కగార్ ఒక యుద్ధ వ్యూహం
(ఇటీవల ఆపరేషన్ కగార్ మీద విరసం ప్రచురించిన *దేశం కార్పొరేట్లకు* అనే పుస్తకానికి రాసిన ముందు మాట ) ఒక యుద్ధ వ్యూహానికి అనేక పార్శ్వాలు వుండవచ్చు. ఒకసారి యుద్ధమంటే ఎదురు దాడి. మరోసారి యుద్ధమంటే ఆక్రమణ. ఈ ఆక్రమణ అన్ని సందర్భాల్లోనూ ఒకేలా వుండదు. దేశాల మధ్య యుద్ధం. దేశం లోపల యుద్ధం. దేశాల మధ్య యుద్ధానికి సరిహద్దు, ద్వైపాక్షిక సంబంధాలు కేంద్రంగా వుంటాయి. దేశ అంతర్గత యుద్ధానికి తన పౌరులనే శత్రువులుగా పరిగణించే రాజ్య స్వభావం వుంటుంది. భారతదేశంలో ఆదివాసీ సమూహం భారత రిపబ్లిక్కు శత్రువుయింది. ఎందుకిలా అయింది? ఈ ప్రశ్న మరీ పాతది. అయినా