“డబ్ల్యుటిఓను విడిచి పెట్టండి ” అనే నినాదంతో సంయుక్త్ కిసాన్ మోర్చా యిచ్చిన పిలుపును దేశంలోని 400 జిల్లాల్లో ట్రాక్టర్ ప్రదర్శన  జరిగింది. రైతులు డబ్ల్యుటిఓ దిష్టి బొమ్మను కాల్చారు. డబ్ల్యుటిఓను వదిలి పెట్టాలని డిమాండ్ చేసారు.

రైతులపై కాల్పులు, దాడులకు గృహ మంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజల్‌ను బాధ్యులుగా పేర్కొంటూ వారి రాజీనామాను డిమాండ్ చేసింది. 

పంజాబ్‌ను విచ్ఛిన్నం చేయడానికి, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఈ అంశాన్ని ఉపయోగించి  ఎన్నికల ప్రయోజనాన్ని పొందటానికి, పంజాబ్ రైతులపై తీవ్ర అణచివేతకు కుట్ర పన్నడానికి నేరుగా బాధ్యుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రైతు నాయకులు నిందించారు.

హర్యానా సీఎం ఖట్టర్, హోంమంత్రి అనిల్ విజ్ చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర సరిహద్దులో బుల్లెట్, పెలెట్‌లు, టియర్ గ్యాస్ షిల్స్ ఉపయోగించడానికి, అక్కడ ఉన్న రైతుల వందలాది ట్రాక్టర్లకు నష్టం  కలిగించేందుకు  పోలీసు బలగాలను పంపారు.

బుల్డోజర్ రాజ్యం లాగా, రైతుల ఆస్తులను ఫాసిస్టులు ధ్వంసం చేసినట్లు, రైతులు ట్రాక్టర్లను రోడ్లపైకి తీసుకెళ్లవద్దని ఆదేశించారు. ఈ రైతు వ్యతిరేక దాడిని నిరసిస్తూ ఎస్‌కెఎం ట్రాక్టర్లను రోడ్డుపై నిలబెట్టి నిరసన సభను నిర్వహించింది.

కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, చౌకధరలకు రేషన్ C2 + 50% (స్వామినాథన్ కమిషన్ C2 ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధరని నిర్ణయించాలని సిఫార్సు చేసింది. కాబట్టి MSPని లెక్కించడానికి చివరి ఫార్ములా: C2+ 50 శాతం (C2లో)) లాభదాయక రేటుతో భారతదేశ రైతులు, శ్రామిక జనాభా ఉనికికి ద్వంద్వ అవసరాలు అని నాయకులు వివరించారు.

మతపరమైన మారువేషంలో దాగి ఉన్న ప్రభుత్వ విధానం, వ్యవసాయ రంగంలో విదేశీ మూలధనం, పెద్ద కంపెనీలను ప్రోత్సహిస్తోంది, వ్యయ ధరలను పెంచుతోంది, పంట అమ్మకపు ధరలను తగ్గిస్తోంది, ఆహార సరఫరా గొలుసులను నియంత్రిస్తోంది, భూమి, నీటి వనరులను ఆక్రమిస్తోంది, రైతు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది.

సంయుక్త్ కిసాన్ మోర్చా మార్చి 14 న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ఎత్తున కిసాన్ మహా పంచాయతీని నిర్వహిస్తుంది, ఇందులో దేశవ్యాప్తంగా రైతులు పాల్గొంటారు.

ప్రకటన విడుదల: మీడియా సెల్, సంయుక్త్ కిసాన్ మోర్చా

*      *       *

సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) సెంట్రల్ ట్రేడ్ యూనియన్‌లు, ఇండిపెండెంట్ సెక్టోరల్ ఫెడరేషన్లు / అసోసియేషన్ల వేదిక ఈ రోజు- 26 ఫిబ్రవరి 2024 న జరిగిన ఉమ్మడి సమావేశం తరువాత పత్రికలకు ఈ క్రింది ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది.

