నా నేల నిమ్మలంగుంటే బాగుండు…
నా నేలమీద చావుల సాగు చేస్తున్నరు...కత్తులతో దున్ని శవాల విత్తులేస్తున్నరు...వేళకి నెత్తుటి వాన మస్తు కురుస్తుంది...పైరుకి బాంబుల ఎరువులు చల్లుతున్నరు...అయినా ఏ మొక్కై మొలవాల్నో తెల్వక విత్తులు భూమి పొత్తిళ్ళలోనే దాక్కున్నయ్...కుప్పలు తెప్పలుగా విత్తులు పోగైతనే ఉన్నయ్...నెత్తుటి వాన కుండపోతగా కురుస్తనే ఉంది... కన్నీటి కాలువల కన్న బిడ్డల శవాలనేరుకుంటున్నరు కొందరు...నెత్తుటి వాసనని అత్తరు వాసనలా అస్వాదిస్తున్నరు కొందరు...ఎవడి గెలుపోటముల కోసమో ఈ ఆటలు...గెలిచాకా ఎవడు జరుపుకుంటరో ఆ గెలుపు సంబరాలు....ఏ దిక్కుమాలిన దేహంలో పుట్టిందో ఈ నీతిమాలిన సాగు చేయాలనే ఆలోచన...ఆ ఆలోచనని ఎవరు బొందపెడుతరో...ఆ ఆలోచన పుట్టిన దేహం ఎప్పుడు దహనమైతదో...ఆ విత్తులకి శక్తులొచ్చి చావుల






