వ్యాసాలు

మేధావులూ వారి నైతిక బాధ్యతలూ

(ఇది కా. కెవిఆర్ శ‌త‌జ‌యంతి సంవ‌త్స‌రం. ఈ ఏడాదంతా ఆయ‌న ర‌చ‌న‌ల్లోంచి ఈ త‌రానికి కొన్ని వ్యాసాలు *కెవిఆర్ పాఠం* అనే శీర్షిక‌లో పాఠ‌కుల‌కు అందిస్తాం.. వ‌సంత‌మేఘం టీం) ఇంగ్లీషు భాషలోని ‘ఇంటలెక్చువల’కు సమానార్థకంగా ‘మేధావి’ అనే మాటను, రష్యన్ భాషనుంచి ఇంగ్లీషులోకివచ్చిన ‘ఇంటెలిజన్షియా’కు సమానార్థకంగా ‘బుద్ధిజీవులు’ అనే మాటను తెలుగులో వాడుతున్నాము. మొదటి మాటకు person possessing a good understanding, enlightened person  అని, రెండవదానికి the part of a nation that aspries to independent thinking అనిన్నీ ‘ద కన్సైజ్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ’ అర్థం చెబుతున్నది. ‘ది హిందూ’ పత్రిక (1967
కవిత్వం

భూమి నవ్వుతోంది

ఇది దుఃఖం ఒరుపుతోగుండె కరిగిపోయే కాలం కదావారి గురి పాఠశాలలపైనేఎందుకు ఉంటుందోఒకమారు ఆలోచించామాపసిగుడ్డుల యెగిరిపడినమాంసపు ముద్దల మధ్యవాళ్ళు ఆకలిని తీర్చుకునేపాలకులయ్యారుఇది ఆయిల్కోసమో గ్యాస్ కోసమోజరుగుతున్న యుద్ధం కాదుతమకెదురు నిలిచిన జాతినిసమూలంగా నాశనం చేసే కుట్ర కదాఏ మూల తలెత్తి నిలబడినా ప్రశ్నించే మనుషుల హృదయాలనుచీల్చే యుద్ధ పిపాసుల దాహమిదిమధ్య ప్రాచ్యం నుండిమధ్య భారతం వరకు కురిసిన బాంబులవెనక దాగిన నిజం కదాద్రోహమొక్కటే వారికికనుచూపుగా మారిందిగుండె జారిన మనుషులనుచూపుతూ రేపు లేదనివెలుగు రాదనీఆకాశాన్ని ఆక్రమించామనిమిడిసి పడుతున్నారుభూమి నవ్వుతూబద్ధలైన దేహంలోంచిమొలకేత్తే చిగురునుప్రసవిస్తోంది...