సంభాషణ

ఒక జర్నలిస్టు చెలామణిలో లేకుండా అయిన తీరు

భారతదేశంలో ఖైదులో ఉన్న జర్నలిస్టులకు ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ అంటే ఏమిటి? 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో జైలు ఊచల వెనుక ఉన్న ఇద్దరు జర్నలిస్టులు - జార్ఖండ్‌కు చెందిన రూపేష్ కుమార్ సింగ్, జమ్ము కశ్మీర్ జర్నలిస్ట్ ఇర్ఫాన్ మెహరాజ్‌ల కోసం 'ఫ్రీ స్పీచ్ కలెక్టివ్' ఈ ప్రశ్నను సంధిస్తోంది. 'వాండే' మ్యాగజైన్ ఎడిటర్ ఇర్ఫాన్ మెహరాజ్‌ను, 2023 మార్చి 20నాడు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద నమోదు చేసిన ఆరోపణలపై అరెస్టు చేసారు. ఆయనపై విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. కాశ్మీర్‌లోని  సంక్లిష్ట రాజకీయాలు, దాని
సంభాషణ

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం! ఖైదులో జర్నలిస్టులు

భారతదేశంలో ఖైదులో ఉన్న జర్నలిస్టులకు ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ అంటే ఏమిటి? ఈ ఏడాది మే 3, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో జైలు ఊచల వెనుక ఉన్న ఇద్దరు జర్నలిస్టులు - జార్ఖండ్‌కు చెందిన రూపేష్ కుమార్ సింగ్,  జమ్ము- కశ్మీర్ జర్నలిస్ట్ ఇర్ఫాన్ మెహరాజ్ కోసం 'ఫ్రీ స్పీచ్ కలెక్టివ్' ఈ ప్రశ్నను సంధిస్తోంది. రూపేష్ కుమార్ సింగ్ 2022 జూలై 17 నాడు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా), 1967 కింద నమోదైన ఆరోపణలపై అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆయనపై విచారణ కొనసాగుతోంది. తన కుటుంబానికి దూరంగా ఉన్న
వ్యాసాలు

నూతన మానవుడు ఇడుమాల్

జల్, జంగల్, జమీన్ పై సర్వఅధికారాలు ఆదివాసులకే అంటూ వర్గ పోరాటంలో చివరివరకు ఎర్ర జెండాను ఎత్తిపట్టిన వీరయెధ, గుండాదూర్ వారసుడు మాడ్వి ఇడుమాల్ అమర్ రహే! మాడ్వి దేవాల్ (కామ్రేడ్ ఇడుమాల్ గా) విప్లవ కార్య చరణలో పార్టీ, క్యాడర్, ప్రజలకు విశ్వసనీయ, ప్రియమైన  నాయకుడిగా ఎదిగినాడు. మీడియాలో ఆయన పేరు హిడ్మాగా ప్రచారం అయ్యింది. సల్వాజుడుమ్, గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్, ఫాసిస్టు’కగా ర్’ల్లోనూ, ప్రజాఉద్యమ ఆటు-పోటుల్లోనూ ధృడంగా నిలబడి, తన తోటివారిని నిలబెట్టిన, నిబద్దత గల ప్రజా నాయకుడిగా ఎదిగినాడు. ప్రజాయుద్ద సమరంలో బోల్షివిక్ ధృఢ సంకల్పంతో పీడిత వర్గ పక్షాన నిల్చి శత్రువు
తొలికెరటాలు

త్యాగమూర్తి సావిత్రీబాయి ఫూలే

సావిత్రీబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రీబాయి ఫూలే 1831, జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా, ఖండాలా తాలూకాలోని నాయగావ్ అనే గ్రామంలో జన్మించారు. ఆమె తల్లి పేరు లక్ష్మీబాయి మరియు తండ్రి వారు ఖండోజీ నెవసే పాటిల్. ఆమె తండ్రి ఆ గ్రామానికి పాటిల్, అంటే గ్రామ పెద్దగా ఉండేవారు. ​సావిత్రీబాయి ఫూలే వెనుకబడిన తరగతికి చెందిన 'మాలి' పూల తోటల పెంపకం చేసే కుటుంబంలో జన్మించారు. ఆమె తన తల్లిదండ్రులకు నలుగురు పిల్లలలో పెద్ద కుమార్తె. ఆనాటి సామాజిక పరిస్థితుల ప్రకారం సావిత్రీబాయి గారికి, ముఖ్యంగా ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఉండేది కాదు.
వ్యాసాలు

జీవితం పుస్తకమే, నేస్తమూ పుస్తకమే: జంధ్యాల రఘుబాబు

చౌసా - గాజా కవిత్వం తెలుగు నుండి ఆంగ్లంలోకి 'బిసాన్ ఓవ్ డా' పేరిట అనువదించారు, పెట్టుడు రెక్కలు కథా సంపుటి, సైరా మా బళ్ళారి పాటల సంపుటి,నెర్రెలు -రాయలసీమ కరువు పై కవితా సంపుటి, అద్దంలో బొమ్మలు కథా సంపుటి, అక్షరకాంతులు (విమర్శ వ్యాసాలు),నా తొలి జీవితం ... ఫెడల్ కాస్ట్రో ,నా స్మ్రుతిలో చెగువేర  ...  ఫెడల్ కాస్ట్రో ( అనువాదం) , చౌసా - గాజా కవిత్వం తెలుగు నుండి ఆంగ్లంలోకి 'బిసాన్ ఓవ్ డా' పేరిట అనువదించిన రచయిత, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడే పుస్తకాల గురించి చెప్పిన
పత్రికా ప్రకటనలు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిబండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్నిమహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

