సాహిత్యం వ్యాసాలు

రాజ్యం సృజ‌నాత్మ‌క‌త‌కు వ్య‌తిరేకి

సవ్యసాచిదేవ్     కవి, రచయిత, విమర్శకుడు ఇప్పుడు నేను చెప్పేది కొత్త కాదు.సృజనాత్మకత‌ అంటే కొత్తది, ప్రగతిశీలకమైనది. దానికి  రాజ్యం వ్య‌తిరేకి. రాజ్యం ఎల్ల‌ప్ప‌డు సృజ‌నాత్మ‌క‌త‌ను  వ్యతిరేకిస్తది. అది పోలీసు , అధికార యంత్రాంగం ద్వారా నిషేధం తెస్తుంది. చరిత్రను వెనక్కి తిప్పే ప్రయత్నం జరుగుతుంది. ఉపన్యాసాలు, పుస్తకాలు, సామాజిక మాధ్య‌మాలను బాగా వాడుకొని పాత కాలమే బావుంటదని చెప్తారు. నాజీల లాగ ప్రజాస్వామ్య గొంతుల్ని వినరు. తమకు మద్దతుగా ప్రజలని కూడగడుతారు. అంతిమంగా తామే ప్రజాస్వామ్య వాదులమని చెప్పుకుంటారు.హిందువులు కానీ వారిపై దాడి చేస్తారు. వ్యక్తిగత విషయాలపై బురద చల్లుతారు. కాంగ్రెస్ కాలం లో తమను బాహాటంగా
ఈబుక్స్ మీరీ పుస్తకం చదివారా ?

మీరీ పుస్తకం చదివారా ?

సుప్ర‌సిద్ధ మార్క్సిస్టు లెనినిస్టు మేధావి సునీతికుమార్ ఘోష్ రాసిన పుస్త‌కం *భార‌త బ‌డా బూర్జువా వ‌ర్గం.పుట్టుక -పెరుగుద‌ల‌-స్వ‌భావం*.  ఈ పుస్త‌కం తెలుగు అనువాదం పిడిఎఫ్ మీ కోసం. విప్ల‌వాభిమానులు, కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ అర్థ శాస్త్ర విద్యార్థులు త‌ప్ప‌క చ‌ద‌వాల్పిన పుస్త‌కం ఇది. కా. సునీతి దీన్ని 1985లో రాశారు. 2012లో మ‌రింత తాజా స‌మాచారంతో రెండో కూర్పు విడుద‌ల చేశారు. దానికి ఆయ‌న ఒక సుదీర్ఘ‌మైన ముందుమాట రాశారు. ఇప్ప‌డు మీకు అందిస్తున్న‌ది ఆ ముందుమాటే. కా. ఆశాల‌త ఈ పుస్త‌కాన్నిచ‌క్క‌గా తెలుగులోకి అనువ‌దించారు. 2018లో విప్ల‌వ ర‌చ‌యితల సంఘం  ప్ర‌చురించింది. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాలు, భార‌త బూర్జువా వ‌ర్గ స్వ‌భావం,  విప్ల‌వ ద‌శ
కాలమ్స్ కవి నడిచిన దారి

మిట్టిండ్ల క‌య్య‌ల నుంచి..

బతికిన బతుకులో ప్రేమకంటే ఎక్కువ ఛీత్కారాలే మెండుగా గురైనవాడు,ఆనందం కన్నా దుఃఖాల్ని ఎక్కువగా మోసుకుని తిరిగిన వాడు,చుట్టుముట్టిన పేదరికంలో ఈదినవాడు, చదువుకోవడం ఎంతో ఇష్టం వున్నా చదువుకునే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించకపోతే దీపంపట్టి మరీ వెదికి చదువును చేతులారా పట్టుకున్నవాడు, ఈ దేశంలో ఈ మారుమూల పల్లెలో వెనకకు నెట్టివేయబడిన దళిత వాడల్లో రెండు మూడు దశాబ్దాల ముందు ఖచ్చితంగా కనిపించడం వాస్తవవమైతే,! అచ్చం అటువంటి అనుభవాల్లోంచి, అటువంటి అవమానలోంచి,అటువంటి పేదరికంలోంచి,జీవిత పోరాటంలోంచి ఇప్పటిదాకా నడిచిన పల్లిపట్టు నాగరాజుగా మీ ముందు నిలబడి నాలుగు మాటలు పంచుకునే అవకాశం ఇచ్చిన వసంత మేఘం సంపాదకులకు ధ‌న్య‌వాదాలు చెప్పుకుంటూ... నేను
కాలమ్స్ బహుజనం

