బుల్డోజర్ కేమి తెలుసు
తాము ఎవరిల్లు కూలుస్తున్నామొననీ

అది ఇటుకల ఇల్లేగావొచ్చుగాని
ఒక నిండైన ప్రాణంగల ఇల్లు చచ్చిపోతుంది

నిరంకుశుడైనరాజు
తన కోటలో కూచుని
నిరాయుధులైన,నిస్సహాయులైన
ప్రజల ఇళ్ళను కూల్చివేయిస్తున్నాడు

రాజెప్పుడూ
స్వయంగా ఇల్లు కట్టుకోడు
అతని భవంతికోసం
ఎత్తిన రాళ్ళలో
అతనిచెమటగాక
ప్రజల చెమట రక్తం కలగల్సి ఉంటాయి

రాజుకొక సొంత ఇల్లుంటే
తనుశ్రమించి కట్టుకున్నదైతే
బుల్డోజర్లు ఇటువైపురావు
ఇల్లెట్లాకఢతారో తెలిసినవాడికి
కూల్చడానికైతే మనసొప్పదు

Leave a Reply