కాలమ్స్ * వి క‌లం*

వైకల్యం ఒక అస్థిత్వం

  ఇది క‌రుణ అనుభ‌వం.. అవ‌గాహ‌న‌.. సిద్ధాంత దృక్ప‌థం. త‌న‌లోకి తాను చూసుకుంటూ ఈ ప్ర‌పంచంలోకి, త‌న వంటి వారి ప్ర‌త్యేక అస్థిత్వంలోంచి స‌క‌ల పీడిత అస్థిత్వాల్లోకి క‌రుణ విస్త‌రించిన తీరు ఇది. ఒక‌ మార్క్సిస్టు మేధావి విస్త‌రింప‌ద‌ల్చుకున్న వైక‌ల్య రాజ‌కీయ‌మిది.   అర్థాంత‌రంగా ఆగిపోయిన ఆయ‌న ఆలోచ‌నా ధార ఇది.  వ‌సంత‌మేఘం అంత‌ర్జాల ప‌త్రిక ఆరంభమైన‌ప్ప‌టి నుంచి క‌రుణ అనేక అభిప్రాయాలు పంచుకునేవాడు. మా కోరిక మేర‌కు ఒక కాలం రాస్తాన‌న్నారు. ఏం రాయాలి? అని అనేక ఆలోచ‌న‌లు పంచుకున్నారు. చివ‌రికి *వైక‌ల్య అస్తిత్వ రాజ‌కీయాలు* రాస్తాన‌న్నారు. మ‌ర‌ణానికి ముందు రోజు *వి క‌లం* కాలానికి తొలి ర‌చ‌న పంపించారు. అందులో ఒక
సంభాషణ

అపురూప మాన‌వి సుమ‌తి మీకు తెలుసా?

సుమ‌తి గురించి అంద‌రికీ తెలియాలి. అంత అద్భుత మ‌హిళ ఆమె. మొద‌ట ఆమె చాలా మామూలు మ‌నిషి. కానీ లోకాన్ని తెలుసుకున్న‌ది. త‌న‌నుతాను తెలుసుకున్న‌ది. పితృస్వామ్యాన్ని అర్థం చేసుకున్న‌ది. మాతృత్వ భావ‌న‌ను స‌హితం అధిగ‌మించి నూత‌న మాన‌వి అయిన‌ది.  వ్య‌వ‌స్థ సంకెళ్ల‌ను తెంచుకున్న‌ది.  ఎంత ప‌రిణామం జ‌రిగి ఉండాలి!  భౌతిక‌, భావ‌జాల ప్ర‌పంచంలో ప్ర‌జ‌లు సాగిస్తున్న మ‌హాద్భ‌త పోరాటాల ప్ర‌మేయం లేకుండా ఆమె కామ్రేడ్ సుమ‌తిగా ప‌రివ‌ర్త‌న చెందాదా?  మాన‌వ‌జీవితాన్ని విలువ‌ల‌, విశ్వాసాల ప‌రివ‌ర్త‌నా క్ర‌మంలో చూసే సాహిత్య‌కారుల‌కు త‌ప్ప‌క సుమ‌తి తెలిసి ఉండాలి. అందుకే నాకు తెలిసిన కామ్రేడ్ సుమ‌తి గురించి నాలుగు మాట‌లు మీతో.  సుమతి 
ఇంటర్వ్యూ

ఉపా లేకుంటే ఈ రాజ్యం మ‌నుగ‌డ క‌ష్ట‌మే

దేశ‌మంతా ఉపా విస్త‌రిస్తోంది. ఎవ‌రి మీదైనా చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం కింద కేసు పెట్ట‌వ‌చ్చు. ఎవ‌రి మీదికైనా ఎన్ఐఏ అనే ద‌ర్యాప్తు సంస్థ వెళ్ల‌వ‌చ్చు. ఇదంతా కాక‌తాళీయంగా జ‌రుగుతున్న‌ది కాద‌ని, దీని వెనుక భార‌త రాజ‌కీయార్థిక వ్య‌వ‌స్థ‌లోని సంక్షోభాలు, ప్ర‌జా పోరాటాల ఒత్తిళ్లు  ఉన్నాయ‌ని, యుఏపీలే లాంటి పాసిస్టు చ‌ట్టాలు లేకుంటే భార‌త రాజ్యం మ‌నుగ‌డ సాధ్యం కాని ప‌రిస్థ‌తి ఏర్ప‌డింద‌ని పౌర‌హ‌క్కుల నాయ‌కుడు చిలుకా చంద్ర‌శేఖ‌ర్ అంటున్నారు.  1) యుఏపీఏ చట్టం తీసుకుని రావటం వెనుక ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం ఏమిటి ?   ప్రభుత్వాలు తమ రాజకీయ సుస్థిర‌త  కోసం చట్టాలను చేస్తూ ఉంటాయి. ఈ
వ్యాసాలు

