వ్యాసాలు అనువాదాలు

స్టాన్‌స్వామి తొలిప్రేమ

"ఆదివాసీల్లో గల సమానత్వం,సమిష్టిభావం,నిర్ణయాత్మకశక్తి  చూసినాంక నాలో కొత్త చైతన్యం పొడసూపింది. "...స్టాన్ స్వామి..గత డెబ్బయి సంవత్సరాల సుదీర్ఘ కాలంలో,నిరంతరం ఆదివాసీలహక్కులకోసంపోరాడిన స్టాన్లీసాస్ లోర్దుస్వామి(స్టాన్ స్వామి)నిఅక్టోబరు 8,నాడు అరెస్టుచేయడం మధ్యభారతాన్ని కుదిపేసిందిఆయన ఎనభై నాలుగేళ్ళ వృద్ధుడు.పైగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడ్తున్నాడు..అట్లాంటి మనిషిని మావోయిస్టు సభ్యుడనీ,భీమా- కోరేగావ్ కేసులో నిందితుడనీ తీవ్ర నేరాలుమోపి జైలుకు పంపించారు(ఆయన కస్టడీ లో ఉన్న తొమ్మిది నెలల కాలం ఒక్క సారి గూడ ఇంటరాగేట్ చేయలేదు..)ఇదంతా ఆయన సన్నిహితులకు దారుణ మనిపించ వొచ్చు..ఇంతకూ స్టాన్లీస్వామి మంత్రమేమిటి?వేలాది మందిని ప్రభావితం జేసిన ఆయన వ్యక్తి త్వ సూత్రమేమిటి?  ఆయన కుల మత ప్రాంతాల కతీతంగా న్యాయం
వ్యాసాలు

‘మనోధర్మపరాగం’- పాఠకుడి నోట్స్

మా నాయనమ్మ పేరు వంగళాంబ. వాళ్ళ నాన్న పాలఘాట్ రామనాథఅయ్యర్. తమిళుడు. తెలుగు, తమిళనాడులు మదరాసు ప్రెసిడెన్సీగా వున్నప్పుడు కర్నూలు జిల్లాలో డోన్‌ అనబడే ద్రోణాచలం గ్రామానికి వచ్చి గడియారాల మరమ్మత్తు షాపు పెట్టుకున్నాడు. ముగ్గురు కూతుళ్లకు ఇక్కడి తెలుగు సంబంధాలే చేశాడు. పేదరికం వల్లనో ఏమో మా నాయనమ్మ మా తాతకు (జేనాన/జేజబ్బ) రెండవభార్యగా వచ్చింది. (ఆయన మొదటి భార్య పురిటిలో చనిపోయింది)కూతుళ్ళ పెళ్లిళ్లు అయిపోయాక ఆ కుటుంబం మదరాసుకు తరలిపోయింది. ఆ తరువాత నాయనమ్మకు పుట్టింటితో ఏ సంబంధాలూ లేకపోయాయి.ఎప్పుడైనా మూడు,నాలగేళ్లకోసారి ఆమె అక్క వచ్చి వారం రోజులుండేది.చెల్లెలు అసలు వచ్చేదేకాదు. అంతులేని ఇంటిబరువు, కుటుంబ
కవిత్వం

వర్షం లో రైతు

వాలే చినుకు లోఆశగా తడిశాను .బురద సాలుల్లో నారుగా మురిసాను .ఎండిన కలలని తడుపుతూవడివడిగా దున్నుకుంటున్నాను .ఎండలు శపిస్తాయోవానలు ముంచేస్తాయోకళ్ళనిండా  మేఘాలునిండి ఉన్నాయి .గుండెనిండా ధైర్యంపిండుకున్నాను .కాసింత ఉరుములు  భయపెడతాయికాసిన్ని పిడుగులు కూల్చేస్తాయికాళ్ళు మట్టి పెళ్ళల్లోఉదయించందేమనసు కుదుటపడదు .రెప్పల వాకిట్లోతెప్పలుగా కదిలే దృశ్యాల వెంటఆకు పచ్చని కలలుఊరటనిస్తాయి.ఊపిరి పోసినాఊపిరి తీసినామట్టిని నమ్ముకునేరైతు  జీవితం ముగుస్తుంది .  
సాహిత్యం కవిత్వం

