పత్రికా ప్రకటనలు

ఆయనకు ఆ శిక్ష చాలదు

యాసిన్‌మాలిక్‌ను ఉరితీయాలన్న ఎన్‌ఐఏ వాదనలను ఖండించండి  యావజ్జీవ ఖైదీగా ఉన్న కశ్మీర్‌ పోరాట నాయకుడు యాసిన్‌మాలిక్‌ను ఉరి తీయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మే 29న ఢల్లీి కోర్టులో వాదించింది. ఇటీవల ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటీషన్‌ మీద తుషార్‌మెహతా కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి అత్యంత ప్రమాదకరమైన, అరుదైన నేరానికి పాల్పడినందు వల్ల యాసిన్‌ మాలిక్‌కు ఇప్పుడు విధించిన శిక్ష సరిపోదని, ఉరిశిక్ష విధించాలని కోరాడు. ఆయన చేసిన నేరాల తీవ్రతను చాటడానికి ఒసామాబిన్‌ లాడెన్‌ పేరు కూడా ప్రస్తావించాడు. ఇలాంటి కఠినమైన శిక్షలు విధించకపోతే నిరంతరం ఎవరో ఒకరు సాయుధ
పత్రికా ప్రకటనలు

రాజ దండం పాలనలో క్రీడాకారులపై దాడి

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బట్టబయలు చేస్తూ, రాజ్యాంగ ఆదర్శాలను అవహేళన చేస్తూ, ఇది అధికారికంగా కూడా హిందుత్వ రాజ్యమని ప్రకటిస్తూ మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అనేక రాజకీయ పార్టీలు బహిష్కరించాయి. అట్లాగే  మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై   చర్యలు తీసుకోవాలని కోరుతూ చాలా కాలంగా  పోరాడుతున్న క్రీడాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ ప్రతిష్టను క్రీడాకారులు దశ దిశలా వ్యాపింపజేస్తారని పొగిడే పాలకులు న్యాయమైన డిమాండ్‌ మీద రాజీపడకుండా పోరాడుతోంటే తమ సహజమైన అణచివేత చర్యలకు
పత్రికా ప్రకటనలు

ఆదివాసుల మీద వైమానిక దాడులుఎందుకు చేస్తున్నారు?

ఆహ్వానందండకారణ్యం శతృదేశమా?ఆదివాసుల మీద వైమానిక దాడులు ఎందుకు చేస్తున్నారు?చర్చా కార్యక్రమం21 మే, 2023 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకా మిత్రులారా చత్తీస్‌ఘడ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే.  ఈ దాడులు మొదట 2021 జూన్‌ 19న బీజాపూర్‌ జిల్లాలో బొట్టలంక, పాలగూడెం గ్రామాల మీద మానవ రహిత డ్రోన్లతో  12 బాంబులు వేయడంతో మొదలయ్యాయి. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌ 14, 15 తేదీల మధ్య రాత్రి బీజాపూర్‌, సుక్మా జిల్లాల మధ్య ఉన్న బొట్టెంతోగె, మెట్టగూడెం, దులోడ్‌, సక్లెట్‌,
పత్రికా ప్రకటనలు

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

యుద్ధం మానవాళిని భయపెడుతున్నది. స్వేచ్ఛా జీవులైన మానవులను ఆందోళనకు గురి చేస్తున్నది.  పాలస్తీనాలో, ఉక్రెయిన్‌లో, మధ్య భారతదేశంలో ప్రజల ఉనికిని పాలకులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. లక్షలాది ప్రాణాలను బలిగొంటున్న యుద్ధాలు మానవతను ధ్వంసం చేస్తున్నాయి. అట్టడుగు సమూహాల ఉనికినే రద్దు చేస్తున్నాయి. మానవ ప్రాణానికన్నా  ఆధిపత్యం,  ఆయుధ వ్యాపారం,  కార్పొరేట్‌ లాభాలే పాలకులకు ముఖ్యమని ఈ హింసాకాండ నిరూపిస్తున్నది. మరీ ముఖ్యంగా  ఇజ్రాయిల్‌ దాడుల్లో వేలాదిగా పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులై గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తున్నారు. భారతదేశంలో  సొంత ప్రజలపైనే పాలకులు యుద్ధం ప్రకటించి నెత్తుటేరులు పారిస్తున్నారు. 2026 మార్చ్‌ నాటికి నక్సలిజాన్ని
పత్రికా ప్రకటనలు