తేదీ: 12.05.2026 కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలిక తనపై బండి సాయి భగీరథ్ లైంగిక అత్యాచారం చేశాడని, గత నాలుగు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తే, గంటల తరబడి స్టేషన్లో నిలబెట్టి దోషులకు సమాచారం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మైనర్ బాలికపై అత్యాచారం పోక్సో చట్టం ప్రకారం వెంటనే చర్య తీసుకోవాల్సింది పోయి,
కథలు

UNITY IN DIVERSITY🌈

      సాత్వికి "అక్షర"  స్కూల్లో ఫోర్త్ క్లాస్ చదువుతోంది. ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళిరావడం, సాయంత్రమైతే ట్యూషన్ కి వెళ్ళడం ఇదంతా తన దినచర్యలో భాగం. అలాగే నిన్నటి రోజు కూడా ట్యూషన్ కి వెళ్ళి“మామ్! రేపు సోషల్ ఎగ్జామ్ , క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయరా...”అని టీచర్ని అడిగింది. టీచర్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసింది.     అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే... India is an example of unity in diversity. చాలా హ్యాపీగా చాలా ఉత్సాహం తోటి ఈ పాపకు రకరకాల ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి అని
ఆర్ధికం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అక్రమ యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలించేలా మారుతోంది. దేశ దేశాలు గ‌డ్డు ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యం.. గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా యుద్ధంలో పాల్గొనే దేశాలన్నీ వినాశకరమైన పరిణామా లను ఎదుర్కోవాల్సిందే అన్న సత్యాన్ని మరోసారి రుజువు చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఆ దేశాల్లో మౌలిక సదుపాయాలు ద్వంసమై, పర్యావరణం దెబ్బతిని, ఆ దేశాల అబివృద్ధి దశాబ్ధాల వెనుక‌కు వెళ్లిపోయింది. ఇరాన్‌లోని విస్తారమైన చమురు వనరులను స్వాదీనం చేసుకోవాలనే దురాశతో ఉన్న అమెరికా పెట్టుబడిదారీ వర్గం అనుకూల సమయం
వ్యాసాలు

యూనివర్సిటీలో విస్తరిస్తున్న కాషాయ ఏ.బి.వి.పి

మే 3,4 తేదీలలో ఎం.ఏ రెండోవ సంవత్సరం థియేటర్ ఆర్ట్స్ విభాగం విద్యార్థులు తమ పరీక్షలో భాగంగా “హోలి”(holi) అనే నాటకాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని జి‌బి హాల్లో ప్రదర్శించారు. మొదటి రోజు ప్రదర్శన ముగిసే సమయానికి ఏ‌బి‌వి‌పి కార్యకర్తలు జి‌బి హాల్ దగ్గరికి చేరుకుని ఈ నాటకంలో పలు సన్నివేశాలు ‘హిందువుల మనోభావాలు’ దెబ్బతీసేవిగా, హిందూమతాన్ని అవమానించేలాగా ఉన్నాయి అంటూ నాటకం ప్రదర్శిస్తున్నా విద్యార్థులకు, అధ్యాపకులకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ, మరుసటి రోజు ఈనాటకాన్ని ప్రదర్శించనివ్వబోమని హెచ్చరించారు. ఆ తరువాత ఈ నాటకం ఒక మతాన్నిఅవమానించే విషయాలను ప్రోత్సహిస్తోంది అని, ఈ నాటకాన్ని బహిష్కరించాలి అంటూ విద్యార్థుల, హాస్టల్
సంపాదకీయం

చికాగో నుండి నోయిడా దాకా కార్మిక వర్గ పోరాటాలకు జేజేలు

భారత పోరాటాల చరిత్రలో మరొక పోరాటం నమోదు అయింది. గత దశాబ్ద కాలంలో దేశంలో ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం, రైతు ఉద్యమాలు, సిలింగేర్, తిజీమాలి లాంటి ఆదివాసీ పోరాటాలు జరిగాయి. ఇప్పుడు నోయిడా కార్మిక ఆందోళన వాటి సరసన చేరింది. వీటిలో దేనికవే ప్రత్యేకమయిన పోరాటలు. మరొకవైపు ఇవన్ని కార్పొరేట్ హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు. ఈ తరహా పోరాటాలే దేశంలో అరకొరగా మిగిలి ఉన్న పోరాట, ప్రజాస్వామిక వాదులకు ఊపిరి అవుతున్నాయి. వీటిని కాపాడుకోవటం అనేది దేశ ప్రజలకు అవసరం, ఆవశ్యకత.                  నోయిడాలో 82 ఫ్యాక్టరీలకు చెందిన కార్మికులు ఏప్రిల్ మొదటి వారం నుంచి సమ్మె