పత్రికా ప్రకటనలు

ప్ర‌జా క‌ళాకారుడు జ‌హంగీర్‌కు జోహార్లు

ప్ర‌జా క‌ళాకారుడు, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య సభ్యుడు తుర్క‌ప‌ల్లి జ‌హంగీర్ ఏప్రిల్ 2, 2026న గుండెపోటుతో మ‌ర‌ణించారు. పీడిత ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడును సుదీర్ఘ‌కాలం త‌న గొంతులో ఆయ‌న ప‌లికించారు. జ‌హంగీర్ తెలంగాణ‌లోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ప్రాంతంలో పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. బాల్యంలో పేదరికం వలన ప్రాథమిక దశలోనే చదువుకు దూరమయ్యారు. జీవిక కోసం వివిధ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచారు. తెలుగు నేలను ఆవరించిన ప్రపంచీకరణతో పేద ప్రజల జీవితాలను 90ల ద‌శ‌కంలో మ‌రింత‌గా సంక్షోభంలోకి నెట్టడం మొద‌లైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ‌లో పతనమవుతున్న జీవితాలను కళ్ళారా చూసిన జహంగీర్
వ్యాసాలు

రాజధాని రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ భారత పార్లమెంటులో తీర్మానాన్ని ఆమోదించటం, తదుపరి కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపడంతో ఇక చివరిగా రాష్ట్రపతి ఆమోదం  జరిగిన తర్వాత అది చట్టబద్ధం అయిపోతుంది. ఈ సందర్భంగా పార్లమెంటులోనూ, రాష్ట్రంలోనూ వైసీపీ అధినేతతో పాటుగా ఆ పార్టీ నాయకులు అమరావతిని వ్యతిరేకిస్తూ, అందుకు ప్రతిగా గుంటూరు- విజయవాడ- మచిలీపట్నం కారిడార్ గా "మావిగాన్ "ను రాజధానిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కూడా టిడిపి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 లో హైదరాబాదును 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా
సమకాలీనం

దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం

క్రిస్టియన్ మతం స్వీకరించిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని సుఫ్రీం కోర్టు చెప్పిన తీర్పు  చట్ట వ్యతిరేకం మరియు రాజ్యాంగ వ్యతిరేకం, ముఖ్యంగా ప్రజా వ్యతిరేకం.రాజ్యంలోని ముఖ్య అంగమైన న్యాయ వ్యవస్థ దళితులకు వ్యతిరేకంగా కుల ఫ్యూడల్ పునాది పై నిర్మితమై పనిచేస్తుందో ఏ విధంగా వారి పట్ల కక్ష్య సాధింపు మరియు అణచివేత చర్యలకు పాల్పడుతుందో ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది.ఇంతకు ముందు విద్యా సంస్థలలో కుల వివక్షత అరికట్టడానికి ఉద్దేశించిన యూజిసి నిబంధనల పై కూడా స్టే విధించింది.అందుకే మనువాద బ్రాహ్మణీయ కుల భావజాలంతో పనిచేస్తున్న న్యాయ వ్యవస్థ దళితులను నిరంతరం అణగదొక్కుతూ,అవమానిస్తుందో,వివక్షత పాటిస్తుందో ఆ
రిపోర్ట్

తిజీమాలి ఆదివాసులపై జరుపుతున్న దాడులను వెంటనే ఆపివేయాలి

2026 ఏప్రిల్ 9 జన్ చౌక్ ఒడిశాలోని కలహండి జిల్లా, కాందమాల్ గ్రామంలో స్థానిక పోలీసులు,  గూండాలు కలిసి నిర్వహించిన దాడులను, దౌర్జన్యాలను;  గ్రామస్తుల ఇళ్లను ఛిన్నాభిన్నం చేయడం వంటి చర్యలను ప్రోగ్రెసివ్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ తీవ్రంగా ఖండించింది. స్థానిక నివాసితుల నుండి అందిన సమాచారం ప్రకారం, ఏప్రిల్ 7వ తేదీ తెల్లవారుజామున సుమారు 2:00 గంటల సమయంలో, పోలీసులు—కొందరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి—గ్రామంలోకి ప్రవేశించారు. గ్రామస్తులు బయటకు వచ్చినప్పుడు, వారిపై బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పలువురు గ్రామస్తులను కర్రలతో కొట్టారు. ఈ దమనకాండ ఫలితంగా, ఇద్దరు మహిళల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ అణచివేత
వ్యాసాలు

