మున్నా మున్నా మున్నా- నా

చిన్నారి పొన్నారి కన్నా

నాన్న ప్రేమకు నువ్వు వారధివి

నా కలల ప్రపంచం సారధివి

పృథ్వి అడిగే ప్రశ్న ఆకాశం

నడుమ అడివే తీర్చింద సందేహం ॥ము­న్నా॥

నీ తండ్రి భుజంపైన బందూకురా

నిన్నెత్తుకునే జాగ యాడుందిరా

నీలాగే సుట్టూత జనసేనరా

కొడుకైన జనంలో భాగమేరా

పొద్దంత మీ నాన్న సూర్యుడైతే

రాత్రంత ఎన్నెలై సెంట్రీగాస్తివా ॥ము­న్నా॥

నిన్ను పొమ్మంటు దీవించలేనైతిరా

నిన్ను వద్దంటు నేచెప్పలేనైతిరా

నువు మెచ్చినా వనమంత జ్ఞానమేరా

నీకిచ్చిన ఆస్తంత త్యాగమేరా

నిన్ను చుట్టు వ­ట్టిందో పద్మవ్యూహం

నువ్వభిమన్యుడైనావా ప్రజల కోసం   ॥ము­న్నా॥

పృథ్వంటు ఒక పేరు పెడితేనురా

పుడమి తల్లిగా నన్నైతే చేశావురా

ఎంత కడలైన అడివైన నీలోనరా

కొంత కాలానికి నేనైన అంతేనురా

సొంత ఊరేది నీదింక విశ్వమేరా

లోకమే మీ నాన్న ఊసుకదరా

ము­న్నా ము­న్నా ము­న్నా-  నా

చిన్నారి పొన్నారి కన్నా

నాన్న దారిలో నువ్వెళ్లి పోయావురా

నీ దరికే మీ నాన్న వచ్చాడురా

(కామ్రేడ్‌ ఆర్క్‌ జీవిత సహచరి శిరీష తన కొడుకు పృథ్వీ ఉదంతాన్ని, తండ్రి  అమరత్వాన్ని వివరిస్తూ పత్రికలకిచ్చిన ఇంటర్వ్యూను చూసి స్పందిస్తూ…. )

Leave a Reply