సమీక్షలు

కొత్త ఒరవడి

(ఇది 2015 జనవరిలో విరసం ప్రచురించిన *సామాన్యుల సాహసం * అనే కథా సంకలనానికి రాసిన ముందు మాట.  మైనా , నిత్య, సుజాత రాసిన కథల సంకలనం ఇది. వీళ్ళు భారత  విప్లవోద్యమంలో సీనియర్ నాయకులు.  అజ్ఞాత కథలో కొత్త ఒరవడి తీసుకొచ్చిన తొలి వరుస రచయిత్రులు.  సామాన్య ప్రజలే  చరిత్రను నిర్మించగల సాహసికులుగా, సృజనశీలురుగా, మహాద్భుత శక్తిగా  వర్గపోరాటం లో  తయారవుతారని విప్లవోద్యమమం నిరూపించింది. ఆ మానవ పరిణామాన్ని ఈ కథలు చిత్రిక పట్టాయి. నలభై ఏళ్ళ అజ్ఞాత రచయిత్రుల కథలు *వియ్యుక్క* గా వెలువడుతున్న ఈ సాహిత్య సాంస్కృతిక వర్గపోరాట చారిత్రిక సందర్భాన్ని అర్థం
వ్యాసాలు

 ప్రపంచ వర్గ పోరాట సాహిత్యానికి చేర్పు

విస్మరణ, వక్రీకరణలతోపాటు  విధ్వంసమై పోయిన   ఆదివాసుల, దళితుల, బహుజనుల, మహిళల వర్గ పోరాట చరిత్ర, సాహిత్యం సిపాయి తిరుగుబాటుతోనే  తిరిగి  వెలుగులోకి రావడం మొదలైంది .  యూరప్‌లో జరిగిన పారిశ్రామిక, ఫ్రెంచి విప్లవాలు, పారిస్‌ కమ్యూన్‌, రష్యా, చైనాల్లో జరిగిన ప్రజాస్వామిక, సోషలిస్టు విప్లవాలు ప్రపంచ  పీడిత ప్రజలను ప్రభావితం చేశాయి. 1967 నక్సల్బరి, శ్రీకాకుళం, ముషాహరి సాయుధ పోరాటాలు చైనా సాంస్కృతిక విప్లవం, గ్రేట్‌ డిబేట్‌ నేపథ్యంలో అర్ధవలస, అర్ధ భూస్వామిక పార్లమెంటరీ దగుల్బాజీ రాజకీయాలతో నలిగిపోయిన పీడితప్రజల ముందుకు విప్లవ శ్రేణులు వర్గపోరాటాన్ని  సాయుధ  రూపంలో బలంగా ముందుకు తెచ్చాయి. పదేండ్ల పోరాట అనుభవసారంతో 1977లో
సమీక్షలు

క‌థ‌ల సేద్యం

శ్రీనివాస మూర్తి ‘ఖబర్‌కె సాత్‌’ పదిహేను కథలు చ‌ద‌వ‌డ‌మంటే రాయలసీమ ముప్పై సంవత్సరాల రాజకీయార్థిక పోరాటాల భావోద్వేగాలతో మిళితం కావ‌డ‌మే. 1978 నుండి మా వూరంత ప్రేమగా ` రాయలసీమతో నాకు అనుబంధం ఉంది. మధురాంతకం రాజారాం, నరేంద్ర, మహేంద్ర, పిసి నర్సింహారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వడ్డెర చండీదాస్‌, సింగంనేని నారాయణ, శేషయ్య, శశికళ, బండి నారాయణస్వామి, నాగేశ్వ‌రాచారి,  శాంతినారాయ‌ణ‌, దేవపుత్ర, కేశవరెడ్డి, నామిని, రాసాని, సడ్లపల్లి చిదంబర రెడ్డి, పాణి, వరలక్ష్మి, వెంక‌ట‌కృష్ణ‌, సుభాషిణి, రామ‌కృష్ణ‌, రాప్తాడు గోపాలకృష్ణ, చక్రవేణు, సౌదా,  త్రిపురనేని శ్రీనివాస్‌, విష్ణు వంటి ఆత్మీయులంద‌రితో క‌లిసి తిరిగిన రోజుల‌వి.    విద్యార్థి ఉద్యమాలు,