నివాళి

బ్రాహ్మణీయ వ్యతిరేక సాంస్కృతిక, మేధో ఉద్యమంలో డా. విజయ భారతి

బి. విజయ భారతి సెప్టెంబర్‌ 28 ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు ప్రజల ఆధునిక సాహిత్య సాంస్కృతిక, మేధో ఉద్యమంలో ఆమె స్థానం చిరస్మరణీయమైనది. బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలానికి, సంస్కృతికి వ్యతిరేకంగా వందల, వేల ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని విజయభారతి తన రచనలతో చాలా విశాలం చేశారు. ముందుకు తీసికెళ్లారు. దీన్ని ఆమె ప్రధానంగా రెండు మార్గాల్లో కొనసాగించారు. ఒకటి: కుల వ్యవస్థ, సనాతన ధర్మం, పితృస్వామ్యం.. సామాజికంగా వ్యవస్థీకృతం కావడానికి, భావజాలపరంగా, సాంస్కృతికంగా నిరంతరం పునరుత్పత్తి కావడానికి సాధనంగా పని చేస్తున్న పురాణాలను ఆధునిక, బ్రాహ్మణీయ వ్యతిరేక దృక్పథంతో విమర్శనాత్మకంగా చూసి విశ్లేషించడం. రెండు: కుల వ్యవస్థకు
కవిత్వం

యుద్ధం ముగిసాక

దేశం ఒంటరైపోతుందిఎత్తైన హర్మ్యాలు తేజం కోల్పోతాయిగమ్యం చేర్చే రహదారులన్నీఅగమ్య గోచరాలవుతాయియుద్ధం వస్తే మాట్లాడల్సిందిరెండు పెదవులు కానీఇరువైపుల తుపాకులు మాట్లాడతుంటాయికొందరు బతకడం కోసం నిత్యంయుద్ధం చేస్తేఇంకొందరు బతికేదే యుద్ధం కోసంయుద్ధం తరువాతదేశం ఒంటరవుతోందిజనులొంటరౌతారుచేతులకు చేయి కాళ్లకు కాళ్లుఒంటరిగాయుద్ధం తరువాత నడుస్తాయియుద్ధంలో దగ్ధమైన అడవంతాపక్షులగానం కోసం ఏడుస్తుందిఅన్ని అసంపూర్ణంగా నడుస్తాయికానీయుద్ధానికి బలైన దేశం మాత్రంసంపూర్ణంగా ఏడుస్తుందిమొలకెత్తిన విత్తనం రెండు హరితదళాలు జోడించిసూర్యుడికి నమస్కరిస్తేపత్రాలనిండా రుథిర వర్ణం పూసుకున్నదిఇది అప్పుడే పుట్టిన బిడ్డక్కుడా మినహాయింపు కాదేమో. ..!యుద్ధాలోస్తేఆయుధ కర్మాగారాలపనేంటంటేదేశాన్ని శవకర్మాగారంగా మార్చేపత్రంపై సంతకం చేస్తున్నాయిచివరిగాయుద్ధం ముగిసాకసరిహద్దుల గోర్జల్లో పారేటినీళ్ళల్లో నెత్తురు కొలనులు పుట్టుకొస్తున్నాయి నేలంతా యింకానెత్తురు ఊటలు తాగాల్సిందేనా.... ?ఇప్పుడు ఎవ్వరు ఒక
సంభాషణ

తల్లి ఆవేదన

అది జనవరి 2024 కొత్త సంవత్సరం. ప్రపంచం సంతోషంలో మునిగి ఉంది.  కొంతమంది రాత్రి 12 (ఉదయం అనుకోవచ్చు) తాగిన మైకం గూడ దిగక ముందే పొద్దున మళ్ళీ తాగి సంతోషంతో మునిగి పోయి వుండొచ్చు. మాకు ఆదివాసులకు అలాంటివి తెలియవు. మాకు 2005 నుండి, కష్టాలు కన్నీళ్ళ, తర్వాత గ్రీన్‌హంట్‌ 2017 నుండి సమాధాన్‌ 2022 నుంచి సూరజ్‌కుండ్‌ దాడి  జరుగుతూనే వుంది. అందుకే కొత్త సంవత్సరం అంటే మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఈరోజు మంచిగా ఎలా గడుస్తుందనే. అదే మాకు  మంచి రోజు. ఎందుకంటే భారతదేశంలో కాశ్మీర్‌ తర్వాత ఎక్కువ కేంద్ర బలగాలు ఉన్నది
కరపత్రాలు

 ప్రజా పాలనా? నియంతృత్వ పాలనా?

పూసపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలి!   ఏజెన్సీ గ్రామాలపై కూంబింగ్‌ను నిలిపి వేయాలి!! ప్రియమైన ప్రజలారా, రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనూ అక్రమ అరెస్టులు, కుట్ర కేసులు, పోలీసు   కూంబింగ్‌లు  షరా మామూలుగానే వుండబోతున్నాయా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాన్ని రేవంత్‌రెడ్డి గారి ప్రభుత్వం యిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు విశదం చేస్తున్నాయి. సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ అశోక్‌ అన్న (కుర్సం వజ్జయ్య), రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ గోపన్న (దనసరి సమ్మయ్య), జిల్లా నాయకులు కామ్రేడ్స్‌ పుల్లన్న (సంగపొంగు ముత్తయ్య), ఎస్‌కె.మదార్‌, కలకొండ సురేశ్‌లను పోలీసులు అరెస్టు చేసిన తీరూ, వారితో పాటు మొత్తం
పత్రికా ప్రకటనలు

పోరాడుతున్న రైతులకు అండగా నిలబడదాం!!

