సంభాషణ

ఢిల్లీలో రైతులపై పోలీసుల క్రూరత్వం

యువ రైతు శుభ్ కరణ్ సింగ్ దారుణ హత్యకు, భద్రతా దళాలు రైతులపై కొనసాగిస్తున్న హింసకు నిరసనగా ఫిబ్రవరి 23ను బ్లాక్ డేగా జరపాలని సమైక్య కిసాన్ మోర్చా (ఎస్‌కెఎమ్), రాష్ట్ర అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (సిఎఎస్ఆర్)లు ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా, జంతర్‌మంతర్ దగ్గర శాంతియుత ప్రదర్శన కోసం యిచ్చిన  పిలుపుకు ప్రతిస్పందనగా, నేను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు నా సంఘీభావాన్ని తెలియచేయడానికి  వెళ్ళాను. నిరసనకారులెవరూ  అక్కడ లేరు కానీ పోలీసులు, ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటిబిపి) పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడనుంచి  మెట్రో స్టేషన్ కు వెళ్ళాను, అక్కడ వివిధ విద్యార్థి సంస్థలకు
పత్రికా ప్రకటనలు

WTO నుంచి బైటికి రావాలి

"డబ్ల్యుటిఓను విడిచి పెట్టండి " అనే నినాదంతో సంయుక్త్ కిసాన్ మోర్చా యిచ్చిన పిలుపును దేశంలోని 400 జిల్లాల్లో ట్రాక్టర్ ప్రదర్శన  జరిగింది. రైతులు డబ్ల్యుటిఓ దిష్టి బొమ్మను కాల్చారు. డబ్ల్యుటిఓను వదిలి పెట్టాలని డిమాండ్ చేసారు. రైతులపై కాల్పులు, దాడులకు గృహ మంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజల్‌ను బాధ్యులుగా పేర్కొంటూ వారి రాజీనామాను డిమాండ్ చేసింది.  పంజాబ్‌ను విచ్ఛిన్నం చేయడానికి, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఈ అంశాన్ని ఉపయోగించి  ఎన్నికల ప్రయోజనాన్ని పొందటానికి, పంజాబ్ రైతులపై తీవ్ర అణచివేతకు కుట్ర పన్నడానికి నేరుగా బాధ్యుడని కేంద్ర
సంభాషణ

“నీడలు” పెంచిన ఆశలు

(ఇటీవల విరసం సభల్లో ప్రదర్శించిన నాటిక ముందు వెనుకల కళాత్మక అనుభవం ) మొదట్లో నాకు ఈ నాటకం మీద పెద్ద అంచనాలు ఏమి లేవు. ఓ రోజు పాణి గారు నాకు ఫోన్ చేసి  సిటీ యూనిట్ సభ్యులు వరలక్ష్మి గారి కథ "నీడలు" ను నాటకంగా వేద్దామనుకుంటున్నారు . మీతో మాట్లాడతారట " అంటూ ప్రస్తావన తెచ్చాడు. ఆ తర్వాత అనుకున్నట్లే చందు ఫోన్ చేసి" నీడలు "కథను నాటకంగా రాస్తే, యూనిట్ సభ్యులు నాటకం వేస్తారని , మీకు వీలవుతుందేమో చూడమని చెప్పాడు.                                           *** ఆ కథ ను నాకు పంపడం, నేను
వ్యాసాలు

మనందరం తెగబడి పోరాడాల్సిన 21 డిమాండ్ల చార్టర్

2024 ఫిబ్రవరి 16న అఖిల భారత గ్రామీణ బంద్; పారిశ్రామిక / రంగాల సమ్మె సందర్భంగా సంయుక్త్ కిసాన్ మోర్చా, జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ (జెపిసిటియు) విడుదల చేసిన 21 పాయింట్ల డిమాండ్ల చార్టర్  సంయుక్త్  కిసాన్ మోర్చా (ఎస్కెఎం) సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ఇండిపెండెంట్ సెక్టోరల్ ఫెడరేషన్లు / అసోసియేషన్ల ఉమ్మడి వేదిక మోదీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 2024 ఫిబ్రవరి 16 న గ్రామీణ బంద్; పారిశ్రామిక / రంగాల సమ్మెకు పిలుపునిచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ద్రవిడ మున్నేత్ర కాజకాం,
వ్యాసాలు

మరోసారి రైతుల నిరసన జ్వాల

2021 లో ఏడాది పొడవునా నిరసన వ్యక్తం చేసిన తరువాత, భారతదేశ రైతులు వ్యవసాయ రంగాన్ని "సరళీకరించడానికి" ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయించగలిగారు. ఇప్పుడు 2024లో రైతులు మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత నిరసనలకు దారితీసిన వ్యవసాయాన్ని నియోలిబరల్ కార్పొరేటీకరణకు అనువుగా మార్చివేయడం అనే సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ వ్యవసాయ వ్యాపార సంస్థలు, ఆర్థిక మూలధనం భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌పరం చేసేందుకు ఒక నిర్దిష్ట పథకం ప్రకారం ప్రయాస పడుతున్నాయి. ఈ పథకం 1990ల ఆరంభంలో మొదలైంది.  ఈ ప్రణాళికను అమలు చేయడానికి
వ్యాసాలు

