ఒక రాష్ట్రంలో అలజడి సృష్టించి, అల్లకల్లోలానికి  అనుమతించి, ఆపై కోర్టు ముందు నిలబడి పరిస్థితి అదుపు లో ఉన్నట్లు నటించడం అధికారపార్టీకే చెల్లింది. ఏది ఏమైనా ఈ దారుణహింసకు కారణాలు తెలుసుకోవాల్సిన బాధ్యత సుప్రీం కోర్టు కు ఉంది. భద్రతా సిబ్బంది శుక్రవారం మణిపూర్ లోని హిల్స్ వ్యాలీ సెక్టార్ లోని సున్నిత ప్రాంతాల్లో  జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న  వీడియోలు మణిపూర్ లోని ఒక సమూహానికి చెందిన మహిళలపై బహిరంగంగా దాడి చేసిన నివేదికలు మతోన్మాద వ్యక్తీకరణలో ఒకటి.

భారత అత్యున్నత న్యాయస్థానం ఆలస్యంగా అయినా పరిస్థితి పై స్పందించింది. “మేం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం లేకుంటే మేమే జోక్యం చేసుకుంటాం” అన్నది.

ఇది ఒక సంఘటనా లేక  ఒక నమూనా గా చేయబడిందా?

సుప్రీం కోర్టు మే 6 వ తేదిన  ఒక పిల్ పై కదిలింది. మణిపూర్లో శాంతి భద్రతల యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. లక్షలాది పౌరులకు ప్రాణహాని ఉందని, వారి హక్కులను పరిరక్షించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటీషన్ లను విచారిస్తున్న సందర్భంగా న్యాయస్థానం నిర్దిష్ట చర్యలను ఆదేశించటంలో సందేహించింది.

ఇది సత్యం అని తెలిసినా సొలిసిటర్ జనరల్  సమర్పించిన ప్రభుత్వ హామీని  పరిగణనలోకి తీసుకుంది. “మేం… ప్రజలకోసం… ఏదైనా తప్పుడు  సమాచారం ఆధారంగా ఆదేశాలు ఇస్తే రాష్ట్రంలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని పిటీషనర్ సున్నితంగా తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాల వలన పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. పిటీషనర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కోలిన్  గోన్సాల్వేస్ కి సుప్రీం కోర్టు సలహా ఇచ్చింది. మీ సందేహం వలన శాంతిభద్రతలు స్వాధీనం చేసుకోలేము, రాష్ట్రంలో ఉన్న హింస, ఇతర సమస్య లను మరింత తీవ్రమయ్యే విధంగా ఈ వేదికను ఉపయోగించటం మాకు ఇష్టం లేదు. మీ సూచనలు తీసుకోవచ్చు కానీ దీనిని పక్షపాత ధోరణి అనుకోవద్దు. ఇది మానవతా సమస్య. ఇటువంటి అంశాలపై  అవగాహన తో ఉండాలి “..

రాష్ట్రానికి కేంద్రం హోం మంత్రి రెండు నెలలు గా పర్యటనకు వచ్చినా ఈ సంఘటన పై చర్య లేవీ?  ప్రధాన మంత్రి సుదీర్ఘ మౌనం  విచిత్రం . ఆయన  ప్రత్యేకించి చిన్న సంఘటనలకు కూడా ప్రతిపక్ష నాయకత్వం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పై దాడి చేయటం చూస్తూ ఉన్నాం. 

రాజ్యాంగం  పౌరునికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు   ఆర్టికల్ 32 ప్రకారం  సుప్రీం కోర్టు

తన పాత్ర గురించి  అన్ని సమయాల్లో స్పృహ తో ఉండి హక్కుల అమలు కోసం తగిన చర్యలు తీసుకునేలా సుప్రీం కోర్టు ను ఆశ్రయించేహక్కుకు హామీ ఉండాలి. బి.ఆర్.అంబేద్కర్ ఈ  నిబంధనపై డిసెంబర్ 9వతేది1948  నా రాజ్యాంగ సభలో ఇలా మాట్లాడారు. ఈ రాజ్యాంగంలోని ఏదైనా ప్రత్యేక ఆర్టికల్ అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొనమని నన్ను  అడిగితే నేను ఈ ఆర్టికల్ తప్ప మరే ఇతర ఆర్టికల్ సూచించలేను. ఇది రాజ్యాంగం యొక్క ఆత్మ, దాని హృదయం . 

ప్రాథమిక హక్కు లో అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు ఊగిసలాడే ధోరణితో ఉంది.