రావణ కాష్టం – సోముని డప్పు

కా. నర్సన్న  స్మృతిలో... నర్సన్న గురించి రాయడమంటే దిగంబర కవులలో చెరబండరాజు గురించి రాయడం. అల్వాల్‌లో ఆరోజుల్లో మిలిటరీ సప్లయ్‌లలో పనిచేసిన కేరళకు చెందిన కుట్టి అనే విప్లవ సంస్కృతిలో ఆసక్తి ఉన్న వ్యక్తి గురించి రాయడం. అల్వాల్‌కు పెంపకం వచ్చిన బి. నర్సింగరావు గురించి రాయడం. వీళ్లను ఒక చోటకు తెచ్చిన కె.ఎస్‌. గురించి రాయడం. వీరిలో నాకు తెలిసిన నర్సన్నకు అటు నర్సింగరావుతో, ఇటు చెరబండరాజుతో ఉన్న పరిచయాలు, స్నేహాలు - సంబంధాలు. వీళ్లంతా నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమంతో ప్రభావితమయిన వాళ్లు. వీళ్లలో నర్సింగరావు దిగంబర కవులతో కూడా ప్రభావితమయిన వాడు. నెహ్రూ భావజాలం ఉన్న
అనువాదాలు సంభాషణ

‘అతని మరణం వారికి కేవలం ఒక గణాంకం మాత్రమే’

‘ఇతర దేశాలలో ఒకరిని పొరపాటుగా విచారించినట్లయితే వారు పోలీసులపై లేదా ప్రభుత్వంపై కేసు పెట్టవచ్చు’ [ప్రధానమంత్రి నరేంద్ర మోడిని హత్య చేయడానికి కుట్ర పన్నారనే పోలీసులు చేస్తున్న ఆరోపణతో సహా యితర ఆరోపణలతో 2018 నుండి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద విచారణ లేకుండా జైల్లో వున్న  కవి వరవరరావు, ప్రొఫెసర్ షోమాసేన్‌లకు సీనియర్ అడ్వకేట్ ఆనంద్ ఆనంద్ గ్రోవర్ న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహించారు.] స్టాన్‌స్వామి మరణం పట్ల మీ స్పందన ఏమిటి? ఇది మొత్తంగా నేర న్యాయవ్యవస్థ వైఫల్యం. పోలీసులు, ప్రాసిక్యూటర్, జైలు లేదా కోర్టు- అన్నిటి చట్ట నియమాలు విచ్ఛిన్నమై పోయాయి! అవి చట్ట
సాహిత్యం కవిత్వం

దండాలు స్వామి

దక్షిణాన పుట్టినవివిక్త కొండల్లో ఏపుగా పెరిగినరాక్ ఫోర్ట్ ఒరిగిపోయిన చెట్టంత మనిషికన్నీళ్ళతో కావేరి నిండిపోయింది చదివిన వేదాంత శాస్త్రంగొల్లుమని ప్రవచనాలను వెదజల్లుతుంది సామాజిక శాస్త్రం ఫిలిప్పీన్స్ నేర్పితేఝార్ఖండ్ క్షేత్రమయ్యింది వనాంచల్ ప్రతి మొక్కవంగి సలాం చేస్తుంది గజరాజులు గజగజ వణుకుతున్నాయిఅండగా నిలిచిన స్వామి లేడని తాను ముందుండి వేసిన ప్రతి అడుగుఆదివాసీ బతుకుల వెలుగు నింప ప్రయత్నం హక్కులకై సంధించిన ప్రశ్నలేతన చావుకి కారణమౌతుంటేపుటల్లోని రాజ్యాంగ ప్రతులుపటపట రాల్చాయి చుక్కలు వణుకుతున్న చేతులుతాగలేని నీరు ఒలుకుతుంటేఓ స్ట్రా ఇవ్వమన్నా ఇవ్వలేని న్యాయం పండు ముదుసలిపార్కిన్సన్ తో జైలు హాస్పిటల్లో..అయినా ఆఖరి శ్వాస దాకాచెద‌ర‌ని ఆదివాసీ స్వ‌ప్నంఅమరుడా! దండం!!
కాలమ్స్ సమకాలీనం

