సంపాదకీయం

జూలై 4: చీకటి రోజుల వెలుగు గానం

తెలంగాణలో నిషేధాన్ని మోస్తూ ఈ జులై 4లోకి విరసం ప్రయాణిస్తోంది.   గత కొన్నేళ్లుగా తీవ్రమవుతున్న నిర్బంధం గత ఏడాది జులై నాటికే పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం మార్చి 30 నుంచి ఇప్పుడది మరోసారి నిషేధంగా మారింది. ఇదేమీ కొత్త కాదు. కానీ ప్రతిసారీ అనుభవం కొత్త‌దే.  కొత్త ధిక్కారమే.ప్ర‌తి అణచివేతా కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది, సృజనాత్మక వెల్లువలకు దారి తీస్తుంది. ఈ విష‌యం చెప్ప‌డానికి సుదీర్ఘ గతంలోకి వెళ్లనవసరం లేదు. ఈ ఒక్క ఏడాది  ప్రజలు,  సృజనజీవులు గడించిన అనుభవాలే చాలు.  మహా మానవ విషాదంగా మారిన కొవిడ్‌  మధ్య ఈ ఏడాది గడిచిపోయింది. అది
బహుజనం కాలమ్స్

‘బ్లాక్‌ ఇంక్‌’లో పిల్లల కన్నీరు

ఓ అమ్మాయి చెప్పింది, ‘మేము కన్‌వర్టెడ్‌’ అని. ‘అది కాదమ్మా! మీరు బి.సి.నా? ఎస్సీనా? ఇంకేదైనానా?’ అన్నప్పుడు, ‘నాకు తెలీదు సర్‌, మేము దేవున్ని నమ్ముకున్నం’ అంది. అప్పుడు ఆ సంభాషణను పొడిగించలేదు. క్రైస్తవానికి మారి ‘కన్‌వర్టెడ్‌’ అని పిలిపించుకున్నా కులం పేరుతో ఈసడిరపులు, కులవివక్షలు, అణచివేతలు కొనసాగుతూనే ఉంటాయి. మతం మారినందుకు కులాన్ని వదిలేసి చూడదు సమాజం.   అందుకే తమను 'అంటరాని'గా చేసిన మతం నుంచి తప్పించుకునిపోయినా సరే, ఎన్నేళ్లైనా అంటరానిగానే ఇంకా బతుకులీడుస్తున్నారు ‘కన్‌వర్టెడ్స్‌’. పైగా వెళ్ళిన మతంలోనూ అంటే క్రైస్తవ మతంలోనూ వచ్చిన కులం ఆధారంగానే సమూహాలుగా విడిపోయి ఆ మతంలోనూ ఈ కుల జాడ్యాన్ని
సాహిత్యం వ్యాసాలు

మునికాంతపల్లి కతలు

పాఠకుడి నోట్సు ప్రవేశిక:నదుల వొడ్లు ( మన శ్రీపాద వారి గోదావరి వొడ్డు), సముద్రతీరాలు (తగళి శివశంకరపిళ్ళై "రొయ్యలు"),  ఎడారి మైదానాలు ( పన్నాలాల్ పటేల్ 'జీవితమే ఒక నాటక రంగం') కథలకు పుట్టినిల్లులా? యేమో!బహుశా ఇసుకకు కథా, నవలా సాహిత్యానికి  విడదీయరాని దగ్గరి-దూరపు చుట్టరికం యేదో ఉంది. అలాంటి ఒక చిన్ననది  సువర్ణముఖి. నెల్లూరుజిల్లా నాయుడు పేట పక్కన తొండనాడు ముఖద్వారపు నదిగా... దాని ఒడ్డున ఒక  మునికాంతపల్లి  మాలవాడ. ఆ మాలవాడనుంచి సాహిత్యం వస్తే ఎట్టా వుంటుందిరయ్యా? మడిగట్టుకున్న  అగ్రహారపు వాక్యమై అస్సలు వుండదు. అన్ని సాంప్రదాయిక మర్యాదలనూ ఎడమకాలితో అవతలికి తోసే పొగరు కనిపించ
లోచూపు కాలమ్స్

తెహ్జీబ్ జిందాబాద్ !

