వ్యాసాలు

భారత రాజ్యాంగం – వైరుధ్యాల పుట్ట

(ఈ వ్యాసాన్ని ప్రొ. శేషయ్యగారు 2004లో రాశారు. రాజ్యాంగవాదం మీద వస్తున్న అభ్యంతరాలును పరిశీలించడానికి ఈ వ్యాసం ఉపయోగపడుతుంది. పౌరహక్కుల ఉద్యమకారుడిగా, న్యాయశాస్త్ర ఆచార్యుడిగా ఆయన రాజ్యాంగాన్ని  చారిత్రకంగా, విమర్శనాత్మకంగా పరిశీలించారు. ఆయన మరణానంతరం పౌరహక్కుల సంఘం ప్రచురించిన ప్రొ. శేషయ్య రచనా సర్వస్వం`1లో ఈ వ్యాసం పునర్ముద్రణ అయింది` వసంతమేఘం టీం) ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్చు వివరిస్తూ ‘ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు, రైతులకు, పెటీ బూర్జువాల సామాజిక బానిసత్వాన్ని కొనసాగిస్తూనే, వారు రాజకీయ అధికారం పొందడానికి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించడం, మరో వైపు
సంపాదకీయం గెస్ట్ ఎడిటోరియల్

రాజ్యాంగాన్ని, రాజ్యాంగవాదాన్ని విమర్శించకూడదా?

విజయవాడలో ఇటీవల జరిగిన 29 వ మహాసభల సందర్భంగా విరసం ఒక కీనోట్‌ పేపర్‌ను విడుదల చేసింది. దాని శీర్షిక ‘‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’’. ఆ కీనోట్‌ పేపర్‌ ను కా.పి. వరలక్ష్మి మహాసభల్లో ప్రవేశపెట్టారు. దానిపై మహా సభలు ప్రారంభం కాకముందే చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాతా మౌఖిక, లిఖిత రూపాల్లో అనేక ప్రతిస్పందనలు వెలువడ్డాయి. ఆ ప్రతిస్పందనలలో విరసాన్ని తప్పుపడుతూ ఈ కింది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.                                                                        విరసం రాజ్యాంగవాదాన్ని విమర్శిస్తున్నదంటే అంబేద్కర్‌ను విమర్శిస్తున్నట్టని, రాజ్యాంగం ద్వారా అందాల్సిన హక్కులు, రక్షణలు దళితులకు, పీడిత సమూహాలకు దక్కకుండా చేసే ఉద్దేశం విరసానికున్నదని కొందరు భావించారు. రాజ్యాంగం