వ్యాసాలు

మరోసారి రైతుల నిరసన జ్వాల

2021 లో ఏడాది పొడవునా నిరసన వ్యక్తం చేసిన తరువాత, భారతదేశ రైతులు వ్యవసాయ రంగాన్ని "సరళీకరించడానికి" ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయించగలిగారు. ఇప్పుడు 2024లో రైతులు మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత నిరసనలకు దారితీసిన వ్యవసాయాన్ని నియోలిబరల్ కార్పొరేటీకరణకు అనువుగా మార్చివేయడం అనే సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ వ్యవసాయ వ్యాపార సంస్థలు, ఆర్థిక మూలధనం భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌పరం చేసేందుకు ఒక నిర్దిష్ట పథకం ప్రకారం ప్రయాస పడుతున్నాయి. ఈ పథకం 1990ల ఆరంభంలో మొదలైంది.  ఈ ప్రణాళికను అమలు చేయడానికి