక్కుల కార్యకర్త. వయసు 94సంవత్సరాలు. ఆయన్ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కొజికోడ్ న్యాయస్థానం ఆయన్ను 14రోజుల పాటు జైలులో వుంచాలని ఆదేశించింది. ఈయన గ్రో వాసు అనే పేరుతో అందరికీ చిరపరిచితుడు. గ్రో అంటే గ్వాలియర్ రేయాన్స్ కార్మిక సంస్థ అని అర్థం. ఆ కార్మిక సంఘానికి ఆయన నాయకుడిగా వ్యవహరించేవాడు. తన రాజకీయ భావాల కారణంగా బెయిల్ వ్యవహారంలో న్యాయస్థానంతో సహకరించడానికి నిరాకరించాడన్న కారణంగా కామ్రేడ్ వాసును జైలుకు పంపారు. 2016 నవంబర్‌లో కొజికోడ్ వద్ద కామ్రేడ్ కుప్పు దేవరాజ్,