టిప్పుసుల్తాన్ పై హిందూత్వ దాడి

గత జూన్ నెలలో కడప జిల్లా పొద్దుటూర్ పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా మొదలు పెట్టిన తొలి దశ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అడ్డుకున్నది. ఇది కేవలం ముస్లింలను సంతృప్తి పరచడానికి ఉద్దేశించిన కార్యక్రమంగా ఆ పార్టీ పేర్కొన్నది. టిప్పు సుల్తాన్ హిందూ మత ద్వేషి అని, హిoదువులను ఊచకోత కోయించిన హంతకుడు, హిందు స్త్రీల పైన అత్యాచారాలు జరిపించిన దుర్మార్గుడు, అతనొక ఉన్మాది అని అసలు ఈ దేశ వాస్తవ్యుడే కాదనేది బీజేపీ వాదన. అలాంటి చారిత్రక చెడ్డ పురుషుని విగ్రహం నెలకొల్పడం జాతీయ స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తున్నది. నిజానికి బీజేపీ
కాలమ్స్ కథా తెలంగాణ

‘ఎర్రదుక్కి’లో పాలమూరు వలస దు:ఖం

సమాజంతో సంబంధం కలిగిన రచయితలు మాత్రమే తమ సాహిత్య సృజనలోకి సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా ఎంపిక చేసుకొని ప్రజల్ని ఆలోచింపచేస్తారు. సామాజిక బాధ్యత, నిబద్దత కలిగిన రచయిత అట్టడుగు శ్రామిక వర్గాలవైపు నిలబడి అక్షరీకరిస్తాడు. ఇలాంటి కోవకు చెందినవారే  నాగర్‍కర్నూల్‍ జిల్లా అచ్చంపేటకు చెందిన రచయిత మడుమనుకల నారాయణ. పాలమూరు అధ్యయన వేదికలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న నారాయణ వేదిక ద్వారా పొందిన సామాజిక జ్ఞానంతో కవిత్వం, పాటలు, కథల ద్వారా సాహిత్య సృజనతో సామాజిక చలనాలను ఆవిష్కరించారు. రచయితగా తన అనుభవాలను, తన చుట్టు జరుగుతున్న పరిణామాలను సమాజంతో పంచుకోవడానికి నారాయణ కథా పక్రియను ఎంచుకున్నారు. ‘ఎర్రదుక్కి’
సాహిత్యం కవిత్వం

ప్రేమికుల

ఇసక తిన్నెల మీదఇనుపబూట్ల మహమ్మారినితరిమి కొట్టినిండు ఎడారిలోనీటిని నింపినప్రేమ మనదిగాలికి తాడు కట్టిగండ్ర గొడ్డలి తెచ్చివిష వాయువును నరికిగరికపూల వనంలోనిద్రించిన ధీరత్వం మనదిఅలసిన అడవిని లేపిపాటల పరవళ్ళు తెచ్చిదండోరా మ్రోగించిననేర్పు మనదిడియర్ఈ సుందరమధురానుభూతులుచరిత్ర తొలిపొద్దులోమహోత్తర విప్లవ జ్వాలలైఎగిసిపడుతాయి.
కవిత్వం

నువ్వే కావాలి

ఎందుకో నువ్వంటేతెగ పిచ్చితీగలా అల్లుకు పోయిలోలోన ప్రకంపనలు సృష్టిస్తావు నిన్నునాలో సాన బట్టుకుంటూపదిలంగా దాచుకుంటా నువ్వే నా చుట్టూపెట్టని కోటవైనా రక్షణ గా ఎల్లవేళలా నువ్వే లేకపోతేనేను అజ్ఞాని గాఎక్కడ బడితే అక్కడ తిరిగే వాడ్నినన్నో మనిషి గా నిలబెట్టినది నీవే నాకు నేనుగాఊహ తెలిసిన దగ్గరి నుండినీ చుట్టే నా పరిభ్రమణంఅదే నా ఉజ్జ్వల భవిష్యత్తు కిరాచ బాట పరిచింది ఏదైనా తెలుసుకోవాలంటేనీవే నా ఆధారంతరాలుగా నీవూ నేనూకలిసి సాగామనే ఆలోచనలునన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటేఇలాగే భవిష్యత్తు లో కూడాసాగాలనే తాపత్రయంలో స్వార్థమున్నాతప్పట్లేదు నీ రూపం అపురూపంనాలో చెరగని రూపంచెక్కుకుంటూ పోలేనుఎప్పటికప్పుడు చెక్కక తప్పదుచెక్కితేనే నీ విలువ