వ్యాసాలు

ఫాసిస్ట్ యుగంలో యూఏపీఏ కేసులు

“నేరమే అధికారమైప్రజల్ని నేరస్థుల్ని చేసి వేటాడుతుంటేఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్థుడే” - వరవరరావు  భారతదేశంలోని జాతీయ భద్రతా చట్టాలు సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా వ్యక్తులను అరెస్టు చేయడానికి అనుమతిస్తాయి. అయినప్పటికీ, అవి మరింత బలోపేతమవుతూనే ఉన్నాయి. ఎటువంటి న్యాయపరమైన ప్రక్రియను అనుసరించకుండా వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించడానికి రాజ్యానికి అనుమతినిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967కు చట్టపరమైన హక్కుల చట్టబద్ధమైన వినియోగాన్ని నిరోధించే, “నేరం రుజువయ్యే వరకు నిర్దోషిగా భావించాలి" అనే ప్రాథమిక భావనను ఉల్లంఘించే సవరణను 2019లో చేశారు.  2023 మార్చి లో, UA(P)A కింద నేరంగా పరిగణించటానికి నిషేధిత సంస్థలో సభ్యత్వం మాత్రమే