2022లో ఏడాదిపాటు సాగిన రైతుల సమ్మె యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చింది. అన్ని దురభిమానాలను, అధికార దురహంకారాలను ఓడించి ఆ పోరాటం విజయవంతంగా ముగిసింది. రైతులు లేవనెత్తిన డిమాండ్లను అంగీకరిస్తూ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది.

1) తుది విశ్లేషణలో దేశానికే హాని కలిగించే మూడు రైతు చట్టాల ఉపసంహరణ

2) ఎమ్.ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన కనీస మద్దతు ధర అమలు

3) సమ్మె సంబంధిత కేసులు ఉపసంహరణ

4) సమ్మెలో మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం

5) వ్యవసాయ రుణాల మాఫీ

6) విద్యుత్ బిల్లులను తగ్గింపు

– అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రధాన డిమాండ్లు ఇవే. రైతుల పట్ల తమ ప్రభుత్వ వైఖరిపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

ఇప్పుడు మోడీ ప్రభుత్వం రెండో దఫా పాలన ముగిసింది. “జై శ్రీరామ్” అనే కేకలతో గత పార్లమెంట్ సమావేశాలు ముగిసాయి. సహజంగానే కనీసం ఈ పార్లమెంట్‌లోనైనా తమకు ఇచ్చిన హామీలపై ప్రకటన వస్తుందని రైతు సంఘాలు ఆశించాయి. కానీ అలా జరగలేదు. ఎప్పటిలాగే తాము మోసపోయామని రైతులు గ్రహించారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో మళ్లీ ఢిల్లీకి యాత్ర ప్రారంభించారు.

గత రైతు సమ్మెలో 600 మంది రైతులు ప్రాణాలు అర్పించి అమరులయ్యారు.

భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద వ్యవసాయ దేశం. 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందిస్తున్నామని మోదీ పదే పదే చెబుతున్నప్పుడు – ఆ ధాన్యాన్ని పండిస్తున్నది ఈ మోసపోయిన రైతులే అన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి.

అదే సమయంలో, భారతీయ రైతులు అత్యధికంగా నిర్లక్ష్యం, అణచివేతలకు గురవుతున్నారు. మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం2 లక్షల మంది రైతులు, అంటే సగటున రోజుకు 30 మంది రైతులు చనిపోయారు.

ఇప్పుడు “అన్నదాతలు” అయిన ఈ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం విద్వేషపూరిత వైఖరిని అవలంబిస్తోంది. పంజాబ్, యూపీ, హర్యానాల నుంచి కేవలం నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులను ఢిల్లీలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేసింది.

యూపీ, హర్యానాలో రైతుల ఇళ్లపై దాడులు చేసి అరెస్టు చేశారు. ఢిల్లీలోనూ, చుట్టుపక్కలా, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో సెక్షన్  144 ప్రకటించారు. పది రోజుల పాటు ఇంటర్నెట్ కనెక్షన్‌ను నిలిపేశారు.  ఢిల్లీకి వెళ్లే రహదారులపైన ముళ్ల కంచెలు, కాంక్రీట్ బ్లాకులతో బారికేడ్‌లు పెట్టారు. అంతేకాకుండా పెద్దమేకులు, ఇనుప సలాకులు పాతారు. మానవ రహిత వైమానిక వాహనాలతో (ద్రోన్)ఉపయోగించి టియర్ గ్యాస్ షేల్స్ వేసే ప్రయోగాలు కూడా ప్రారంభించారు. కొన్ని చోట్ల నీటి ఫిరంగులు ప్రయోగించినట్లు సమాచారం. రాష్ట్ర పోలీసులు, పారామిలటరీ బలగాలను పూర్తి స్థాయిలో మోహరించారు.

ఎంత పిరికితనం, అనాగరిక క్రూరత్వం! బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం తప్ప మరెవరు దీన్ని చేయగలరు?

“వినండి, మేము మా మార్గాలను సరిదిద్దుకోము” అని వారు దురహంకారంతో ప్రకటించారు.

ఏనాడూ నిజాయితీ లేని వారు మోసపుచ్చడానికే రైతాంగ నేతలతో సయోధ్య చర్చలు జరిపారు

తమపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోకపోవడంతో ఇప్పటికీ జైల్లో రైతులు ఉన్నారు అనే ఒక్క రుజువు చాలు:. అదే సమయంలో, ఆందోళనకారులపైకి తన కారును ఎక్కించి రైతులను చంపిన కేంద్ర మంత్రి కుమారుడు, బెయిల్‌పై బయట ఆనందంగా ఉన్నాడు.

మోడీ ప్రభుత్వం ఇక్కడి రైతులపై యుద్ధం ప్రకటించినప్పుడు, గత 9 సంవత్సరాలలో ఏ ఒక్క ఉపయోగకరమైన ప్రభుత్వ సంస్థకు శంకుస్థాపన చేయని శ్రీ ప్రధానమంత్రి మోడీ, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో హిందూ దేవాలయానికి ప్రారంభోత్సవం చేస్తున్నాడు.

మోదీ ప్రభుత్వ పిరికిపంద చర్యలను ధిక్కరిస్తూ రైతులు తమ వాహనాలపై ఎక్కి బారికేడ్లను తొలగిస్తున్న దృశ్యాలు వస్తున్నాయి.

వీర రైతాంగానికి అభినందనలు!

పూర్తిగా మతిలేని, ఫాసిస్ట్ బిజెపి, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా శక్తివంతమైన సమీకరణలు, నిరసనలు చేద్దాం.!

పోరాడుతున్న రైతులతో సమైక్యమవుదాం!

చైర్ పర్సన్,

శాంతోలాల్, జనరల్ కన్వీనర్

పోరాట్టం జనరల్ కౌన్సిల్

కేరళ 13-02-2024

Leave a Reply