ప్రతిధ్వని

నేను ఉరిమితేనీ సింహాసనం కదిలిందినేను వర్షిస్తేవసంతం పులకించిందినాలుగు గోడల బందీఖాననా ఆలోచల్ని ఆపలేదుఅవి ప్రాణ వాయువులాప్రజల ఉచ్వాస నిశ్వాసలనుతడుముతూనే ఉంటాయినేను నిర్జీవంగాఇచ్చట వాలిపోలేదునా నినాదాలుప్రపంచ వ్యాపితంగాప్రతి ద్వనిస్తూనే ఉంటాయినేను స్వేచ్ఛా మానవినిఏ చెరసాలకు లొంగే దాన్ని కాదు
అనువాదాలు సంభాషణ

న్యాయవ్యవస్థపై ఒక మచ్చ

స్టాన్ స్వామి మరణం చాలా ఆందోళన కలిగించే సమస్యలను లేవనెత్తుతోది ఫాదర్ స్టాన్‌స్వామి కస్టడీ మరణం గురించి  వివిధ ప్రతిస్పందనలు వచ్చాయి. ఆదివాసీల, పీడిత ప్రజల హక్కుల కోసం పనిచేసే ఎనభై ఏళ్ళ వయసున్న సామాజిక కార్యకర్త కార్యకలాపాల గురించి తెలిసిన వారు అతను మరణానికి ఎంతో బాధపడుతున్నారు. చట్టాన్ని అమలుచేసే యంత్రాంగం, జైలు పరిపాలనా అతని పట్ల వ్యవహరించిన కఠినమైన, అమానవీయ ప్రవర్తన సంబంధీకులకు ఎంతో వేదన కలిగించింది. కానీ ప్రాసిక్యూషన్ చేసిన "గంభీర, తీవ్రమైన" ఆరోపణలమీద ఆధారపడి నిర్దిష్ట న్యాయస్థానం తీవ్ర అనారోగ్యంతో ఉన్న జీసట్ ప్రీస్ట్‌‌కి బెయిల్ నిరాకరించడమనేది మరింత వేదన కలిగించే విషయం.
కాలమ్స్ కొత్త కవిత్వం

అనేక అస్థిత్వాల కలనేత యాలై పూడ్చింది

కవిత్వం గురించి మాట్లాడుతున్నాప్పుడు ఇటివల చదివిన  కవితా సంపుటులు జ్నాపకమౌతున్నాయి.అజంతా స్వప్న లిపి .పల్లె పట్టు నాగరాజు యాలై పూడ్చింది. .జీవిత కాలమంతా నలభై కవితలను రాసి కవిత్వ స్వప్నలిపిని  వదిలివెళ్లిన అజంతా ,వర్తమాన కాలంలో నిలబడి కవితా రచనలో వున్న పల్లి పట్టు నాగరాజు. అసలు వీరిద్దరి భాధ ఏమిటి?. వీరి మధ్య సారూప్యత ఏమిటి? అజంతా  కవితా రచన స్థల ,కాలాలు  వేరు .నాగరాజు కవిగా కొనసాగుతున్న కాల సoధర్భం వేరు. కవి వీరిద్ద‌రి  ప్రపంచం, దాని మనుగడ ఒకే స్తితిలో ఉన్నాయా?  అజంతా కవిత్వంలో అంతర్ముఖీనత ఉండవచ్చు. ఆ లోపలి  చూపు సామాజిక శకల౦తో  ముడి
కాలమ్స్ కథ..కథయ్యిందా!

‘పొదగని గుడ్ల‌’లో పర్యావరణ విధ్వంపం

అభివృద్ధి ని అనేక రకాలుగా మాట్లాడుకోవచ్చు.మానవ సౌకర్యాల కల్పనలో అభివృద్ధి అనే ప్రక్రియ మనం వూహించలేనన్ని రూపాలను సంతరించుకుంది. ఆ అభివృద్ధి పాదాల వొత్తిడి కింది ప్రకృతి, వ్యక్తులూ నలిగిపోవడం కూడా అనేక రూపాలుగా వుంది. ఒక వైపునేమో కావాల్సినంత, రావాల్సినంత అభివృద్ధి అందనితనం వెక్కిరిస్తుంటే మరోవైపు అదే అభివృద్ధి కొందరికి యెక్కువగా అంది , దానివల్ల విపరీత పరిణామాలు కూడా చోటుచేసుకోవడం కన్పిస్తుంది. ఈ అసమ అభివృద్ధి మనుషుల జీవితాలను కల్లోలం చేయడంతో పాటు ప్రకృతిలో కూడా దుష్పరిణామాలకు దారితీయడాన్ని సునిశిత దృష్టి గల రచయితలు పట్టుకుంటారు. తమ సృజనతో  చదువరులలో  ఎరుక కల్గిస్తారు.అలాంటి కథ కె.వీ.కూర్మ‌నాథ్ 
కాలమ్స్ కవిత్వంలోకి