ముస్లిం బ‌తుకు గుబాళింపు

ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం ‘మొహర్‌’. షాజహానా సంపాదకత్వంలో పర్‌స్పెక్టివ్స్‌ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో మొత్తం 26 కథలున్నాయి. ముందు పేజిలో చెప్పినట్టుగా మొహర్‌ ` అనుమానాల మధ్య, అభద్రతల మధ్య, అసమానతల మధ్య, అణిచివేతల మధ్య అనేక గాయాలను మోసుకుంటూ ఉనికి కోసం పెనుగులాడే ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రకటన. ‘వెతుకులాట’ శీర్షికతో ఎ.కె. ప్రభాకర్‌ చక్కని ముందుమాట రాశారు. ‘తెలుగు సాహిత్యంపై కొత్త ముద్ర’గా షాజహానా పుస్తకాన్ని సంక్షిప్తంగా వివరించారు, తొలి పేజీలలో. ఇక పుస్తకం లోపలికి వెళ్తే ‘మొహర్‌’ కథల్లో రచయిత్రులు అనేక అంశాలను స్పృశించారు. కొన్ని కథల్లో కేంద్రీకృత
సంభాషణ

బందీ అయిన గణతంత్ర రాజ్యంలో ఒక ఖైదీ భార్య

భర్తను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఆ గృహిణి జీవిత కథనం తన ముగ్గురు పిల్లలను నిద్ర లేపడం, వారిని, అందులోనూ ప్రత్యేకించి ఏడేళ్ల పిల్లవాడిని ఆన్‌లైన్ తరగతులకు కూర్చోబెట్టడం,  వారు తమతమ స్థలాల్లోనే కూర్చునేట్లుగా చూడడం, క్లాసు జరుగుతున్నప్పుడు వీడియో గేమ్‌లు ఆడకుండా, నిద్రమత్తులోకి జారిపోకుండా లేదా కొట్లాడుకోకుండా చూసుకోవడం లాంటి పనులతో ఉదయం పూట కొంచెం హడావిడిగా ఉంటుంది: గత 17 నెలలుగా ఇదంతా ఒంటరిగా చేస్తూండడంతో ఆ హడావిడి మరింత ఎక్కువవుతుంది. ఆమెకు పెళ్లై 14 వ సంవత్సరాలయింది. 2007 లో వివాహ ప్రతిపాదన వచ్చినప్పుడు, కనీసం ఒక్కసారైనా విడిగా కలిసి మాట్లాడుకోవాలనుకున్నారు,
సాహిత్యం కథలు

నిన్న ఈవేళ

(ఈ క‌థ ఆంధ్ర‌ప్ర‌భ స‌చిత్ర‌వార ప‌త్రిక 10.4.74 సంచిక‌లో అచ్చ‌యింది. విర‌సం ప్ర‌చురించిన చెర‌బండ‌రాజు సాహిత్య స‌ర్వ‌స్వంలోని క‌థా సంపుటంలో ఇది చోటు చేసుకోలేదు. మిత్రుడు వంగ‌ల సంప‌త్‌రెడ్డి చెర‌బండ‌రాజు సాహిత్యంపై త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా దీన్ని గుర్తించారు. శ్రీ‌కాకుళం క‌థా నిలం నిర్వాహ‌కులు దీన్ని పంపించారు. సంప‌త్‌రెడ్డికి, క‌థానిల‌యం నిర్వాహ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు.- వ‌సంత‌మేఘం టీ) చేను చచ్చిపోయింది. కాలువ ఎండిపోయింది. చెరువు ఇంకిపోయింది. ఊళ్ళో కూలి జనం నాలుకల మీది తడి ఆరిపోయింది. వాళ్ళ ఎముకల్లో గలగల. కళ్ళలో గరగర. విరగ్గొట్టిన వేపకొమ్మల్లా ఎండిపోయి, కాలు పెడితే పటపటా విరిగిపోయే దశలో ఎవరి గూళ్ళలో కాళ్ళు, ఎవరి
సాహిత్యం కవిత్వం

