సాహిత్యం కవిత్వం

అతడు రేపటి పొద్దు

మరణం మౌనం కాదునిశ్శబ్దన్ని బద్ధలుకొట్టడమే.ఆశయం కోసం నడిచి అలసిపోలేదు,ఆరిపోలేదు.అడుగుల చప్పుడు ఆశయం కోసం వినబడుతూ వున్నాయి. చెదలు పట్టిన సమాజం నుచర్చలతో ఛేదించలేమన్నారువిఫలం అయితేవిప్లవమే అన్నాడు.యుద్ధంకోసంమాటీచ్చి మరిచిపోలేదు.వాగ్దానంగనిలబడ్డాడు. మృత్యువు ముచ్చట పెట్టినచివరిరక్తం బొట్టుచిందించిండు.మాయదారి రోగంమందలించినపోరుదారికి మరణంలేదన్నడు. చిగురించిన వసంతములోమేఘమై కురుస్తానని.రేపటి పొద్దుకుమాటిచ్చిన వీరుడతడు. 15-10-2021
సాహిత్యం కవిత్వం

రగల్ జెండను భుజానికెత్తి జోహార్లందాం..!!

ఇది యుద్ధంఅనుకున్నాక..గెలుపొక్కటేలక్షమనుకున్నాక.. నువ్వూ నేనూఅతడూ ఆమెప్రజా యుద్ధానికిమారు పేరులం కదా.. జన సంగ్రామానికిజవసత్వాలౌతూజననమే కానీఎవరికైనా మరణమెక్కడిదీ.. అడవినీ మైదాల్నీకన్నీటి సంద్రాల్నీఅలుపెరుగని అమ్మవడైఆలింగనం చేసుకున్నవాడు అయిన వాళ్ళందరినీకష్టజీవి కన్నీళ్ళలోఆ బతుకు గాయాల్లోదర్శించుకున్న దార్శికుడతడు.. ఏవూరూ ఏవాడాఎవరి బిడ్డాఏవొక్కరి స్వప్నమదీఅతడికి మరణమెక్కడిదీ.. అతడి సహచర్యంలోఆయుధమూ అక్షరాలు దిద్దిచెరచబడ్డ చెల్లెళ్ళపిడికిళ్ళై విరబూయాలనిపరితపించింది.. పారే చెలిమతరాల దూపతో అల్లాడేఆదివాసీ గొంతు తడిపేకర్తవ్యాన్ని కళ్ళకద్దుకున్నది.. ఆ చెట్టూ ఈ పుట్టావాగూ వంకా పూవూ పిందేసెంట్రీ గాసిన తీతువూదాపుగాసిన గుబురు పొదలూ దుఖ్ఖ నదుల నదిమిపట్టితలలు వొంచి భుజముకెత్తివీరుడా నువ్వమరుడన్నయ్నీబాటలోనే మా అడుగులన్నయ్ కన్నీటి జ్ఞాపకాలు తొలుచుకొచ్చేబాధా బాసా మసిలే నెత్తురూ సరేదారి పొడవునా ఒలికిన త్యాగాలేచరిత్ర
సాహిత్యం కవిత్వం

*రెవల్యూషనరీ స్ప్రింగ్*

ఏవో ఏవేవోమరుపురానిగురుతులతోకరచాలనం చేసేసనివేశాలుసందేశాలు,పూర్తిగాఆయుధంతోసాయుధమైనఓ స్వాప్నికుడిఓ ప్రేమికుడిఆలోచనతోఆశయంతోరక్తం చిందించేఆ పాదాల నడకలుఈ దేశానికిదేహాన్ని అర్పించేఆజాదిని అందించేసాహసాలుఅహామీరు ఏంతటి ప్రేమికులుఅచంగా మా భగత్ లామీరు ఎంతటి సాహసీయులు
లోచూపు కాలమ్స్

కులం, జెండర్ లను ఇలా చూద్దాం

కులం గురించి దళితవాదం చర్చిస్తుందని, జెండర్ గురించి స్త్రీవాదం చర్చిస్తుందని, ఒక్కో అస్తిత్వ సమస్యను ఆ నిర్దిష్ట అస్తిత్వవాదమే చర్చిస్తుందని, లేదా పరిష్కరిస్తుందనే  అస్తిత్వ వాదాల భావజాల వాతావరణం నెలకొని ఉన్న ఈనాటి సందర్భంలో ‘’స్త్రీవాద దృక్కోణంలో జెండర్, కులం’’ అనే ఈ పుస్తకం రావడం ఎంతో ఆహ్వానించదగింది. మన అంతరాలవారీ  సామాజిక వ్యవస్థలో జెండర్, కులం అనేవి విడివిడిగా కనబడుతున్నప్పటికీ, వాటి మధ్య నున్న సంబంధాలను లోతుగానే కాకుండా శాస్త్రీయంగా విశ్లేషించిందీ పుస్తకం. సుదీర్ఘ  పరిణామ క్రమంలో ఆ రెండింటి సాన్నిహిత్యం కారణంగా ఏర్పడిన వాటి  ఉమ్మడి చరిత్ర క్రమాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని రచయిత్రి
ఇంటర్వ్యూ సాహిత్యం సంభాషణ