కొంచెం స్వేచ్ఛ కోసం క‌వితాలాప‌న

“You need a body to preserve your soul, not a set of abstract principles.”― Ahmed Mostafaచాలా విరామం త‌ర్వాత మ‌ళ్లీ.  క‌విత్వంలోంచి, క‌విత్వంలోకి.  జీవితంలోకి.  ఒకింత ధైర్యంతో  పునః ప్రారంభిస్తున్నాను. శివారెడ్డిగారి గారి కవితను నాకున్న పరిమితులలో మీతో పంచుకోవడం. అదీ ఒక కవితా సంపుటిలోంచి ఒక్క కవితనే. తనొచ్చిన దారిని మరువని వ్యక్తిత్వంతో అదే వాక్యంతో అదే గొంతుతో నిరంతరం జ్వలించడం, అక్షరాకాశంలో  మెరవడం శివారెడ్డి గారి సొంతం. ఇది తనకు తానుగా ఏర్పరచుకున్న దారి. ఆ దారిలో అనేక కొత్త పుంతలను చూపుతూ నడిపించడం తన ప్రత్యేకత. తనకు తానుగా ఎప్పుడూ
కాలమ్స్ కథావరణం

” హత్యకు గురైంది ఎవ‌రు? పిచ్చివాడు అయింది ఎవరు? నిజాలు తెలిసేది ఎప్పటికీ? “

కథలను చివరి వరకూ  బ్రతికించేది..జీవద్భాషే అనిపిస్తుంది ఈ కథలను చదివినప్పుడు.అవును!కథా లక్షణాల బరువులను సూత్రీకరణలను,  నియమాలను, వస్తువు ,శైలి, శిల్పంఇలాంటివి కాసేపు పక్కన పెడితేనికార్సయిన జీవద్భాష లో మనుషులు సహజంగా మలినం లేకుండా మాట్లాడుకుంటే, రచయిత ప్రమేయమే లేదనేంత  సహజత్వం ఉంటేఅవి "మునికాంతనపల్లి" కథలు అవుతాయి.ఇవి కథలు కావు కతలు. ఊహించి రాసినవి కావు, కల్పనలు అసలే కావు. కొంచెం అలా నెల్లూరు జిల్లా దాకా వెళ్లి వస్తే, అక్కడ  మనం వినాల్సిన గుండెలు గొంతులు,మనసులు చాలా ఉన్నాయని, మనం తప్పకుండా వినాల్సిన సత్యాలు చాలా కాలం చాలా  మరుగునే ఉండిపోయాయని, ఇన్నేళ్లకు ఆ గొంతుల్ని ఆ గుండెల్ని
కాలమ్స్ లోచూపు

త‌త్వ‌శాస్త్ర ప్ర‌థ‌మ వాచ‌కం

తత్వశాస్త్రం అంటే సామాన్యులకు అర్థంకాని  నిగూఢమైన విషయమని చాలామంది అనుకుంటారు. అందుకు భావవాద తత్వవేత్తలు, ఆధ్యాత్మికవాదులు వాస్తవికతను మరుగుపరిచి , తత్వశాస్త్రం పట్ల మార్మికతతో వ్యవహరించడమే ప్రధాన కారణం. ఇహలోకంలోని  సామాజిక జీవితంతో సంబంధం లేని, మానవ అనుభవంలోకి రాని 'పరలోకపు' విషయాలతో గందరగోళపరచడం వల్ల సామాన్యజనం తత్వశాస్త్రాన్ని నిగూఢమనుకునేలా చేశారు. పైగా ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని దైవ సృష్టి అనడంతో ప్రజల్ని నిమిత్తమాత్రుల్ని చేశారు. అందుకే విప్లవ రచయిత చెంచయ్య గారు ప్రకృతిని, ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అనే ప్రశ్నే సరైంది కాదని ఈ పుస్తకంలో అంటారు. ఎందుకంటే- ఎవరు సృష్టించారన్న ప్రశ్నలోనే అది 'సృష్టించబడిందన్నది వాస్తవం'