కవిత్వం

దేని గురించి మాట్లాడగలను

ఈ రోజు దేని గురించి మాట్లాడగలను మరణాల గురించి తప్ప పాలస్తీనాలో పసికందుల మరణాల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను దండకారణ్యం గురించి తప్ప ఆకాశం నుండి నేలతల్లి ఒడిలోని ఆదివాసీ పసిపాపలపై జరుగుతున్న బాంబు దాడుల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను బుల్డోజర్ దాడుల గురించి తప్ప మసీదుల కింద తవ్వుతూ కొత్తగా లేని ఆనవాళ్ళేవో దొరికాయని కూల్చి వేసే కుట్రల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కోరితే కాల్పులు జరుపుతున్న వాడి నైజాన్ని గురించి తప్ప
వ్యాసాలు

ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి ఉందని  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అనింది. అంటే పదేళ్లపాటు ప్రజాస్వామ్యంపట్ల ఖాతరు లేని బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఒకటికి రెండుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిందని అర్థం. ప్రజాస్వామ్యం ధ్వంసమైపోయి కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే మిగిలింది.  దాని ద్వారా ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వచ్చిన పార్టీ భారతదేశాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని మరే పార్టీకంటే ఎక్కువ కాలం పాలించింది. బిజెపిని మినహాయిస్తే మరే పార్టీకంటే ఎక్కువ దుర్మార్గాలకు, ప్రజా వ్యతిరేకత చర్యలకు పాల్పడిన గతం కాంగ్రెస్‌కు ఉన్నది. అలాంటి పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి
కవిత్వం

సరోజ్‌దత్తా కవితలు

1969 ఏప్రిల్‌ 22న లెనిన్‌ శతజయంతి రోజు ఏర్పడిన సిపిఐఎంఎల్‌ కు సరోజ్‌దత్తా సాంస్కృతిక సేనాని. ఈ మార్చి 11న ఆయన 110వ జయంతి. సిద్ధార్థ శంకర్‌రే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను 1971 ఆగస్టు 4`5 తెల్లవారకుండానే కిడ్నాప్‌ చేసి కలకత్తా, షహీద్‌మినార్‌ మైదానంలో ఒక మూలన కాల్చి చంపిది. లెనిన్‌ శత వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన బ్రాహ్మణీయ ఫాసిస్టు వ్యతిరేక కవితలు మూడు వసంతమేఘం పాఠకుల కోసం... 1. యవ్వనం నేను చండాలుడ్ని జీవితానికి అస్పృశ్యుడ్ని ఈ శ్మశానవాటిక నుంచి జీవితాలు తమ ముగింపు చూసే చోటి నుంచి నేను చితిమంటల బూడిద నుంచి బొగ్గులు
ఆర్ధికం

మాంద్యంలోకి ప్రపంచ దేశాలు

ఆర్థిక మందగమన మేఘాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు... అగ్రరాజ్యం, చిన్న రాజ్యం అని లేదు. అన్నింటినీ కబళించి వేయడానికి మాంద్యం దూసుకోస్తోంది. ఒకవైపు యుద్ధాలు, యుద్దాలతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ విబేధాలు మరోవైపు పర్యావరణ మార్పులు, కారణాలేమైతేనేం... ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్‌ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్‌ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్‌ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా
వ్యాసాలు

మన  రైతాంగ భవితవ్యం WTO దయా దాక్షిణ్యాల్లో

విధ్వంసం  విధ్వంసం నుండి కాదు విధ్వంసం లేకుండా నిర్వహించడం సాధ్యం కాని వ్యాపార ఒప్పందాల నుండి ఉద్భవిస్తుంది. -బెర్టోల్ట్ బ్రెచ్ట్ గత 20 ఏళ్లలో 3,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మూడు రైతు వ్యతిరేక దుర్మార్గ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన ధర్నాలో  700 మంది రైతులు అమరులయ్యారు. నవంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే, మూడు చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధరపై పటిష్టమైన చట్టం చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించాడు. పేద రైతుల కోసం, దేశాభివృద్ధి కోసం ఈ చట్టాలను రూపొందించామని, కానీ వాటి
వ్యాసాలు

