వ్యాసాలు

ప్రజల ఊసులేని కొత్త చట్టాలు

20 జులై 2023 నుండి వర్తమాన లోకసభ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాలలో అటవీ సంరక్షణ చట్టం, 1980కి గత సంవత్సరం 2022 జూన్‌ 28 నాడు ఆర్దినెన్స్‌ రూపంలో రూపొందించిన అటవీ నియమాలకు చట్ట రూపం ఇవ్వడానికి ఆ బిల్లును మొదట లోకసభలో ప్రవేశపెట్టారు. ఆ  తరువాత  ఆగస్టు 2నాడు రాజ్యసభలో ఆమోదం పొందడంతో చట్టం ఉనికిలోకి వచ్చింది. చట్టం పూర్వాపరాలు: మన దేశంలో బ్రిటిష్‌ వారి హయాంలో రూపొందిన అటవీ సంరక్షణ చట్టం 1927ను ఆధారం చేసుకొని అధికార మార్పిడి తరువాత అటవీ సంరక్షణ చట్టం, 1980 ఉనికిలోకి వచ్చింది. ఆ చట్టం అడవులను రెండు