న్యాయశాస్త్రం ఎంత బాగున్నా అమలులో లోపాలు న్నాయి. కోర్టులు చర్యలు తీసుకోవటంలో విఫలమైన సందర్భాలు ఎన్నో.దేశవ్యాప్తంగా బూటకపు ఎన్కౌంటర్లలో నిత్యం వందలాది మంది చనిపోతున్నారు.చట్టంఅనుమతిలేకుండా ఇళ్ళు కూల్చివేయబడుతుప్నాయి.మైనారిటీలపై మెజారిటీ మతోన్మాద మూకలు హింసాత్మకంగా దాడి చేస్తున్నా అత్యున్నత న్యాయస్థానం మౌనం వహిస్తోంది.అలాంటప్పుడు దాని  ద్వారా ప్రకటిస్తాం అయిన చట్టాలు వలన ప్రయోజనం ఏమిటి? సుప్రీం కోర్టు షీలా బార్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1988) లో ఇలా పేర్కొంది..ప్రకటించబడిన  ప్రజా సంక్షేమం కోసం న్యాయవ్యవస్థ తప్పని సరిగా కొత్త ఆవిష్కరణల ద్వారా రాజ్యాంగంలో పొందుపరచిన వాగ్ధానాన్ని సామాజిక, ఆర్థిక మార్పు కోసం  తాను సమతా వాదిగా సామాజిక క్రమం, సంక్షేమ రాజ్యం కోసం దారి చూపాలి.మరీ ముఖ్యంగా  కోర్టు ఆసక్తి లేని అంపైర్ గానో, ప్రేక్షకుడు గానో వ్యవహరించరాదు.సంస్థాపరంగా తనపై సానుకూల మైన పాత్ర తో పాటు వస్తాను బాధ్యత కూడా ఉంది. అమలు ను పర్యవేక్షణ చేయటంతో పాటు  సానుకూల ఉపశమనం  తో పాటు నిశ్చయాత్మక చర్య అవసరం. నిర్ణయాలు ఒక దెబ్బతో తీసుకునే నిర్ణయాలు కాకుండా ముందు ముందు తలెత్తే చిక్కు లను ఎదుర్కొనే లా ఉండాలి. పరిహారం బలవంతంగా రుద్దబడినా,చర్చల  ద్వారా లేదా పాక్షిక చర్చలు జరపచ్చు..అని సుప్రీం కోర్టు షీలా బార్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1988)  కేసులో  చెప్పింది.

మణిపూర్ లో జవాబు దారి ఎవరు? అనే ప్రశ్నకు వచ్చే సమాధానమే గుంపు దాడులనుంచి బయట పడిన వారికి న్యాయం చేస్తుంది.

ఇది అత్యున్నత న్యాయస్థానం ధోరణి అయితే ఎందుకు మణిపూర్ ప్రజలను రక్షించే ప్రయత్నం చేయలేదు.  100  మంది చనిపోయారు. ఆయుధాగారాలు లూఠీ చేశారు.

ఆటోమేటిక్ ఆయుధాలు వాడారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరిట రిట్ పిటీషన్ లు  ఫైల్ చేశారు.  అందులో పౌరుల ప్రాథమిక హక్కులకు తీవ్రమైన  ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నారు.  కోర్టు ఈ విషయం లో కలుగజేసుకోవాలి అంతేగానీ ఈ ప్లాట్ ఫాం రాజకీయ అవసరాలకు మాత్రమే వాడాలనే అనుకోకూడదు. 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అలజడి సృష్టించడం, కోర్టు ముందు నిలబడి పరిస్థితి అదుపు లో ఉందని నటించటం సులభం కావచ్చు. కానీ సుప్రీం కోర్టు కు ఆ హింసకు కారణాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాక కొన్ని చర్యలు తీసుకోవాలి. ఒక స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలి. రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, మంచి పేరున్న రిటైర్డ్ పోలీసు అధికారులు, సివిల్ సర్వెంట్ లు అందులో ఉండాలి ఒక వారంలోనే వాళ్ళు నివేదిక  ఇవ్వాలి. ఇది సుప్రీం కో ర్టు కు సహాయకారి అవుతుంది. పౌరులప్రాధమిక హక్కు లను కాపాడేందుకు‌ , సరియైన ఆదేశాలను  జారీ చే‌స్తుంది. అంతేకాక ప్రాథమిక హక్కు లను అమలుచేయటానికి  ఆర్టికల్ 21 నుండి  14వరకు పౌరుల జీవితాలను రక్షించటానికి మరింత మెరుగైన పునరావాస చర్యలకోసం  ఆదేశాలు జారీ చేయాలి. మణిపూర్ లో మహిళలపై బహిరంగంగా జరిగిన లైంగిక దాడులు జాతికే సిగ్గు చేటు.

రాజ్యాంగం ఒక సజీవమైన డాక్యుమెంట్ అని సుప్రీం కోర్టు గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ వాద సూత్రం అనేది ఇప్పుడు ఒక చట్టపరమైన సూత్రం .దీని ఆధారంగా ప్రజాస్వామ్య సూత్రాలు నాశనం కాకుండా ప్రభుత్వాలపై నియంత్రణ అవసరం. తద్వారా ప్రాథమిక హక్కుల పరిరక్షణ ఉంటుంది.  రాజ్యాంగ వాద సూత్రం అధికార విభజన చెక్ , బ్యాలెన్స్  నమూనాను  ప్రకటిస్తుంది.. అని తొమ్మిది మంది తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఐఆర్ కొయల్లో వర్సెస్ స్టేట్ అప్ తమిళనాడు (2007 ) కేసులో ప్రకటించింది.   సుప్రీం కోర్టు ఇప్పుడు మణిపూర్ లోని పరిస్థితి తీవ్రతను గుర్తించింది. నిశ్చయంగా    దృడమైన వైఖరితో వ్యవహరిస్తుందని నమ్ముదాం.

వ్యాసకర్త సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్

జులై 22  ఇండియన్ ఎక్స్ ప్రెస్

Leave a Reply