సంభాషణ

ప్రభాతభేరి

మమతలు కరిగి మానవత్వం మసకబారుతున్నప్పుడు మనుసును ఏదో చీకటి పురుగు కొరికిన బాధ.కనుల ముందటి మనుషులు ఉన్మాద ప్రతీకలుగా  మారుతున్నప్పుడు గుండె పుండవుతోంది.ఉక్కిరిబిక్కిరై ఊపిరి సలపదు.ఏటి ఊట చెలిమెలా గొంతుతడిపిన మనుషులూ బీటలువారిన ర్యాగడిలా బిర్రబిగిసి పోతున్న కాలం.భయం పురుగు కరిసి మాటలురాక మ్రన్పడినట్లనిపిస్తోంది.హరితవనం మధ్యనున్నా ఆకులురాలిన మోడులమధ్యున్నట్లనిపిస్తోంది.మనుషులు మాట్లాడుకుంటున్న మార్కెట్ సక్సెస్ మంత్రాలు కనపడని రేసులు తోడేళ్లు కొండ్రగాళ్ల ఊళ్లాలనిస్తున్నయ్. ఆకురాలిన కాలంలో మండుటెండలను ధిక్కరిస్తూ చిగురించే పూసుగుమానుల ఊసులినాలన్పిస్తోంది.వడగాడ్పులను వెక్కిస్తూ ఎదిగే ఇప్పవనాల లేతాకుల ఎరుపు చూడాలనిపిస్తోంది. పట్టపగలు మిట్టమధ్యాహ్నం నీరవ కమ్మిన నిషిని తలపిస్తున్నప్పుడూ జలపాతహోరునలుముకున్న  వెలుగువెన్నెల ఎంత అద్భుతం. భయం కమురువాసన మధ్య