ప్రాణాలని తీస్తూ అభివృద్ది అంటే ఎలా

వేదాంత మైనింగ్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళడం కోసం జరుగుతున్న రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక ఆదివాసీ, దళిత సముదాయాలు నిరసన తెలపడంతో  పోలీసులు వెనుదిరిగారు నికితా జైన్తెలుగు : పద్మ కొండిపర్తి 2026 ఏప్రిల్ 10 ఇళ్లను, ప్రాణాలను, గౌరవాన్ని బలిపెట్టి అభివృద్ధి చేస్తామంటే ఏమవుతుంది? ఒడిశాలోని రాయగడ జిల్లాలో, ఆదివాసీ,  దళిత సముదాయాలు  భారీ పోలీసు అణచివేతను ఎదుర్కోవడంతో కాంతమాల్ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 2026 ఏప్రిల్ 7న, వందలాది మంది పోలీసులు కాంతమాల్ గ్రామంపై ఒక్కసారిగా దండెత్తారు. గ్రామస్తులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న నరేంద్ర అనే కార్యకర్త 'మక్తూబ్'తో మాట్లాడుతూ, ఇళ్లపై దాడి
పత్రికా ప్రకటనలు

దళిత ఎక్స్ ఎంపీపీ లింగప్ప పై దాడి చేసినా సంజీవరెడ్డి గౌడ,బసవరాజప్ప గౌడ లను వెంటనే అరెస్టు చేయాలి.

ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో చేగుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ లింగప్ప పై కులం పేరుతో దూషిస్తూ రాళ్లతో కొట్టి తల పగలగొట్టి, అడ్డువచ్చిన ఆయన భార్య పెద్ద శాంతమ్మను కాళ్లతో తన్ని, కొడుకు మోహన్ కుమార్ ను దాడి చేసి రక్త గాయాల పాలు చేసిన అదే గ్రామానికి చెందిన సంజీవరెడ్డి గౌడ, బసవరాజప్ప గౌడ లను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లింగప్ప ఇంటి ముందు గ్రామ సర్పంచ్  కొడుకు   సంజీవరెడ్డి గౌడ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడంలో భాగంగా గుంతలు తవ్వుతున్న
వ్యాసాలు

తిజిమాలి: అప్రకటిత ఘర్షణ ప్రాంతం

తిజ్మాలి ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలు, ముఖ్యంగా సగాబరి, బంతేజ్, బొండెల్, కంటమాల్, తాలాంపదర్ పరిసరాల్లో సాయుధ పోలీసులు, వాహనాల మోహరింపు విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగురుతున్నాయి. గత మూడేళ్లుగా వేదాంత బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న "మా మాటి మాలి సురక్ష మంచ్" నాయకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో, సుమారు 200 మంది పోలీసులు, పారామిలిటరీ దళాలు వరుసగా మూడు గ్రామాల్లోకి ప్రవేశించి, రాయగడ SDM, కాశీపూర్ JMFC జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను సురక్షా మంచ్ నాయకుల ఇళ్ల గోడలకు అంటించారు. ఫిబ్రవరి 26న వారు
వ్యాసాలు

ఒడిశాలోని రూర్కెలాలో రైల్వే విస్తరణనువ్యతిరేకించిన ఆదివాసీ హత్య: నిర్వాసిత్వ ముప్పు

2026 ఫిబ్రవరి 20 ఒడిశాలోని పశ్చిమ జిల్లా అయినసుందర్‌గఢ్‌లోని రూర్కెలా మున్సిపాలిటీ గుండా వెళుతుంటే... మనకు భారీ పరిశ్రమలు, భవనాలు, మాల్స్, అందమైన ఫుట్‌పాత్‌లతో కూడిన రహదారులు మాత్రమే కనిపిస్తాయి. అయితే, వాటికి ఆవల దశాబ్దాలుగా ఒక పోరాటం సాగుతోంది, కానీ అది ప్రధాన స్రవంతిలో ఎక్కడా కనిపించదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎస్‌ఎఐఎల్) నడుపుతున్న భారీ రూర్కెలా స్టీల్ ప్లాంట్  కారణంగా రూర్కెలాను ఒడిశా "ఉక్కు నగరం" (ఇస్పాత్ నగర్) గా పిలుస్తారు. భారతదేశ పారిశ్రామిక "అభివృద్ధి"కి, అపారమైన ఖనిజ నిక్షేపాలకు రూర్కెలా ఒక కేంద్రంగా గుర్తింపు పొందింది.
Uncategorized వ్యాసాలు

ఒడిశాలోని లాంజిబెర్నా గ్రామంలో దాల్మియా గనితవ్వకాల విస్తరణ : గ్రామస్తుల నిరసన

2026 మార్చి 5  (ఈ కథనం ఒడిశాలో గని తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న వివిధ ఉద్యమాలు, సమస్యలపై క్షేత్రస్థాయి నివేదికల పరంపరలో ఒక భాగం.) మేరీ జెమా కుల్లుకు ఈ మధ్య నిద్ర పట్టడం లేదు. రాత్రిపూట కొంచెం శబ్దం వచ్చినా ఆమెకు మెలకువ వచ్చేస్తోంది. ఆమె ఇంటికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో నిరంతరం వినిపించే డ్రిల్లింగ్ శబ్దాలు... వారు తమ ఇంట్లోకి వచ్చారని, దానిని ధ్వంసం చేస్తున్నారనే నిజాన్ని ప్రతి క్షణం ఆమెకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. 68 ఏళ్ల కుల్లు, ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రూర్కెలాకు గంట దూరంలో ఉన్న 'లంజీబెర్నా' అనే చిన్న