కశ్మీర్ పై భారత పాలనను నిరాకరించినందుకు మా అమ్మకు శిక్ష
2026 మార్చ్ 26 కొద్ది రోజుల క్రితం, నా తల్లి ఆసియా అంద్రాబీ (64) కి ఒక న్యాయమూర్తి మూడు జీవితకాల శిక్షలను విధించడాన్ని నేను స్వయంగా చూసాను. భారతదేశం అమలు చేసిన అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటైన నిబంధనల కింద ఇది వాస్తవానికి మరణశిక్షతో సమానం. కశ్మీర్ స్వయం నిర్ణయాధికార పోరాటంలో పాల్గొన్నందుకు గాను, జీవిత ఖైదు విధించబడిన మొదటి కశ్మీరీ మహిళ నా తల్లి. నా తల్లితో పాటు, ఆమె సహచరులు నహిదా నస్రీన్, సోఫీ ఫెహ్మీదాలకు ముప్పై ఏళ్ల జైలు శిక్షను వేసారు. వీరి ముగ్గురినీ 2018లో అరెస్టు చేసారు; విచారణ ఎనిమిదేళ్ల పాటు