శుభ్‌కరణ్  హత్యకు హర్యానా పోలీసులే కారణం 

ఫిబ్రవరి 21న పంజాబ్ - హర్యానా ఖనౌరి సరిహద్దులో హర్యానా పోలీసుల చర్యలో శుభ్‌కరణ్ మరణించాడు. ఆయన మరణం కారణంగా రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’ నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. 22 ఏళ్ల రైతు శుభ్‌కరణ్ సింగ్ రైతు ఉద్యమ సమయంలో మరణించడంతో  పంజాబ్ లోని బటీండా జిల్లాలోని బల్లో గ్రామంలో విషాదకర వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 21 న పంజాబ్, హర్యానా సరిహద్దులోని పటియాలా జిల్లాలోని పతారాన్ పట్టణానికి సమీపంలో ఖనౌరీ సరిహద్దులో కొందరు నిరసనకారులు బారికేడ్ల వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అందువల్ల రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’  నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.
కవిత్వం

పోదాం పద ఢిల్లీలో కవాతు చేద్దాం

కవితలల్లుదాం ఢిల్లీలో రైతుల పోరు నినాదాలను కథలు చెపుదాం రైతుల నెత్తురే ధారలై పారుతున్న ఢిల్లీ సరిహద్దుల దారుల కోసం! పిడికిళ్లు ఎత్తుదాం దగాపడ్డ బతుకుల పోరుదారిలో ! ఈ అక్షరాలను అస్వాదించండి ఆరాధించడం వద్దు మాట్లాడుదాం రైతుల పోరు ముచ్చట్లను! ఈ పదాలకు పెదవి విరుపులు అలంకారమే ! పెదాల బిగువున దాగిన మౌనాన్ని వీడి అక్షరాల అలుగు దునికిద్దాం ! మాట్లాడుదాం రైతుల పోరు గాథలను ఢిల్లీ సరిహద్దులు రక్తసిక్త మౌతుంటే, అక్షరాలా అగ్నిదీపాలను సృష్టిస్తాం! మనం తినే పళ్లెంలో అన్నంకు బదులు, రైతన్నల రక్తపుచుక్కలు మెరుస్తున్నయ్ ! ఆ వేళ యాడాదినర్థం పోరు పొద్దులై
కవిత్వం

నాదొక చివరి కోరిక

నా చిట్టి చేతుల్తో అనేకసార్లు నా మొఖాన్ని తడుముకున్నాను నా చిట్టి చేతుల్తో అనేకసార్లు నా కన్నీళ్లను తుడుచుకున్నాను నా చిట్టి చేతుల్తో అనేకసార్లు ఆకలంటూ నా పొట్టను పట్టుకున్నాను బాంబుల శబ్దానికి ఉలిక్కిపడి నా తల్లిని కౌగిలించుకునేవాడిని నా తల్లి పొట్టమీద ఒక చేయి వేసి హాయిగా నిదురపోయేవాడిని నీళ్ళల్లో పడ్డ చందమామను నా అరచేతులతో తీసి కాపాడేవాడిని బాంబులతో నా తల్లిరొమ్మును పేల్చినట్టు చందమామనూ బాంబులతో నీళ్లలో పడవేసి ఉంటారో కాబోలు ఉదయాన్నే నా అరచేతుల మీద సూర్యకాంతి పడుతుంటే ఎంత్అందంగా ఉండేవో చేతులను చూసి మురిసిపోయేవాడిని నా మురిపాన్ని చూసి చేతులు కూడా సన్నగా
సంపాదకీయం

రాముడ్ని కాదు, రైతును చూడండి

ప్రతి ఉద్యమం సమాజానికి ఒక మేల్కొలుపు వంటింది. అది వాస్తవ పరిస్థితి పట్ల కళ్లు తెరిపించి మార్పు కోసం దారి చూపిస్తుంది. అయోధ్య రామున్ని అడ్డం పెట్టి హిందూ మెజారిటీని భక్తితో, ముస్లింలు తదితర మైనారిటీలను భయంతో కళ్లు, నోరు మూసుకునేలా చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంది బిజెపి. పాత ఎత్తుగడే కానీ ఇప్పుడు ఇనుమడిరచిన ఉత్సాహంతో, మీడియాను తన వశం చేసుకున్నాక రెట్టించిన బలంతో పాచిక వేసింది. రాముడొచ్చాడు అని దిక్కులు మోగేలా అరిచింది మీడియా. రాముడొచ్చాడు కాచుకోండి అన్నారు ఫాసిస్టులు. ఆ భజన మోతలో, ఆ ఆర్భాటంలో మణిపూర్‌ల కేకలు వినపడలేదు, అదానీల దోపిడి కనపడలేదు. ఇంకా