బైరి నరేష్‌ పై హిందుత్వ మూకల దాడి

నరేష్‌పై హిందుత్వ శక్తులు ఫిబ్రవరి 27న మరోసారి దాడికి పాల్పడ్డాయి. ఈసారి పోలీసుల సమక్షంలోనే  దాడి జరిగింది.   మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మూక ఈ పని చేసిందా? లేక కేసీఆర్‌ ప్రభుత్వ అండతో చెలరేగిపోయి దాడికి దిగిందా? అనే ప్రశ్నలు చాల మామూలు వాళ్లకు కలిగేలా ఈ ఘటన జరిగింది. నరేష్‌ అభిప్రాయాలేవైనా సరే... అవి ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. హేతుబద్ధ చర్చకు ఆస్కారం ఇవ్వదల్చుకోని వాళ్లే తరచూ మనోభావాల పేరుతో ఉన్మాద చర్యలకు పాల్పడుతుంటారు. ఇది ఫాసిస్టు లక్షణం. నరేష్‌పై దాడి వల్ల నాస్తిక, హేతువాడ, ప్రగతిశీల, విప్లవ శక్తులకు ఫాసిస్టు శక్తులు ఒక
పత్రికా ప్రకటనలు

వైద్య విద్యార్థి ప్రీతిబలవన్మరణానికి కారకులెవరు?

అసమానత, హింస, వివక్ష ఉన్న సమాజంలో జరిగే బలవన్మరణాలన్నీ సామాజిక హత్యలే. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి డాక్టర్‌ ప్రీతి ఫిబ్రవరి 22న బలవన్మరణానికి గురైంది. ఇది  మన సమాజ దుస్థితిని తెలియజేస్తోంది. స్త్రీలు  ఇంట్లో, సమాజంలో  ఆత్మగౌరవంతో జీవించడానికి  చాలా ఘర్షణ అనుభవించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఒక దశ దాటాక వారు ఆత్మహత్య వైపు నెట్టివేయబడుతున్నారు. మన సమాజం నాగరికంగా ఎదగలేదని చెప్పడానికి ప్రీతి బలవన్మరణం ఉదాహరణ.                 సమాజంలోలాగే ఉన్నత విద్యా రంగంలో  కూడా పితృస్వామ్య, ఆధిక్య భావజాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించగల
పత్రికా ప్రకటనలు

బిబిసి డాక్యుమెంటరీ”ఇండియా:ది మోదీ క్వశ్చన్” ప్రసార నిషేధంపై ఖండన

కన్నడ మేధావులు 522  మంది విడుదల చేసిన ప్రకటన మేము, భారతదేశ శాస్త్రవే త్తలం,  అధ్యాపకులం ”ఇండియా:ది మోదీ క్వశ్చన్”  బిబిసి డాక్యుమెంటరీ రెండు భాగాల ప్రసార నిలుపుదల పట్ల తీవ్ర విషాదానికి గురయ్యాం. ఆ డాక్యుమెంటరీ “భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రత” కు భంగకరమనే సాకుతో దాన్ని సామాజిక మాధ్యమాల నుండి తొలగించారు. ఈ సమర్థన పరిశీలనకు నిలబడదు. మీ తొలగింపు , మన సమాజానికి,  ప్రభుత్వానికి  సంబంధించిన  ముఖ్యసమాచారాన్ని దేశ ప్రజల  తెలుసుకొనే హక్కును కాలరాస్తుoది. దేశంలోని చాలా విశ్వవిద్యాలయాలు ఆ డాక్యుమెంటరీ  ప్రదర్శనను అడ్డుకొనే ప్రయత్నం జేసాయి. ఇది అకడమిక్  స్వేచ్ఛను    ఉల్లంఘించడమే అవుతుంది. విశ్వవిద్యాలయాలు
పత్రికా ప్రకటనలు

విరసం మహాసభలను విజయవంతం చేసిన సాహితీ మిత్రులకు, రచయితలకు, ప్రజాసంఘాలకు, విప్లవాభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు.