కనీస మద్దతు ధరవెనుక వాస్తవం

నీటి కొరతతో బాధపడుతున్న పంజాబ్‌లో పంటల వైవిధ్యీకరణను అమలు చేయడం నేడు చాలా అవసరం. కానీ గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో పప్పుధాన్యాలు, ప్రత్తి, మొక్కజొన్న ఉత్పత్తి, సేకరణ గణనీయంగా తగ్గింది. ఈ పంటలను సాపేక్షికంగా చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే ఐదేళ్లలో ఈ పంటలకు సంబంధించి  కేంద్రంపై దాదాపుగా ఎటువంటి భారం పడదు. పంజాబ్‌లో వ్యవసాయం స్థితిగతులు ఏమిటో, రైతు సంఘాలు ఢిల్లీ చలో అనే నినాదంతో పెద్ద ముందంజ వేయడానికి ఎందుకు సిద్ధమవుతున్నాయో చూద్దాం. ఫిబ్రవరి 18 వ తారీకు ఆదివారం అర్ధరాత్రి వరకు నిరసనకారులతో జరిగిన నాలుగో విడత చర్చల్లో
Stories

Priceless

The Division Committee (DVC) meeting was over and everybody was making preparations to go back to their areas. As every other DVC member, Pusu was terribly busy too. Pusu was planning appointments (‘APT’s) with the couriers. He checked if things to be taken and given had been exchanged properly or if something went missing. He wrote some important letters that had to be written, in the last minute. He tried
కరపత్రాలు

 ప్రజా పాలనా? నియంతృత్వ పాలనా?

పూసపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలి!   ఏజెన్సీ గ్రామాలపై కూంబింగ్‌ను నిలిపి వేయాలి!! ప్రియమైన ప్రజలారా, రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనూ అక్రమ అరెస్టులు, కుట్ర కేసులు, పోలీసు   కూంబింగ్‌లు  షరా మామూలుగానే వుండబోతున్నాయా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాన్ని రేవంత్‌రెడ్డి గారి ప్రభుత్వం యిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు విశదం చేస్తున్నాయి. సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ అశోక్‌ అన్న (కుర్సం వజ్జయ్య), రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ గోపన్న (దనసరి సమ్మయ్య), జిల్లా నాయకులు కామ్రేడ్స్‌ పుల్లన్న (సంగపొంగు ముత్తయ్య), ఎస్‌కె.మదార్‌, కలకొండ సురేశ్‌లను పోలీసులు అరెస్టు చేసిన తీరూ, వారితో పాటు మొత్తం
కవిత్వం

మహమూద్ కవితలు

1 వేడుకోలు చీకటి పాత్ర లో నిండుగా ఉన్నది వెన్నెల మధువు మత్తుని ఆహ్వానించడానికి సిధ్ధంగా ఉంది ప్రేమ నిండిన హృదయం ఏక్కడో దూరం నుంచి ఓ తల్లి గాత్రం బిడ్డకి పాలు పడతూ ఆదమరచడానికి భూమికింత చల్లగాలిని జోలపాటగా అందిస్తోంది ఏ బతుకు యుధ్ధంతో ఘర్షణ పడుతున్నారో మనుషుల జాడ లేదు మధువు తాగేటప్పుడు తోడు కోరుతుంది కదా మనసు ఒంటరితనం ఒక ఉన్మత్త దుఃఖం దుఃఖం ఓ ఒంటరి యుధ్ధం దేహానికీ, హృదయానికీ గాయం కానివాడెవడూ మధువుని కోరుకోడు తోడునీ కోరుకోడు తెగిన బంధాలని జతచేయడానికి గాయాలు మానడానికి అనువైన కాలం ఇది జహాపనా! కొందరు
సమీక్షలు

మట్టి మాటల కవి

Truly to sing, that is a different breath. Rainer Maria Rilke. (Austria poet) ఇప్పుడు రాస్తున్న యువకులు అంతా తమ కొత్త గొంతుతో‌ ధిక్కార స్వరంతో‌ తమదైన నుడికారంతో రాస్తున్నారు. ఇటీవలి‌ విరసం సభలలో ఆవిష్కరించిన "నేల నుడికారం" కవిత్వం ఉదయ్ కిరణ్‌ రాసింది చదువుతుంటే మనల్ని మనంగా నిలవనీయని ఒక కుదుపు ఆ పదాల‌ పొందికలో చూసిన‌ అనుభూతికి లోనవుతాం. తీరికగా కూచుని కవిత్వం రాసే తరం కాదిది. పొట్టకూటి కోసం నిరంతరం శ్రమిస్తూనే తమ‌ రోజువారీ పనులు చేస్తున్నట్లుగానే ప్రజల పట్ల ఒక బాధ్యతగా రాస్తున్న యువతరమిది. చెప్పాలనుకున్నది సూటిగా గుండెల్లోకి