2022లో ఏడాదిపాటు సాగిన రైతుల సమ్మె యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చింది. అన్ని దురభిమానాలను, అధికార దురహంకారాలను ఓడించి ఆ పోరాటం విజయవంతంగా ముగిసింది. రైతులు లేవనెత్తిన డిమాండ్లను అంగీకరిస్తూ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది. 1) తుది విశ్లేషణలో దేశానికే హాని కలిగించే మూడు రైతు చట్టాల ఉపసంహరణ 2) ఎమ్.ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన కనీస మద్దతు ధర అమలు 3) సమ్మె సంబంధిత కేసులు ఉపసంహరణ 4) సమ్మెలో మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం 5) వ్యవసాయ రుణాల మాఫీ 6) విద్యుత్ బిల్లులను తగ్గింపు - అమలు చేస్తామని ప్రభుత్వం హామీ
పత్రికా ప్రకటనలు

నాస్తికోద్యమ నేత జయగోపాల్‌కు నివాళి

ప్రముఖ నాస్తికోద్యమ నేత డాక్టర్‌ జయగోపాల్‌ ఫిబ్రవరి 7న విశాఖపట్నంలో మరణించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా నాస్తికోద్యమ నిర్మాణానికి ఆయన జీవితమంతా కృషి చేశారు. 1972లో ఆయన భారత నాస్తిక సమాజాన్ని స్థాపించి దాన్ని నిర్మాణాన్ని దేశమంతా విస్తరింపజేశారు. భానాసను ఒక ఉద్యమ సంస్థగా, ప్రజా చైతన్య వేదికగా మలచడానికి జయగోపాల్‌ భావజాల, సాంస్కృతిక రంగాల్లో తీవ్రమైన కృషి చేశారు. నాస్తికవాదాన్ని ఒక సామాజికవాదంగా, హక్కుల వాదంగా కూడా ఆయన తీర్చిదిద్దారు. ఆస్తికత్వాన్ని భారతీయ సామాజిక, సాంస్కృతికరంగాల్లో ఆధిపత్యశక్తిగా గుర్తించిన ఉద్యమకారుడు ఆయన.             భారత నాగరికతలో కులం, మతం, మూఢాచారాలు ప్రజల చైతన్యాన్ని ఆడ్డుకొని
పత్రికా ప్రకటనలు

కవి, కార్యకర్త, విప్లవాభిమాని నల్లెల రాజయ్యకు నివాళి

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు నల్లెల రాజయ్య ఫిబ్రవరి 15 గురువారం ఉదయం హైదరాబాదులోని కిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రలో ఉన్నారు. గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. వరంగల్‌కు చెందిన నల్లెల రాజయ్య కవిగా, పలు సాహిత్య సంస్థల బాధ్యుడిగా సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో వరంగల్‌ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక ప్రధాన బాధ్యుడిగా పని చేశారు.   తెలంగాణ రచయితల వేదిక గౌరవాధ్యక్షుడిగా ఆయన అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం రచనకే పరిమితం కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా రాజయ్య పాల్గొన్నారు. కొన్నిటికి
వ్యాసాలు

మన రాజ్యాంగం – మనం

విరసం 29 వ మహా సభల ప్రారంభోపన్యాసం స్నేహితులారా! మనం ఇక్కడ రాజ్యాంగవాద సారాంశాన్ని గురించి మాట్లాడుకోవడానికి కలిశాం. ఈ రోజు మన జాతి చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భం. మన రాజ్యాంగం కేవలం ఒక న్యాయసంబంధమైన డాక్యుమెంట్‌ మాత్రమే కాదు. అది మన ప్రజాస్వామిక స్ఫూర్తికి ఆత్మ లాంటిది. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వైపుగా మనం చేసే ప్రయాణాన్ని సుగమం చేసే ఒక శక్తి. మనం ఒక నూతన యుగం ముంగిట్లో నిలబడి వున్నాం. ఈ సందర్భంగా, మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలపట్ల మన నిబద్దతను మరోసారి ప్రకటిద్దాం. భారతదేశపు రాజ్యాంగ ప్రయాణం పరిణామక్రమంతో కూడుకున్నది. మనలాంటి
వ్యాసాలు

తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక వికాసంలో ‘నిషేధిత’సంఘాలు

‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు   ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు. భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో  ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే   ప్రజాస్వామ్యానికి కుదురు
వ్యాసాలు

త‌పాలా ఉద్యోగులంటే మోదీకి ఎందుకింత కక్ష ? 

చెడ్డ‌ పోస్టుమ్యాన్ ఉండ‌డు.. , మంచి పోలీస్ క‌నిపించ‌డు.. అనేది ఓ నానుడి. అంటే..  పోస్ట్ మ్యాన్ పని విధానం ఎంత‌  నిస్వా ర్థంగా త్యాగ‌పూరితంగా ఉంటుందో ఈ సామెత తెలియ‌జేస్తున్న‌ది. నేటికీ మారుమూల గ్రామం మొద‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల దాకా త్యాగ‌పూరితంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వ విభాగం ఏదైనా ఉన్న‌ది అంటే అది తంతి త‌పాలా శాఖ (పోస్ట‌ల్ డిపార్ట్ మెంటు) మాత్ర‌మేన‌ని చెప్పుకోవాలి. వృత్తి నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న గ్రామీణ త‌పాలా ఉద్యోగులు త‌మ స‌మ‌స్య ల ప‌రిష్కారం కోసం  కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ స‌మ్మె చేస్తే, వారిని కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ బీజేపీ ప్ర‌భుత్వం