జీతన్ మరాండీకి జోహార్లు
ఉరికొయ్యలను దాదాపుగా తాకిన సాంస్కృతిక విప్లవ గొంతుక, జార్ఖండ్ అభేన్ నాయకుడు జీతన్ మరాండీకి జోహార్లు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్న పాటపై సుదీర్ఘ కాలం సాగిన వేట మరాండీని మానసికంగా బలహీనపరచలేకపోయింది. కానీ, ఆయన ఆరోగ్యాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. ఓ తప్పుడు హత్య కేసు నుంచి 2013లో మరాండీ బయటపడ్డారు. అరెస్టు సమయంలో చేసిన ఇంటరాగేషన్‌లో పోలీసు అధికారులు చూపించిన నరకం వల్ల జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వేధించాయి. ఈ నెల 12వ తేదీన బాగా జబ్బుపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్య చికిత్స అందిస్తుండగానే 13న జీతన్