కవిత్వం

పోదాం పద ఢిల్లీలో కవాతు చేద్దాం

కవితలల్లుదాం ఢిల్లీలో రైతుల పోరు నినాదాలను కథలు చెపుదాం రైతుల నెత్తురే ధారలై పారుతున్న ఢిల్లీ సరిహద్దుల దారుల కోసం! పిడికిళ్లు ఎత్తుదాం దగాపడ్డ బతుకుల పోరుదారిలో ! ఈ అక్షరాలను అస్వాదించండి ఆరాధించడం వద్దు మాట్లాడుదాం రైతుల పోరు ముచ్చట్లను! ఈ పదాలకు పెదవి విరుపులు అలంకారమే ! పెదాల బిగువున దాగిన మౌనాన్ని వీడి అక్షరాల అలుగు దునికిద్దాం ! మాట్లాడుదాం రైతుల పోరు గాథలను ఢిల్లీ సరిహద్దులు రక్తసిక్త మౌతుంటే, అక్షరాలా అగ్నిదీపాలను సృష్టిస్తాం! మనం తినే పళ్లెంలో అన్నంకు బదులు, రైతన్నల రక్తపుచుక్కలు మెరుస్తున్నయ్ ! ఆ వేళ యాడాదినర్థం పోరు పొద్దులై