బాధిత స‌మూహాల విముక్తే క‌థ ల‌క్ష్యం కావాలి

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1.కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? కథ ఒక జీవన
కవి నడిచిన దారి కాలమ్స్

ఇది ప్ర‌యాణం..

చదువేలేని తరంలోంచి వచ్చాను. మా జేజబ్బ ఏటవతల తాండ్రపాడు. నాన్నకు చదువు లేదు. అప్పట్లో  పిలిచి కోర్టులో తోటమాలి పని ఇచ్చారు. ఆ తరువాత బిల్లజవానుగా ఉద్యోగంలో స్థిరపడ్డారు. నాకు చదువు మీదకన్నా సినిమాలు కథలమీద మోజు . అందుకే చదువు అబ్బలేదు.  కర్నూలు లో పుట్టాను.  అది 1990 కవిత్వజ్వరం బాగా పట్టుకున్న కాలం. నాకు కవులంటే పిచ్చి మోహం. వాళ్ళ ఫోటోలు తెల్లపుస్తకం లో అతికించి, ఫోటోలకింద వారి చిరునామాను, ప్రచురితమైన కవిత్వం సంకలనాల్ని రాసి దాచుకునే వాణ్ణి. ఇప్పటికీ ఆపుస్తకం ఉంది.  ఆశారాజు రాసిన రెండవపుస్తకం 'దిశ ' నాకు రంగుల సీతాకోకలా అనిపించింది.
ఇంటర్వ్యూ సాహిత్యం సంభాషణ

వ‌ర్త‌మాన క‌థా ప్రయాణం బహుముఖీనం

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? అవును. కథా
ఆర్ధికం కాలమ్స్

శ‌ర‌వేగంగా పెరుగుతున్న అస‌మాన‌త‌లు

బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల నుంచి భారత పాలకవర్గాలైనా దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు అధికార మార్పిడి జరిగి 75 ఏండ్లు కావస్తోంది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ అని ఘనంగా పాలకవర్గాలు చెబుతున్నాయి. అయినా ఈ దేశ ప్రజలు కనీసం కడుపు నిండా తిండిలేక, ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి సరిపోయే బట్టలేక, సరైనా వైద్యం అందక, నాణ్యమైన విద్య లేక కోట్లాదిమంది సతమతమవుతున్నారు. నోరున్నా న్యాయం కావాలని అడగలేని అభాగ్యులు కోటాను కోట్లు ఉన్నారు. దీనికి కారణం మన పాలకుల అప్రజాస్వామిక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, ఫాసిస్టు అణచివేత ధోరణులు అని స్పష్టమవుతోంది. అన్ని
సంపాదకీయం

విప్లవంలో శాంతి నిర్వచనం

ఆర్‌కె మరణానంతర జీవితాన్ని ఆరంభించాడు.  రెండు రోజులుగా ఆయన కోసం సమాజం దు:ఖిస్తున్నది. ఆయన్ను తలపోసుకుంటున్నది. ఆయనలాంటి వీరోచిత విప్లవకారులెందరినో ఆయనలో పోల్చుకుంటున్నది. ఉద్విగ్న విషాదాలతో తల్లడిల్లుతున్నది. ఆయనతో, ఆయన నిర్మించిన విప్లవోద్యమంతో రక్తమాంసాల, మేధో సంబంధం ఉన్నవాళ్ల దగ్గరి నుంచి, ఆయన రాజకీయాలతో ఏకీభావం లేని వాళ్ల దాకా అందరూ కన్నీరు కార్చుతున్నారు.   అది కేవలం ఒక మరణానికి సాటి మనుషుల ప్రతిస్పందన  కాదు. అదీ ఉంటుంది. అది అత్యంత మానవీయమైనది. నాగరికమైనది. దానితోపాటు ఆర్‌కెను ఒక వ్యక్తిగాకాక భారత విప్లవోద్యమానికి ప్రతీకగా భావించారు. విప్లవంలో రూపొందిన ఆయన మూర్తిమత్వం విప్లవానికి నిదర్శనమని అనుకున్నారు. అందుకే ఈ