కవిత్వం

నగ్నదేహం

నగ్న దేహమొకటి దేశాన్ని కౌగిలించుకున్నది ఖైర్లాంజి ,వాకపల్లిని భుజాల మీద మోస్తూనే దేశాన్ని వివస్త్రం చేసింది లెక్కకు మించిన గాయల్ని తడిమి తడిమి చూపుతోంది ఇప్పుడా నగ్నదేహమొక దిక్సూచి.. పొదలమాటు హత్యాచారమే ప్రజాస్వామ్యపు తెరనెక్కి మంటల్లో కాలిన పిండాలని మర్మస్థానంలోని కర్రలనీ ఎత్తిచూపుతోంది ఇప్పుడా "హత్యా"చారమే ఈ దేశపు ముఖచిత్రం న్యాయం కళ్ళు మూసుకున్నది సహజంగానే.. చూసే కండ్లుoడాలి గానీ ఇప్పుడీ అడవులు నదులు మనుషులు ప్రతి అణువూ మానభంగ భారతమే తగలపడ్డ దేశంపై మూగి వెచ్చగా చలి కాచుకుంటున్న పవిత్రులారా రక్తం స్రవిస్తున్న దేశంపై జాలి జాలిగా ముసురుకున్న సున్నితులారా చెప్పండి చెరచబడ్డది ఎవరు? ఆమె నా