బ్రాహ్మణీయ వ్యతిరేక సాంస్కృతిక, మేధో ఉద్యమంలో డా. విజయ భారతి
బి. విజయ భారతి సెప్టెంబర్ 28 ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు ప్రజల ఆధునిక సాహిత్య సాంస్కృతిక, మేధో ఉద్యమంలో ఆమె స్థానం చిరస్మరణీయమైనది. బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలానికి, సంస్కృతికి వ్యతిరేకంగా వందల, వేల ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని విజయభారతి తన రచనలతో చాలా విశాలం చేశారు. ముందుకు తీసికెళ్లారు. దీన్ని ఆమె ప్రధానంగా రెండు మార్గాల్లో కొనసాగించారు. ఒకటి: కుల వ్యవస్థ, సనాతన ధర్మం, పితృస్వామ్యం.. సామాజికంగా వ్యవస్థీకృతం కావడానికి, భావజాలపరంగా, సాంస్కృతికంగా నిరంతరం పునరుత్పత్తి కావడానికి సాధనంగా పని చేస్తున్న పురాణాలను ఆధునిక, బ్రాహ్మణీయ వ్యతిరేక దృక్పథంతో విమర్శనాత్మకంగా చూసి విశ్లేషించడం. రెండు: కుల వ్యవస్థకు