వ్యాసాలు

అజ్ఞాత అమర కథా రచయిత్రులు

(*వియ్యుక్క* అంటే గోండిలో వేగుచుక్క. తెలుగు అజ్ఞాత  విప్లవ కథా చరిత్రకు దారులు వేసిన రచయితలు ఎందరో. వాళ్లలో మహిళల పాత్ర గణనీయం. విప్లవంలో  సగానికి పైగా ఉన్న మహిళలు విప్లవోద్యమ చరిత్రలో, విప్లవోద్యమ కథా చరిత్రలో ప్రముఖంగా ఉండటం సహజమే. విస్తారమైన అజ్ఞాత కథా గమనానికి నిజంగానే వేగుచుక్కలవంటి రచయిత్రులు ఉన్నారు. వాళ్ళ సాహసోపేత, సృజనాత్మక, ఆదర్శప్రాయ ఆచరణా రచనా జీవితాన్ని సగౌరవంగా స్మరించుకోకుండా ఈ వియ్యుక్క సంకలనాలు ఎలా తీసుకరాగలం? అలాంటి తొమ్మిదిమంది అమర కథా రచయిత్రుల జీవిత, రచనా విశేషాలను ఈ పుస్తకాల చివర ప్రచురించాం. *వియ్యుక్క*  అందడానికంటే  ముందు వాళ్ళ వివరాలను వసంత మేఘం
వ్యాసాలు

 ప్రపంచ వర్గ పోరాట సాహిత్యానికి చేర్పు

విస్మరణ, వక్రీకరణలతోపాటు  విధ్వంసమై పోయిన   ఆదివాసుల, దళితుల, బహుజనుల, మహిళల వర్గ పోరాట చరిత్ర, సాహిత్యం సిపాయి తిరుగుబాటుతోనే  తిరిగి  వెలుగులోకి రావడం మొదలైంది .  యూరప్‌లో జరిగిన పారిశ్రామిక, ఫ్రెంచి విప్లవాలు, పారిస్‌ కమ్యూన్‌, రష్యా, చైనాల్లో జరిగిన ప్రజాస్వామిక, సోషలిస్టు విప్లవాలు ప్రపంచ  పీడిత ప్రజలను ప్రభావితం చేశాయి. 1967 నక్సల్బరి, శ్రీకాకుళం, ముషాహరి సాయుధ పోరాటాలు చైనా సాంస్కృతిక విప్లవం, గ్రేట్‌ డిబేట్‌ నేపథ్యంలో అర్ధవలస, అర్ధ భూస్వామిక పార్లమెంటరీ దగుల్బాజీ రాజకీయాలతో నలిగిపోయిన పీడితప్రజల ముందుకు విప్లవ శ్రేణులు వర్గపోరాటాన్ని  సాయుధ  రూపంలో బలంగా ముందుకు తెచ్చాయి. పదేండ్ల పోరాట అనుభవసారంతో 1977లో
వ్యాసాలు

సనాతనవాద సంకెళ్లు తెంచుకుందాం!

క్రీ.పూ. రెండు వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా నుండి పశుపాలక ఆర్యులు భారతదేశానికి మొదటిసారిగా వలస వచ్చారు.   ఆ తదనంతర పరిణామ క్రమంలో ఇక్కడ పితృస్వామ్యం ఉనికిలోకి వచ్చింది. మాతృస్వామ్యం లేదా మాతృప్రధాన సింధూ నాగరికత ఆర్యుల దాడులతో దెబ్బతిని వారి పితృస్వామ్యమే ఇక్కడ క్రమంగా వేళ్లూనుకుంది. అయితే ఆర్యుల దాడులకు దూరంగా కొండ కోనలలో ఉండిపోయిన ఆర్యేతర మూలవాసీ ప్రజలలో మాతృ ప్రధాన లక్షణాలు నేటికీ అవశేషాలుగానైనా మిగిలి ఉన్నాయి. 19 -20వ శతాబ్దాలలో మూలవాసులలోకి బ్రాహ్మణవాదం వేగంగా చొచ్చుకురావడం, మూలవాసీ ప్రజలను బలవంతంగా హైందవీకరించడం జరుగుతోంది. భారతదేశానికి ఆర్యుల వలసతో అంతకు పూర్వపు నాగరికత చరిత్ర
వ్యాసాలు

జతీన్ దా మన స్ఫూర్తి

మన దేశ స్వాతంత్ర్యం కోసం తమ అమూల్యమైన ప్రాణాలర్పించిన వేలాది సమరయోధులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ (జతీన్ దా) ఒకరు. ఆయన జైలులో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారులందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనీ అమరణ నిరహారదీక్షకు పూనుకొని 63 రోజుల తర్వాత అమరుడైనాడు. ఆయన సంస్మరణలో సెప్టెంబర్ 13ను రాజకీయ ఖైదీల హక్కుల పోరాట దినంగా పాటించడం మన దేశంలో ఒక పోరాట సంప్రదాయంగా నిలిచింది. ఎప్పటిలాగే ఈ యేడు కూడ రాజకీయ ఖైదీల హక్కుల దినం సెప్టెంబర్ 13నాడు దేశ వ్యాప్త జైళ్లలోని ఖైదీలు, విచారణలోని ఖైదీలు  సంకల్ప దినంగా పాటించాలనీ. బయట ప్రజలు కూడ
సమీక్షలు కొత్త పుస్తకం పరిచయం

విప్లవోద్యమ కథాసమయం

(*వియ్యుక్క*  పేరుతొ  అజ్ఞాత రచయిత్రుల కథలు ఆరు భాగాలుగా విరసం తీసుకొస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఇందులో మూడు  పుస్తకాలు విడుదల అయ్యాయి. వీటి ఆవిష్కరణ ఈ నెల 24 న హైదరాబాదులో ఉంది. ఈ సందర్భంగా తొలి మూడు భాగాలకు వియ్యుక్క ఎడిటర్ బి. అనురాధ రాసిన ముందుమాట పాఠకుల కోసం ...వసంత మేఘం టీం ) పెన్నూ గన్నూ పట్టిన రచయిత అనగానే మనకి మొట్టమొదట గుర్తుకొచ్చేది సుబ్బారావు పాణిగ్రాహి. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అందులోనూ ఒక చేత్తో గన్ను పట్టి పోరాటం చేస్తూ
వ్యాసాలు

స్త్రీల కథావికాసపు అత్యున్నత దశ *వియ్యుక్క*

తెలుగులో ఆధునిక కథకు ఆరంభం  1910 లో గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు అని చాలాకాలంగా అనుకొంటూ వచ్చాం. కానీ భిన్న సామాజిక సాహిత్య సాంస్కృతిక రంగాలలో చరిత్ర అంచులకు నెట్టివేయబడిన స్త్రీలను వెతికి కేంద్రంలోకి తీసుకువచ్చే పూనిక పెరిగిన క్రమంలో 1901 నాటికే కథలు వ్రాసిన భండారు అచ్చమాంబను తెలుసుకోగలిగాం. 1879 నుండి ఆధునిక స్వరూప స్వభావాలను సంతరించుకొంటూ తెలుగు కథ ప్రయాణం ప్రారంభం అయితే ఆ ప్రయాణంలో అడుగులు కలిపిన  తొలి మహిళ భండారు అచ్చమాంబ. స్త్రీల జీవిత చైతన్య వికాసాలకు కేంద్రమైన సంఘ సంస్కరణోద్యమ ఆశయ ప్రచార నిబద్ధత నుండి ఆమె కథలు వ్రాసింది.
కవిత్వం

మహమూద్ రెండు కవితలుమహమూద్

1 జీవనయానం నేను నీ పాటలు పాడుతుంటాను మశీదు ప్రాంగణంలో దినుసులు తినే పావురాల్లా వాళ్ళు గుమిగూడతారు జీవనసాగరపు లోతుని పాటలు వాళ్ళకి పరిచయం చేస్తాయి కటిక నేల మీదా బురద వాలులపై జీవన శకలాలని జారనిచ్చేవారు జారుతూ జారుతూ గాయపడడమే బతుకైన వారు ఎడారి ఎండ వేడి చురుకుని పాదాలపై మోసేవారు లోయల లోతుల్లోంచి కనబడని ఆకాశంకై భూఉపరితలాన్ని తాకే కలలు కనేవారు సాగించాల్సిన ప్రయాణ భారాన్ని లెక్కించుకుంటారు పాటల గూడార్థం అర్థమైన తర్వాత వాళ్ళు సీతాకోకచిలుకల్లా మారిపోతారు మనోభారం దిగిపోవడం కంటే గొప్పదేమీందీ లోకాన! అన్ని బలహీనతల బరువులను దించుకొని పావన హృదయంతో వాళ్ళు ప్రపంచంలోకి
కవిత్వం

ఉదయ్ కిరణ్ నాలుగు కవితలు

1 మల్లయోధులం నాడు మా బలమైన భుజాలపై ఈ దేశ మూడు రంగుల జెండాను గర్వంగా ఒలంపిక్స్ నుంచి ఢిల్లీ నడి వీధుల్లోకి మోసినప్పుడు మీ పొగడ్తలకు పొంగిపోయి మేము గెలిచిన పతకాలను చూసినప్పుడు మేము ఈ దేశంలో భారతమాతలమైనాము నేడు మాపై జరుగుతున్న లైంగిక దాడులపై న్యాయపోరాటం చేస్తుంటే మీలో రవ్వంతైనా చలనం కలగకపోవడం కాషాయ నీడలు ఎంతలా కమ్ముకున్నాయో, రాజకీయ మతోన్మాదం కాళ్ళ కింద నలుగుతున్న మీరే సాక్ష్యం పార్లమెంటు ముందు పోలీసులు మమ్మల్ని హింసాత్మకంగా ఈడ్చుకెళ్ళి జైల్లో బంధిస్తుంటే ఈ దేశ రక్షణ, గౌరవం ఎప్పుడో బంధించబడ్డాయని మాలో ధైర్యం నిప్పంత నిబ్బరాన్ని రగుల్చుకుంది
కవిత్వం

అడవి దేవత

ఆమాస రేయి అడవిలో నెత్తుటివాన కురుస్తున్న వేళ .. ఆమె .. తెగినపేగుల్ని ముడేసుకొనీ జల్లెళ్లయిన ఒరిగిన వీరుల దేహాల్లోంచి చిమ్ముతున్న నెత్తుటిదారను కడవలకెత్తుకొనీ .. వాగులో కలుపుతోంది ! వాగు .. ఎరుపెక్కిన ఆకాశంలా .. ! ఆమె .. రాలిపోయిన పొద్దులకు చీకటివాగులో చితిమంటల స్నానం జేసీ ఆరిపోయిన చితిని చేటకెత్తి విత్తులు వెదజల్లినట్టు పిడికిళ్లతో కాటిబుగ్గిని పొల్లాల్లో వెదజల్లుతోంది ! పోడు .. పోరువంతమైన ఆకుబట్టలా .. ! 'ఎవరమ్మా వీళ్లంతా ..' దగ్ధకంఠంతో ఆమెనడిగాను దుఃఖపుదారిలో ..! 'యీ దేశపు నుదుటాకాశం మీంచి రాలిపోయిన కుంకుమ పొద్ధులు .. పేగుతెగిన తల్లుల కడుపుకోతలు
కవిత్వం

కొన్ని ప్రశ్నలు

ఇనుపగోళాల్లోకి ఇముడుతున్న మానవ సమూహాలు. నీళ్ల పొదుగుల్లో దాహం తీరక ఉక్కిరిబిక్కిరవుతున్న దిక్కులేని కాలం. నిరంతరంగా సాగుతున్న పరిణామంలోకి ఇముడుతున్న దృశ్యాలు. విరిగిపోతున్న అనుభవాల సమూహం. ఇక్కడ మనిషిని తూర్పారబడుతున్నదెవరు? ఈ మనిషి సారంలోంచి విత్తనాల్ని, పొల్లుని వేరుచేస్తూ పొల్లుగానే మిగిల్చే ఈ పెనుగాలు లెక్కడివి? ఉసిళ్ళగుంపులా కదులుతున్న ఈ సమూహాల మధ్య మసిబారుతున్న జీవన కాంతుల మధ్య తుఫానుల విరుచుకుపడుతున్న ఈ ప్రశ్నలెక్కడివి? ఇక్కడ కాగితప్పూల పరిమళాల్ని సృష్టిస్తున్న సృష్టికర్తలెవరు? 1 సందేహాల మధ్య, చావుబతుకుల మధ్య, సర్ప పరిష్వంగాల నడుమ కరుగుతున్న జీవితాలు. ప్లాస్టిక్ సన్నివేశాల సమాధానాలు. 2 దూరం దూరం మనిషికీ మనిషికీ మధ్య