అసమ సమాజంలో జీవితం బరువు మోసే వాళ్ళే దేన్నైనా అర్థం చేసుకోగలరు. కొన్ని కొన్ని సార్లు అపార్ధం చేసుకోనూవచ్చు. అలా అపార్థం చేసుకోవడం కూడా ఒక రకంగా అర్థం చేసుకునే క్రమమే.కనుక అపార్థం చేసుకున్నవాళ్ళకే ఎప్పటికైనా సరిగ్గా  అర్థం చేసుకోగలిగే అవకాశాన్ని (చారిత్రిక)జీవితానుభవాలే అందిస్తాయి. అలా సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళే నిర్భయంగా ప్రశ్నిస్తారు. బలంగా ప్రతిఘటిస్తారు. రాజీ లేకుండా పోరాడుతారు. వాళ్లే ప్రజలు. అలాంటి ప్రజల్లో సహజంగానే సహజీవన సంస్కృతి(తెహ్ జీబ్) ఉంటుంది. స్పష్టాస్పష్టంగానే కావొచ్చు ఎన్నో ప్రజాస్వామిక విలువలు ఉంటాయి. వారికి విభిన్న మతాల పట్ల తమవైన లౌకిక వైఖరులు ఉంటాయి. తమవైన ప్రత్యేక భక్తి
కారా స్మృతిలో సాహిత్యం

కారా కథల్లో కొన్ని వైరుధ్యాలు

కాళీపట్నం రామారావు కథల ప్రాసంగికత గురించి, పాత్రల గురించి, కథాముగింపుల గురించి  చాలా కాలం నుంచి చర్చ జరిగింది.ఆయన కథల గురించి మాట్లాడుకోవడమంటే యాభై ఏళ్ల కిందటి తెలుగు సమాజం (అది ఉత్తరాంధ్రే కావచ్చు) గురించి మాట్లాడుకోవడమే.కారా తన కాలపు గడ్డు వాస్తవికతను నేరుగా చిత్రించిన వాడే.అయితే ఏ రచయితైనా తనకున్న దృక్పథం మేరకే తను రాయాలనుకున్నది రాస్తాడు.తన పరిశీలని శక్తి ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తుంది.సామాజిక వాస్తవికతను సరిగ్గా పట్టుకున్న రచనలో ఆ సామాజిక వాస్తవాని కున్న అన్ని కోణాలూ ప్రతిఫలిస్తాయి.ఏదోమేరకు పాఠకుల అంచనాకు అందుతాయి.మనం 2021 లో నిలబడి 1960ల నాటి రచనల్లో , యిన్ని సంవత్సరాల
కథావరణం కాలమ్స్

*అభివృద్ధి*ని ప్రశ్నిస్తున్న క‌థ

సీనియర్ కథా రచయిత్రి ముదిగంటి సుజాతా రెడ్డి 2018 లో ప్రచురించిన "నిత్యకల్లోలం" కథాసంపుటి లోని , ఈ కథను చదివితే నిజానికి అభివృద్ధి అంటే ఏమిటి ? అది ఎవరి కోసం? అభివృద్ధి ఫలితాలు ఏమిటి? అవి ఎవరి కోసం ?నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలు వార్తా కథనాలై, ప్రత్యక్ష ప్రసారాలై, మనసులో ఎలాంటి ఆలోచనలు కలిగిస్తున్నాయి ? మనిషి వాటికి ఎలా స్పందిస్తున్నాడు  అనే ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి.నిద్రపుచ్చటం కన్నా ప్రశ్నించటం మంచిది అనుకుంటే, ప్రశ్నించే గుణం ,తత్వం ఈ రచయిత్రి కి ఈ రచయిత్రి సృష్టించిన అనేక పాత్రలకు పుష్కలంగా ఉన్నాయి.*అన్నీ మరిచిపోయి మనిషి
ఆర్ధికం కాలమ్స్

ఆధిపత్య లక్ష్యంతో బైడెన్‌ విదేశాంగ విధానం

అమెరికా అధ్యక్ష పీఠంపై  ఎవరున్నా దాని సామ్రాజ్యవాద విధానాల్లో మార్పు ఉండదన్న విషయాన్ని డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ తన భౌగోళిక రాజకీయ విధానాల ద్వారా రుజువు చేస్తున్నారు. ట్రంప్‌ విధానాల వల్ల దూరం జరిగిన మిత్రులను ఒకటి చేసే పనిలో బైడెన్‌ నిమగ్నమై ఉన్నారు. కొంత కాలంగా జి-20 దేశాల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా అమెరికా నాయకత్వంలోని పాత సామ్రాజ్యవాద కూటమి అయిన జి-7 దేశాల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక తిరిగి అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం పాత మిత్రులందరిని సమన్వయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు..
కారా స్మృతిలో సాహిత్యం

కారాతో మేము..

