ఈ మౌన సందర్భానికి
దీపాన్నైతే ఆర్పేశారు గానీ ఈ ఉదయ కాంతిలో మెరుస్తున్ననీ మృత్యుంజయ మందహాసాన్నిలొంగ తీసేవారెవరు?అండాసెల్ చీకట్లో చావును నిరాకరించిన నీ మొండి గుండె చప్పుడునీ పదాలకూ వాక్యాలకూ మధ్యన మరింత దృఢంగా మేల్కొన్నదితరగతిలో "అరణ్యకాండ"బోధిస్తున్న వేళ గొంతులో ప్రవేశిస్తావునా రక్తనాళాల వ్యాకోచంలోనాగరికతా విధ్వంసాల ఆర్తనాదంగా..ఆదివాసి గూడాల ప్రవాహ దుఃఖంలాధ్వనించి,అక్కరలేని శాంతిని భగ్నం చేస్తావుతల్లికీ బిడ్డకూ మధ్యన ఫైబర్ గాజు కిటికీలా....భార్యనూ భర్తనూ మరింత మరింతగా భేదించే ములాఖత్ మౌనంలా...సహస్ర రూపాల అధికార క్రౌర్యoనీ బిగిపిడికిట్లో శిరస్సురాలి ఓడింది...ఔను...రక్తం ఒలుకుతున్న కాలం గుండాసమాజం నడుస్తోంది...మన ప్రియమైన దేశాన్ని గత్తరలా పట్టుకున్న ఈ మౌన సందర్భానికి నువ్వవసరం.