కవిత్వం

విజయ చిహ్నాలు

★Victory Signs★By Moumitha Alam-west Bengal.【A poem on Manipuri Kuki tribal women who have been Paraded Naked & raped 】★విజయ చిహ్నాలు★తెలుగు అనుసృజన-గీతాంజలి ఓ..నా ప్రియమైన కుకీ తల్లులారా., మన భారత దేశంలో.. మన శరీరాలే యుధ్ధక్షేత్రాలు కాదంటారా ? పురుషులు నీళ్ల సీసాలు దొరక్క..వాటి కోసం కొట్లాడు తున్నప్పుడు కూడా.. *నీ యమ్మ..నీ తల్లిని..నీ చెల్లిని దెన్●● అనే యుగాల నుంచీ అలవాటైన బూతులతో మొదట మన తల్లులనే శపిస్తారు ! మన బట్టలు తొలగించబడతాయి.. మన మీద కిరాతకంగా లైంగిక అత్యాచారం జరుగుతుంది. క్రూరమైన జంతువుల గాయాలతో మన దేహాలు
కవిత్వం

మందరపు హైమావతి రెండు కవితలు

1 గెలుపు గుర్రాలం ఇక వెనకడుగులన్నీ ముందడుగులే కుంటి గుర్రాలన్నీ పరిగెత్తే పారశీక జవనాశ్వాలే పాత చరిత్రలు పాత కథలన్నీ పాదమట్టం బండరాళ్లకు రెక్కలు మొలిచిన అద్భుతం అటు అగ్రకులాల ఆధిపత్య భావనల పావురాలనెగరయ్యలేక కింది కులాల ధిక్కారస్వరంతో గొంతు కలపలేక ఆత్మన్యూనతాభావంతో ముడుచుకుపోయే అత్తిపత్తులం స్వేచ్ఛ సీతాకోకచిలుక రెక్కలు విరిచి కాళ్లకు బదులు మనసుకు సంకెళ్లు వేసి అమానవీయ అంటరానితనం కొరడా దెబ్బలు వెలివాడల బహిష్కరణల బహుమతులు మాత్రమే తక్కువ తరతరాలుగా చాకలోళ్లు మంగలోళ్లు కుమ్మరోళ్లు కంసాలోళ్ళు అంటూ మా మనసు పుస్తకాలపై చెరగని అవహేళనల రాతలు 'పిల్లలకు పట్టింపులేమిట' ని వసారాలోవడ్డించి ఎంగిలాకులు ఎత్తించిన కటిక
కవిత్వం

అవిశ్రాంత యోధుడు

ప్రపంచాన్ని క్షుణ్ణంగా చూసిన వాడు బహు ధ్రువ ప్రపంచాన్ని వర్ణించిన వాడు వైరుధ్యాలను పసిగట్టి ఇంటర్ రిలేషన్ షిప్ కు దారులు వేసిన వాడు అవిశ్రాంత యోధుడు మాతృభూమి రక్షణకు నిలిచిన వాడు గుండె నిశబ్దాన్ని హేళన చేసిన వాడు కాలం వీరులకే సలాం చేస్తూందన్నాడు ఓ మహాకవి అది నీవే కదా మిత్రమా నీవే కదా నేటి వీరుడవు.
సమీక్షలు

ఆకాశ మార్గాన్ని గురి చూస్తున్నవిల్లంబులు

కొండల మీద, గుట్టల మీద, నదుల పక్కన జీవించే దండకారణ్య ఆదివాసులు ఎప్పుడైనా ఇలాంటి పోరాటం చేయాల్సి వస్తుందని కలగని ఉంటారా?  ప్రకృతి పరివ్యాప్త సాంస్కృతిక జగత్తులో ఓలలాడే ఆదివాసులు ఆకాశ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకొని ఉంటారా? ఊహా తీరాల వెంట గొప్ప కాల్పనిక భావావేశంతో కళల ఊటను ప్రవహింపచేసే ఆదివాసులు ఇలాంటి ప్రతి వ్యూహ రచన ఎన్నడైనా చేసి ఉంటారా? వందల వేళ ఏళ్ల నుంచి రాజ్య ధిక్కారమే జీవన విధానంగా సాగిన ఆదివాసులు ఆకాశ మార్గాన యుద్ధం చేసే రాజ్యం ఒకటి  తమ మీద ఇలా విరుచుకపడి బాంబుల దాడి చేస్తుందని తలపోసి ఉంటారా?
వ్యాసాలు

మహిళా సాహిత్య చరిత్రలో శోభారాణి

జీవితంలో తాను ఒక్కతే శిఖరంలా ఎదగడం కాదు, ఒక అరణ్యంలా మనుషుల మధ్య స్వచ్ఛమైన ఉపిరి కోసం విస్తరించాలని భావించిన  మనస్తత్వం డా.కందాల శోభారాణిది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలోని కందాల అనసూర్య, రామచంద్రయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. మధ్యతరగతి శ్రామిక జీవితంలోని కష్టాలను, కన్నీళ్లను పక్కకు నెట్టేసి విద్యపై ఆసక్తితో ముందుకు సాగింది. బాల్యం నుండే మూఢవిశ్వాసాలను వ్యతిరేకించేది. స్వతంత్రమైన భావాలతో ఇతరులకు భిన్నంగా ఆలోచించడం ఆమె ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పిడిఎస్‌యు మాజీ అధ్యక్షుడు తాటిపాముల రమేష్‌ను ఆగస్టు 9, 2002న ఆదర్శ వివాహం చేసుకొన్నారు. ఇక్కడి నుంచే ఆమె జీవితం
కవిత్వం

పల్లె పిలుస్తోంది…!

