కవిత్వం

సరోజ్‌దత్తా కవితలు

1969 ఏప్రిల్‌ 22న లెనిన్‌ శతజయంతి రోజు ఏర్పడిన సిపిఐఎంఎల్‌ కు సరోజ్‌దత్తా సాంస్కృతిక సేనాని. ఈ మార్చి 11న ఆయన 110వ జయంతి. సిద్ధార్థ శంకర్‌రే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను 1971 ఆగస్టు 4`5 తెల్లవారకుండానే కిడ్నాప్‌ చేసి కలకత్తా, షహీద్‌మినార్‌ మైదానంలో ఒక మూలన కాల్చి చంపిది. లెనిన్‌ శత వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన బ్రాహ్మణీయ ఫాసిస్టు వ్యతిరేక కవితలు మూడు వసంతమేఘం పాఠకుల కోసం... 1. యవ్వనం నేను చండాలుడ్ని జీవితానికి అస్పృశ్యుడ్ని ఈ శ్మశానవాటిక నుంచి జీవితాలు తమ ముగింపు చూసే చోటి నుంచి నేను చితిమంటల బూడిద నుంచి బొగ్గులు