కాళీప‌ట్నం రామారావు మాస్టారితో నా పరిచ‌యం బ‌హుశా 1967 జ‌న‌వ‌రిలో మొద‌లైంద‌నుకుంటాను. అప్పుడు నా వ‌య‌స్సు ప‌దిహేను సంవ‌త్సరాలు. తొమ్మిదో త‌ర‌గ‌తిలో నిల‌దొక్కుకుంటున్న సమ‌యం. అదీ యువ దీపావ‌ళి ప్ర‌త్యేక సంచిక‌లో వ‌చ్చిన యజ్ఞం  కధ‌తో... కారా ఊరు ముర‌పాక. నా బాల్యంలో కొంత భాగం గ‌డిచిన మా అమ్మ‌మ్మ ఊరు వెన్నంప‌ల్లి లాంటిది. నేను పుట్టి పెరిగిన గాజులప‌ల్లి చాలా చిన్న ఊరు. అప్ప‌టి నా స్థితి- ఇప్ప‌టికీ వ‌ద‌లని - ప‌ల్లెటూరి జీవితానుభ‌వం... అత్యంత కౄర‌మైన భూస్వామిక దోపిడీ, పీడ‌న - హింస, వివ‌క్ష‌త‌లో కూడా బ‌త‌క‌డానికి నా చుట్టూ ఉన్న మ‌నుషులు చేసే భీక‌ర
కారా స్మృతిలో సాహిత్యం

మాస్టారితో నా గ్యాపకాలు కొన్ని !

మాస్టారు ఇక మనల్ని విడిచి ఏ క్షణమో వేలిపోతారని గత ఏడాది మార్చిలో ఆయన ఆసుపత్రిలో చేరినపుడు అన్పించింది. అయితే ఆయన గట్టి పిండం. వైద్యుల వూహకు అందని రీతిలో కొన్నాళ్ళకు తేరుకున్నారు. ఆసుపత్రిలో చేరిన నాటికి కిడ్నీ, వూపిరితిత్తులు అర్ధ భాగాలే పనిచేస్తున్నయట. పనిచేయని అర్ధభాగాలను మరి బాగు చేయలేరట, పనిచేసే భాగాలు కూడా ఎన్నాళ్ళో చేయవని వైద్యులు  జ్యోతిశ్యం  చెప్పారు నమ్మకంగా.  అంచేత అలా ఇక ఏ క్షణమో అననుకున్నాము. కానీ మాస్టారు వైద్యుల జ్యోతిశ్యాన్ని వమ్ము చేసి   ఆసుపత్రి నుంచి వచ్చాక ఏడాది పైగా నిలబడ్డారు.    ఈమధ్యలో కొన్నాళ్ళు శరీరం అతని మాట
సాహిత్యం వ్యాసాలు

నిశ్శబ్దంగా నిష్క్రమించిన రచయిత

మూడేళ్ళ క్రితం ఓ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ మా కాలేజీకి వచ్చారు. డెబ్బై ఏళ్లు ఉండొచ్చు. నల్లగా, అంత ఎత్తూ కాని, లావూ కాని పర్సనాలిటీ. మనిషి చాలా నెమ్మది అని చూడంగానే అర్థమవుతుంది. పరిచయం చేసుకొని తాను రాసిన కథల గురించి చెప్పారు. దేవిరెడ్డి వెంకటరెడ్డి - పేరు విన్నట్టుగా ఉంది. కథలు గుర్తు రావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకం పబ్లిష్ చేయాలనుకోలేదని, ఇప్పుడు ఆ ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. దీన్ని విరసమే ప్రచురించాలని తన కోరిక అన్నారు. నేను సంస్థలో చర్చిస్తానని చెప్పాను. ‘ముందుమాట మీరే రాయాలి’ అన్నారు. ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను