ఆమాస రేయి
అడవిలో నెత్తుటివాన కురుస్తున్న వేళ ..

ఆమె ..
తెగినపేగుల్ని ముడేసుకొనీ
జల్లెళ్లయిన ఒరిగిన వీరుల  దేహాల్లోంచి
చిమ్ముతున్న నెత్తుటిదారను 
కడవలకెత్తుకొనీ .. వాగులో కలుపుతోంది !

వాగు .. 
ఎరుపెక్కిన ఆకాశంలా .. !

ఆమె .. 
రాలిపోయిన పొద్దులకు 
చీకటివాగులో చితిమంటల స్నానం జేసీ 
ఆరిపోయిన చితిని చేటకెత్తి
విత్తులు వెదజల్లినట్టు
పిడికిళ్లతో కాటిబుగ్గిని పొల్లాల్లో వెదజల్లుతోంది !

పోడు .. 
పోరువంతమైన  ఆకుబట్టలా  .. !

'ఎవరమ్మా వీళ్లంతా ..' 
దగ్ధకంఠంతో ఆమెనడిగాను దుఃఖపుదారిలో ..!

'యీ దేశపు నుదుటాకాశం మీంచి
రాలిపోయిన కుంకుమ పొద్ధులు  ..
పేగుతెగిన తల్లుల కడుపుకోతలు ' అందామె 
ఓ శోకదేవతలా నడచిపోతూ ..!!

Leave a Reply