అంతే బాధలోంచి

నమ్మకం చిట్లిన చోటకన్నీటి బోట్లను కుట్టుకుంటూఆశల పడవను నడుపుతున్నాను గాయపడిన అనుభవాలలోంచికొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను కొంత ప్రయాణంలోనిజాలు తేలియాడినపుడువ్యూహాలు పదును తేరాలి కాలాన్ని ఎదురీదడమంటేమార్పులను అవగతం చేసుకోవటమే దారులు ఇరుకవుతున్నప్పుడుఆలోచనలు పదునెక్కాలి ఒక్కోదానికి ఒక్కో హద్దు గీసిఅనంత విశ్వాన్ని గుండెల్లోంచి తీసిఅనేకానేకాలుగా దర్శించాలి చీమ బలం చూసికన్నులెగరేసిఆకాశాన్ని ఎత్తగలంఆకాశం పైకి ఎక్కగలం లక్ష్యం కుదుపుతున్నపుడురహ దారులు ఇట్టే చిగురిస్తాయి ఊహకు రూపం ఇవ్వడమంటేకొన్ని కన్నీటి మెట్లు ఎక్కటమే . ఇప్పుడు అంతే బాధలోంచి లేచితీరాలకి చేరిఇక సమీరాలు అందివ్వాల్సిన సందర్భంలోంచిచినుకుల్లా కురిసిన ఒక నేను .
సంపాదకీయం

మ‌న జీవితాల్లోకి చొర‌బాటు

అత్యంత శక్తివంతుడ‌ని చెప్పుకోబడుతున్న నాయకుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఆవును అనో,  కాదు అనో చెప్పలేకపోతున్నాడు. ఈ ఒక్క ప్రశ్నకే కాదు ఇప్పటిదాకా అయన దేనికీ జవాబు ఇవ్వలేదు.  కానీ ఆయన భక్తుల దృష్టిలో ఆయ‌న అత్యంత శక్తివంతుడు. ప్రపంచ అధినేతలను సైతం భ‌యపెట్టగలిగిన వాడు. అయన ఏమి చేసిన దేశం కోసం చేస్తాడని ప్రచారం చేసుకోగ‌ల‌వాడు. కానీ ఇప్పటిదాకా ఒక్క మీడియా సమావేశాన్ని కూడా ఎదుర్కోలేదు. అయితే  కంట కన్నీరు కారుస్తూ దేశభక్తి రాగాలాపన చేస్తుంటాడు. ఇప్పుడు పార్లమెంటులో దేనికీ జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. అంతగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్న ప్రశ్న భారత
సాహిత్యం కవిత్వం

ఉదయం

అర్ధరాత్రి అమాసచీకట్లో ఓ జెండా దిగిందిఓ జెండా ఎగిరింది అలసిన మేనులుఆదమరచి గాఢ నిద్ర లోఅధికార మార్పిడి చిమ్మ చీకట్లో ఏళ్ళు గడుస్తున్నాఆ అధికారం కిందికి దిగలేదుకిందోడు పైకెక్క లేదు ఊరిస్తూ ఉడికిస్తూఫలాలు అందీ అందిస్తున్నట్లునటిస్తూ అధికారం అక్కడే బహు చక్కగా రాచరికం పోలేదురాజ్యాంగం పుటల్లోనేదోబూచులాడుతుందివర్గ వైషమ్యాల సృష్ఠి లో ఆరితేరిగద్దె పై రాబందుల వికట్టహాసం సమానత్వం ఓ పగటి కలఅది తీరని దాహంపదిహేను వస్తుందివీధి వీధి న ఓ జెండారెప రెప లాడుతుందిసాయంకాలం దించబడుతుంది సూరీడు మౌనంగా కొండల మాటున దిగుతుండుఇంకెన్ని ఉదయాలు ఉదయిస్తేనిజమైన స్వరాజ్యం ఉదయిస్తుందని మథన పడుతూచాల్లే పో పో అంటూచందమామ కసిరిందివెన్నెల కురిపిస్తుందేమో