పంజరంతో పక్షి యుద్ధం
ఆఫ్ఘాన్ మహిళా కవిత్వం "అందరూ నిన్ను తమ దానిగా చెప్పు కుంటారు..కాని, నేను నిన్ను నిన్ను గానే చూస్తాను. " Jalaluddin Rumi balki. (రూమి ) ఆప్ఘాన్ లు అన్ని సాహిత్య ప్రక్రియ ల కన్నా కవిత్వానికి పెద్ద పీట వేస్తారు..తాము భావాల్ని కేవలం కవిత్వం ద్వారా మాత్రమే చెప్పగలమన్నది వాళ్ళ విశ్వాసం.. అక్కడ కవులు, కవయిత్రులు కవిత్వాన్ని బైటికి చదవడానికే ఇష్ట పడ్తారు(recitation)...ఆప్ఘాన్లు సాధారణంగా కవిత్వాన్ని పర్షియన్(దారి), ఫస్తో భాషల్లో రాస్తారు..వాళ్ళు ఎక్కువగా "లాండై"(ద్విపద)పద్ధతిలో రాస్తుంటారు. పదమూడవ శతాబ్దంలో జన్మించిన సూఫీ కవి,జలాలుద్దీన్ రూమి బల్కీ ని వాళ్లు ఆదికవి గా భావిస్తారు.ఆయన కవిత్వంలో ఆధ్యాత్మికత