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 14న రైతాంగ-కార్మిక  మహా పంచాయతీ జరపాలని ఎస్‌కెఎం యిచ్చిన పిలుపుకు సిటియూలు సంపూర్ణ సంఘీభావాన్ని వ్యక్తం తెలియ చేస్తున్నాం.

యువ రైతు హత్యపై విచారణ జరపాలని సీటీయూలు, ఎస్‌కెఎం డిమాండ్ చేస్తున్నాం.

‘కేంద్రంలో కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, దేశ వ్యతిరేక పాలనను పడగొట్టండి’ అనే నినాదం దేశంలోని అన్ని మూలలకు చేరుకున్నందుకు, పారిశ్రామిక/రంగ సమ్మె, గ్రామీణ భారత్ బంద్‌తో పాటు ఫిబ్రవరి 16న సంయుక్త్ కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగ సమాఖ్యలు/ సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్తంగా పిలుపునిచ్చిన దేశవ్యాప్త సామూహిక సమ్మెను విజయవంతం చేసినందుకు సంతృప్తి కలిగింది.

సమాజంలోని ఇతర సెక్షన్లు, సంస్థలు, సామాజిక ఉద్యమాలు తమ సంఘీభావ మద్దతును తెలిపినందుకు, వివిధ ప్రదేశాలలో సామూహిక సమీకరణలలో పాల్గొన్నందుకు వారు కృతజ్ఞత తెలియచేస్తున్నాం.

పంజాబ్ లోని శంబు, ఖనౌరి సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై హర్యానా, కేంద్ర బలగాలు చేసిన క్రూరమైన చర్యలను, శుభకరణ్ సింగ్ ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఖంస్తున్నాం.

ఈ బలగాలు సమాఖ్య నిర్మాణాన్ని, రాష్ట్ర ప్రభుత్వాల సార్వభౌమ హక్కులను ఉల్లంఘించి, పంజాబ్ భూభాగంలో అణచివేత చర్యలను చేపట్టడం అత్యంత విచారకరం. తమ నిజమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న ఆహారాన్ని ఉత్పత్తి చేసే అన్నదాతపై డ్రోన్ల వినియోగం అత్యంత క్రూరమైనది.

అంతేకాదు, బలగాలు పంజాబ్ సరిహద్దు లోపలికి వెళ్లి 50 కి పైగా ట్రాక్టర్లు, రైతుల వాహనాలను దెబ్బతీశాయి. యథేచ్ఛగా ప్రజలను ఎత్తుకెళ్తున్నాయి.

యువ రైతు హత్య కేసు విచారణ జరపాలని, ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, దోషులకు కఠిన శిక్ష విధించాలని, రైతులకు ట్రాక్టర్లు, వాహనాలకు జరిగిన భారీ నష్టానికి పరిహారం చెల్లించాలని సీటీయూలు, ఎస్‌కెఎం లు డిమాండ్ చేస్తున్నాం.

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 14న తమ డిమాండ్లపై మహా పంచాయతీ నిర్వహించాలని ఎస్‌కెఎం పిలుపునిచ్చిన కార్యక్రమానికి సిటియూలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి.

2023 ఆగస్టు 24 న ఢిల్లీలోని టాల్కటోర స్టేడియంలో జరిగిన కార్మిక, రైతాంగ సంయుక్త అఖిల భారత సదస్సులో సాధించిన కార్మిక, రైతాంగ చారిత్రాత్మక ఐక్యతను ముందుకు తీసుకెళ్లడానికి సిటియులు, ఎస్‌కెఎం రాష్ట్ర విభాగాలు వివిధ స్థాయిలలో రాష్ట్రాలలో సమన్వయం కొనసాగిస్తాయి.

మున్ముందు దేశాన్ని కాపాడటానికి, ప్రజలను కాపాడటానికి, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, దేశ వ్యతిరేక పాలనను కూలదొయ్యండి

Leave a Reply