చిగురుటాకుల్లో వెన్నెల చూపుల్లో తడిసి లేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూ ముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానే చిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కా ఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలు పిల్లలు పల్లె కు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలో జీడి చెట్ల కొమ్మల్లో అడుగులు వడివడిగా మురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకుని మంచు బిందువుల్ని పూసుకుని ఎగిరే పక్షుల వెంట ఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకుని నా పల్లె లో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్ని వెలిగించుకుని
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు

1 కమ్మటి దాల్చా తెలంగాణమా! నా ప్రాణమా!! ఒక గుడి ఒక మసీదు ఒక చర్చి నడిచి వెళ్ళే ఇంటింటికి ఇనుప గోడలల్లుతున్న సాలీలు తిరుగుతున్నాయి గడపలకు విద్వేష బొట్లు పెడుతున్నాయి దుఃఖం మీద దునుకు లాడుతూ దూర దూరాలు పంపిణీ చేస్తున్నాయి వాటి అడుగుల్లో మంటలు లేస్తుంటాయి వాటి మాటల్లో మృత్యు వాసనొస్తుంది నా ప్రియతమా! మూసి ప్రవహిస్తున్న గుండెల్లో మానవతా పరిమళాల మాగానివి గోదావరై ప్రేమలు ప్రవహించే దానా! మనసులు కలిసిన చేతుల మీంచి ఇనుప నాడలతో నడిచిపోతున్నాయి పంట కావలి మంచై చార్మినార్ కమ్మటి దాల్చా జుర్రుకునే మతాతీత మనసులు అలాయి బలాయి ఆత్మీయతలు
కవిత్వం

పూల కాంతి

దేహమంతా సూదిపోట్ల సలపరం పాదాలు ఏనుగేదో తొక్కిపెట్టినట్లు లోలోపల కరకరమమంటూ బాధ తనువంతా రెండు ముక్కలయినట్లుగా భారంగా వేలాడుతుంది కను రెప్పలనెవరో పిన్నులతో ఎక్కుపెట్టినట్లు నిదుర ఎక్కడికో తనను మరచి పారిపోయినట్లుంది రక్తాన్ని తోడుతున్నదెందుకో ఎన్ని పరీక్షలు చేసినా చివరాఖరికి ఏదీ కొత్తగా చెప్పారో తెలియని అయోమయం చికిత్స తెలిసినట్లే వున్నా దేహమెందుకో మొరాయిస్తుంది ఈ తెలవారని రాత్రి మరో ఉదయాన్ని మాత్రమే హామీనివ్వగలుగుతోంది పున్నమి వెన్నెల రాజి గూడులా తన కంటి చుట్టూ వలయాలు అయినా తను పగలబడి నవ్వినప్పుడు అడవి చుట్టూ వెలుతురు పూల కాంతి!!! (కామ్రేడ్ సహోదరికి ప్రేమతో)
ఇంటర్వ్యూ సంభాషణ

ప్రజల్లోకి వెళ్లి రాసాను

(ప్రముఖ సాహిత్య, జీవిత చరిత్రల పరిశోధకుడు డా. కె ముత్యం *శ్రీకాకుళ విప్లవోద్యమం - తెలుగు సాహిత్యంపై ప్రభావం* అనే అంశంపై 1984 - 90 మధ్య పరిశోధన చేశారు. ఆ సందర్భంగా ఆయన శ్రీకాకుళ విప్లవోద్యమంతో, ఆ  సాహిత్యంతో  పరిచయం ఉన్న అనేక మందిని కలిశారు. వారి అభిప్రాయాలు సేకరించారు. వాటిని ఇటీవల ముత్యం  వెలుగులోకి తెచ్చారు. ఎక్కడా అచ్చుకాని అభిప్రాయాలు ఇవి. ఇందులో ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ 9-3- 1987  కె ముత్యంతో పంచుకున్న అనుభవాలు పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) 1. శ్రీకాకుళం ప్రాంతమంతా మీరు కలెదిరిగారు
వ్యాసాలు

దండకారణ్య ఉల్‌గులాన్‌కు జేజేలు

ఉల్‌గులాన్‌ అంటే గోండీలో ప్రజా తిరుగుబాటు. ఇవాళ దండకారణ్యమంతా పోటెత్తిన ఉల్‌గులాన్‌. అణచివేత, నిర్బంధం తీవ్రమవుతున్న దశలో ప్రజా పోరాటాలు ఎట్లా ఉంటాయో  దండకారణ్యంలో చూడాల్సిందే. దేశమంతా పోరాట క్షేత్రంగా మారుతున్న తరుణంలో దాన్ని ఉన్నత రూపంలో ముందుకు తీసుకపోతున్నది దండకారణ్యం. బ్రిటిష్‌ వలసవాదులకు వ్యతిరేకంగా మనదేశంలో తొలుత పోరాట శంఖమూదినది లేదా విల్లంబులనెత్తినది,  తుపాకినెత్తినది అదివాసులేనని చరిత్ర నమోదు చేసింది. ఆ వీరసంప్రదాయాన్ని ఎరిగిన ‘‘రాజ్యాంగ నిర్మాతలు’’ భారత రాజ్యాంగంలో మూలవాసుల సంరక్షణ, వారి వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ఆర్టికల్స్‌ను రూపొందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌342లో మన దేశంలోని ఆదివాసులను గుర్తించడానికి కావలసిన ప్రక్రియను పేర్కొన్నారు. ఫలితమే