అనేక నిర్బంధాలు, ఒత్తిళ్ళ మధ్య విరసం 28వ మహాసభలు నెల్లూరులో విజయవంతంగా ముగిశాయి. *సాంఘిక విముక్తి కోసం ప్ర‌త్యామ్నాయ సంస్కృతి* ల‌క్ష్యంగా సంస్కృతి - మార్క్సిజం ఇతివృత్తంగా త‌ల‌పెట్టిన ఈ మ‌హాస‌భ‌ల‌ సన్నాహాల దగ్గరి నుండి చివరి దాకా నెల్లూరు మిత్రుల సహకారం మరువలేనిది. వీళ్లంతా విర‌సం ప‌నిని త‌మ ప‌నే అనుకొని ముందుకు వ‌చ్చారు.అడిగిన వెంటనే వేదిక ఇవ్వడానికి ముందుకొచ్చిన సంఘమిత్ర స్కూల్ యాజమాన్యం అర్ధరాత్రి పోలీసుల‌ బెదిరింపులు ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. ఏకంగా స్కూల్ గుర్తింపును రద్దు చేయిస్తామనే దాకా పోలీసులు వెళ్లారు. ఇది రాజ్య దుర్మార్గానికి పరాకాష్ట.భిన్నాభిప్రాయాలను చర్చించలేనితనం, సహించలేనితనం ఫాసిస్టు లక్షణం. గత కొన్నేళ్లుగా
పత్రికా ప్రకటనలు

హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు, మానవ హక్కుల కార్యకర్తల ఇండ్లపై ఎన్ ఐ ఏ  దాడులు

భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థలు భీమా కోరెగాన్ కేసులో వ్యవహరించినట్టుగానే ఈ శాన్య రాష్ట్రాల్లో కూడా  అసమ్మతిని అణచివేయడానికి దారులు వెతుకుతున్నాయి. విద్యార్థి నాయకులను, మానవ హక్కుల కార్యకర్తలను భీమా కోరెగాన్ కేసులో లాగానే కుట్రకేసుల్లో ఇరికిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా  సీపీఐ(మావోయిస్టు)ల కోసం పనిచేస్తున్నారని, ‘ఉత్తర ప్రాంతీయ కమిటీ ని ’ (నార్తన్ రీజినల్ బ్యూరో) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని ఎన్ ఐ ఏ ఆరోపిస్తోంది. రైతుల కోసం, అట్టడుగు వర్గాల వారి కోసం, విస్థాపన సమస్యకు గురైన  వారి కోసం పనిచేస్తున్న వారిని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. సీపిఐ (మావోయిస్టు) తరపున
పత్రికా ప్రకటనలు

కమ్యూనిస్ట్ వ్యతిరేక “పవిత్ర విచారణ”*ను తిరస్కరించండి!

పెరూ కమ్యూనిస్టులకు సంఘీభావం! అభిమయేల్ గుజ్మన్ పార్థివ శరీరాన్ని అతని సహచరులకు అప్పగించండి! అరెస్ట్ నుండి నేటి వరకు మొత్తం 29 సంవత్సరాల పాటు అమెరికా సహాయంతో, చిత్రహింసలపాలు చేసి నిదానంగా నిర్మూలించే అల్పసంఖ్యాత ప్రభుత్వాల విధానం ఫలితంగా ఖైదు చేయబడిన పెరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడి మరణించాడు. అభిమయేల్ గుజ్మన్‌ను అక్షరాలా కొన్ని మీటర్ల వెడల్పు ఉన్న భూగర్భ బోనులో ఖననం చేసారు; ఒక విస్తృత, ప్రజాదరణ పొందిన సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు మాత్రమే కాకుండా, ప్రతిఘటించినందుకు, తనని బందీ చేసినవారికి లొంగిపోనందుకు, తన భావజాలాన్ని విడవనందుకు కూడా అతన్ని శిక్షించారు. ఇన్ని సంవత్సరాలనుండి జైలులో